VARALAKSHMI VRATHAM WALL POSTERS RELEASED_ వరలక్ష్మీ వ్రతం గోడపత్రికలు ఆవిష్కరణ
Tirupati, 27 Jul. 19: TTD Joint Executive Officer Sri P Basant Kumar on Saturday released the wall posters of Varalakshmi vratam of Sri Padmavathi ammavari temple, Tiruchanoor scheduled on August 9,2019 at his chambers in TTD Administrative Building in Tirupati.
Speaking on the occasion he said the vratam tickets will be available for online booking to devotees from August 2 itself and current booking neat the temple just 24 hours ahead of the event.
DyEO Smt Jhansi Rani, Superintendent Sri Eashwaraiah participated.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
వరలక్ష్మీ వ్రతం గోడపత్రికలు ఆవిష్కరణ
తిరుపతి, 2019 జూలై 27: తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఆగస్టు 9న జరుగనున్న వరలక్ష్మీ వ్రతం గోడపత్రికలను శనివారం టిటిడి తిరుపతి జెఈవో శ్రీ పి.బసంత్ కుమార్ ఆవిష్కరించారు. తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనంలో గల జెఈవో కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ తిరుచానూరులోని ఆస్థానమండపంలో ఉదయం 10 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు వరలక్ష్మీ వ్రతం జరుగనుందన్నారు. రూ.500/- టికెట్ కొనుగోలు చేసి గృహస్తులు(ఇద్దరు) వరలక్ష్మీ వ్రతంలో పాల్గొనవచ్చన్నారు. గృహస్తులు సంప్రదాయ వస్త్రాలు ధరించి పాల్గొనాలని కోరారు. అదేరోజున సాయంత్రం 6 గంటలకు శ్రీ పద్మావతి అమ్మవారు స్వర్ణరథంపై ఆలయ నాలుగు మాడవీధులలో భక్తులకు దర్శనమిస్తారని తెలిపారు. వరలక్ష్మీ వ్రతం కారణంగా ఆగస్టు 9న ఆలయంలో అభిషేకానంతర దర్శనం, లక్ష్మీపూజ, కల్యాణోత్సవం, కుంకుమార్చన, సహస్రదీపాలంకరణ సేవలతోపాటు ఉదయం, సాయంత్రం బ్రేక్ దర్శనాలను రద్దు చేశామని, భక్తులు ఈ విషయాన్ని గమనించాలని జెఈవో కోరారు.
కాగా, వరలక్ష్మీ వ్రతం టికెట్లను భక్తులు బుక్ చేసుకునేందుకు వీలుగా ఆగస్టు 2న ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచుతారు. వ్రతానికి ఒక రోజు ముందు ఆలయం వద్ద గల కౌంటర్‌లో టికెట్లు విక్రయిస్తారు.
ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి ఝాన్సీరాణి, సూపరింటెండెంట్ శ్రీ ఈశ్వరయ్య తదితరులు పాల్గొన్నారు.
తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.