HANUMANTHA VAHANAM OBSERVED_ హనుమంత వాహనంపై శ్రీ సుందరరాజస్వామివారి అభయం
Tiruchanur, 04 Jul 18: On the second day evening on Wednesday as a part of the ongoing Sundararaja Swamy Avatara Mahotsavams the processional deity took celestial ride on Hanumantha Vahanam and blessed the devotees.
Earlier in the afternoon, Abhishekam was performed to the deities between 2pm and 3.30pm.
Meanwhile the Lord will grace devotees on Garuda Vahanam on Thursday evening.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI
హనుమంత వాహనంపై శ్రీ సుందరరాజస్వామివారి అభయం
తిరుపతి, 2018 జూలై 04: తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీ సుందర రాజస్వామివారి అవతార మహోత్సవాల్లో భాగంగా రెండో రోజు బుధవారం రాత్రి స్వామివారు హనుమంత వాహనంపై భక్తులకు అభయమివ్వనున్నారు.
ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి సహస్రనామార్చన నిర్వహించారు. ఉదయం 10.30 నుండి 12.00 గంటల వరకు శ్రీ పద్మావతి అమ్మవారి కల్యాణోత్సవం కన్నులపండుగగా జరిగింది. మధ్యాహ్నం 2 నుండి 3.30 గంటల వరకు ముఖమండపంలో శ్రీ సుందరరాజ స్వామివారికి అభిషేకం నిర్వహించారు. సాయంత్రం 5.30 నుండి 6.15 గంటల వరకు స్వామివారికి ఊంజల్ సేవ వైభవంగా జరిగింది.
అనంతరం ఆలయ బయట గల వాహనమండపంలో శ్రీసుందరరాజస్వామివారిని సర్వాంగ సుందరంగా అలంకరించి హనుమంత వాహనంపై వేంచేపు చేస్తారు. రాత్రి 7 నుండి 8.30 గంటల వరకు స్వామివారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులను కటాక్షిస్తారు. కాగా గురువారం రాత్రి స్వామివారు గరుడ వాహనాన్ని అధిరోహించి భక్తులకు దర్శనమివ్వనున్నారు.
ఈ కార్యక్రమంలో శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయ ప్రత్యేకశ్రేణి ఉపకార్యనిర్వహణాధికారి శ్రీమునిరత్నంరెడ్డి, సహాయ కార్యనిర్వహణాధికారి శ్రీ సుబ్రమణ్యం, అర్చకులు, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.