RESULTS OF 36th DHARMIC EXAMS RELEASED_ 36వ సనాతన ధార్మిక విజ్ఞాన పరీక్షల ఫలితాలు విడుదల
Tirupati, 27 Jul. 19: TTD chairman Sri YV Subba Reddy announced that in the 36th sanatana Dharmic exams 39431 students out of 42992 had passed achievement of 92% outcome.
The chairman and the TTD Executive Officer, Sri Anil Kumar Singhal jointly at the Sri Padmavathi Rest House, released the results of the exams conducted for students not 6,7, 8 standards on Saturday.
Speaking on the occasion the chairman said meritorious students who excelled in the exams three from state and three-district level would be soon felicitated
In the Drama Pravesika exams Sri D Moulivaka a 7th std student from S.v High school, Tirumala topped with first rank, followed by N Nagasatya an 8th std from SBR ZP high school of East Godavari stood second, and R Sai Venkat of 8th std from TS residential school, Narayanpur, Nalgonda came third.
WINNERS OF CHITTOOR DIST
In the Dharma Paricham exams 8th std girl G.Harika Of Bala Mandir In Chittoor topped with first rank, K Jyostna Of 8th std from Aravinda in Tavanam mandal got second rank, B S Pradip from AP model school of Ramakuppam bagged the third prize.
District wise list of top three winners of the Sanatana Dharmic exams is appended.
HDPP secretary Dr Ramana Prasad and other officials participated in the event.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
36వ సనాతన ధార్మిక విజ్ఞాన పరీక్షల ఫలితాలు విడుదల
తిరుమల ఎస్వీ హైస్కూల్ విద్యార్థిని మౌలికకు రాష్ట్రస్థాయి మొదటి ర్యాంకు
తిరుపతి, 27 జూలై 2019: టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్ ఆధ్వర్యంలో ఈ ఏడాది జనవరి 27న ఉభయ తెలుగు రాష్ట్రాలు, చెన్నైలోని తెలుగు విద్యార్ధిని, విద్యార్ధులకు నిర్వహించిన 36వ సనాతన ధార్మిక విజ్ఞాన పరీక్షల ఫలితాలను టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ వైవి.సుబ్బారెడ్డి, ఈవో శ్రీ అనిల్ కుమార్ సింఘాల్ కలిసి విడుదల చేశారు. తిరుపతిలోని శ్రీ పద్మావతి విశ్రాంతి గృహంలో శనివారం ఈ కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా ఛైర్మన్ మాట్లాడుతూ హిందూ సనాతన సంప్రదాయాలు, నైతిక విలువలు, పురాణాలు లాంటి పలు విషయాలను అధ్యయనం చేసి ధార్మిక విజ్ఞాన పరీక్షలు రాసి విజయం సాధించిన విద్యార్థులను అభినందించారు. 6, 7, 8 తరగతుల విద్యార్థులకు ధర్మపరిచయం పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. మొత్తం 585 పాఠశాలలకు సంబంధించి 42,992 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారని, వీరిలో 39,431 మంది ఉత్తీర్ణులయ్యారని, 92 శాతం ఉత్తీర్ణత శాతం నమోదైందని తెలిపారు.
అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ముగ్గురు విద్యార్థులకు రాష్ట్రస్థాయి, జిల్లాస్థాయిలో వేరువేరుగా ర్యాంకులు ప్రకటించినట్టు ఛైర్మన్ తెలిపారు. సనాతన ధార్మిక విజ్ఞాన పరీక్షలలో రాష్ట్రస్థాయిలోను, ప్రతి జిల్లాలోను ప్రథమ, ద్వితీయ, తృతీయ ర్యాంకులు సాధించిన విద్యార్థులకు త్వరలో బహుమతులు ప్రదానం చేయనున్నట్లు వెల్లడించారు.
టిటిడి పాఠశాల విద్యార్థినికి రాష్ట్రస్థాయిలో మొదటి ర్యాంకు :
ధర్మపరిచయం పరీక్షల్లో తిరుమల ఎస్వీ హైస్కూల్లో 7వ తరగతి చదువుతున్న డి.మౌలిక రాష్ట్రస్థాయిలో మొదటి ర్యాంకు కైవసం చేసుకుంది. తూర్పుగోదావరి జిల్లా ఎస్‌బిఆర్‌జడ్‌పిపి హైస్కూల్ 8వ తరగతి విద్యార్థిని ఎన్.నాగసత్యశ్రీ రెండో ర్యాంకు, నల్గొండ జిల్లా నారాయణపూర్‌లోని టిఎస్ రెసిడెన్షియల్ స్కూల్ 8వ తరగతి విద్యార్థి ఆర్.సాయి వెంకట్ మూడో ర్యాంకు సాధించారు.
చిత్తూరు జిల్లాలో హారికకు మొదటి ర్యాంకు :
ధర్మపరిచయం పరీక్షల్లో చిత్తూరులోని దేవి బాలమందిర్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ 8వ తరగతి విద్యార్థిని జి.హారిక జిల్లాస్థాయిలో మొదటి ర్యాంకు కైవసం చేసుకుంది. తవణంపల్లి మండలం అరగొండలోని జిల్లా పరిషత్ హైస్కూల్ 8వ తరగతి విద్యార్థిని కె.జ్యోష్న రెండో ర్యాంకు, రామకుప్పంలోని ఎపి మోడల్ స్కూల్ 8వ తరగతి విద్యార్థి బిఎస్.ప్రదీప్ మూడో ర్యాంకు సాధించారు.
సనాతన ధార్మిక విజ్ఞాన పరీక్షలలో జిల్లాల వారీగా మొదటి మూడు స్థానాల్లో నిలిచిన విద్యార్థుల వివరాలను జతపరచడమైనది.
ఈ కార్యక్రమంలో టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్ కార్యదర్శి డా|| రమణ ప్రసాద్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.