ERP SOFTWARE FOR EFFECTIVE ACCOUNTING SYSTEM- EO_ ఈఆర్‌పి సాఫ్ట్‌వేర్‌పై టిటిడి ఈవో సమీక్ష

Tirupati, 15 July 2017: To enhance transparency in accounting system in TTD, the ERP should be utilised in the best possible manner, said TTD EO Sri Anil Kumar Singhal.

Reviewing with Accounts, IT , Engineering, Procurement and TCS officials in his chambers in administrative building in Tirupati, the EO said ERP provides an integrated and continuously updated view of core common databases maintained by a database management system. The Cash transactions, orders, procurement, payroll etc. could be dealt with ease with out any delay if this software is utilised in an effective way.

Adding further the EO said, by March 2018, all the departments should be integrated in this software. The Cottage Allotment System, Sales wing of Publications, CoC Application, Kalyanamandapam Software, Legal Case Management System, HRMAPS of employees etc. should also be merged under ERP for more transparency and efficiency”, he maintained.

He instructed the concerned to digitalize different trusts, estate, inventory and other departments along with transactions in marketing department. “Within stipulated time, a central master data should be designed by gathering information from all departments. The experts from TCS and IT wing of TTD should train the respective departments heads and staffs on ERP”, the EO said.

The EO also directed the officials concerned to develop TTD website in Telugu soon.

Earlier the TCS team presented a power point presentation on ERP Software.

JEO Tirupati Sri P Bhaskar, Additional FACAO Sri Balaji, CAO Sri Raviprasadu, IT Wing Chief Sri Sesha Reddy, CIO Sri Sudhakar, TCS team Sri Bhima Sekhar, Sri Satya were also present.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

ఈఆర్‌పి సాఫ్ట్‌వేర్‌పై టిటిడి ఈవో సమీక్ష

తిరుపతి, 2017 జూలై 15: టిటిడిలో ఈఆర్‌పి(ఎంటర్‌ప్రైజ్‌ రిసోర్స్‌ ప్లానింగ్‌) సాఫ్ట్‌వేర్‌ను మరింత మెరుగ్గా వినియోగించుకోవాలని ఈవో శ్రీఅనిల్‌కుమార్‌ సింఘాల్‌ అధికారులను ఆదేశించారు. తిరుపతిలోని టిటిడి పరిపాలన భవనంలో శనివారం అకౌంట్స్‌ విభాగం, ఐటి, ఇంజనీరింగ్‌, కొనుగోళ్లు, టిసిఎస్‌ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ టిటిడిలోని అన్ని శాఖల్లో కొనుగోళ్లు, చెల్లింపులు, ఉద్యోగుల జీతభత్యాల్లో ఎలాంటి జాప్యం లేకుండా చూసేందుకు ఈ సాఫ్ట్‌వేర్‌ ఉపయోగపడుతుందన్నారు. టిటిడిలో ఇన్వెంటరీ, ఎస్టేట్‌, ఇతర విభాగాల మేనేజ్‌మెంట్‌ నివేదికలు 2018 మార్చి నాటికి సిద్ధం చేయాలని సూచించారు. టిటిడికి సంబంధించిన ఆస్తుల వివరాలు, వినియోగంలో ఉన్న వివిధ రకాల వస్తువుల జాబితాను ఆయా విభాగాల నుంచి సేకరించాలని, వాటిని మరింత సమర్థవంతంగా వినియోగించుకునేందుకు శాస్త్రీయ పద్ధతులను అవలంబించాలని ఆదేశించారు. ఉద్యోగులకు సంబంధించిన హెచ్‌ఆర్‌ మ్యాప్స్‌ సాఫ్ట్‌వేర్‌ అప్లికేషన్‌ను కూడా ఈఆర్‌పికి అనుసంధానం చేయాలన్నారు. కాటేజి ఆలాట్‌మెంట్‌ సిస్టమ్‌, ప్రచురణల విక్రయ విభాగం, సెంట్రలైజ్డ్‌ ఔట్‌సోర్సింగ్‌ సెల్‌ అప్లికేషన్‌, కల్యాణమండపాల సాఫ్ట్‌వేర్‌, లీగల్‌ కేస్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌, అన్ని ట్రస్టులను ఈఆర్‌పి పరిధిలోకి తీసుకురావాలన్నారు.

కొనుగోళ్ల విభాగంలోని లావాదేవీలతోపాటు, వివిధ ట్రస్టులు, ఎస్టేట్‌ తదితర విభాగాలను కూడా డిజిటలైజ్‌ చేయాలని ఈవో సూచించారు. అన్ని విభాగాల నుంచి వచ్చిన సమాచారాన్ని క్రోడీకరించి నిర్దిష్ట కాలపరిమితితో కేంద్రీయ మాస్టర్‌ డేటాను రూపొందించాలన్నారు. ఈఆర్‌పి సాఫ్ట్‌వేర్‌ అప్లికేషన్‌పై సంబంధిత అధికారులు, సిబ్బందికి టిసిఎస్‌ అధికారుల సహకారంతో శిక్షణ ఇవ్వాలని ఆదేశించారు. టిటిడి వెబ్‌సైట్‌ను తెలుగు భాషలోనూ భక్తులకు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. అంతకుముందు ఈఆర్‌పి సాఫ్ట్‌వేర్‌పై టిసిఎస్‌ అధికారులు పవర్‌పాయింట్‌ ప్రజంటేషన్‌ ఇచ్చారు.

ఈ సమావేశంలో టిటిడి తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్‌, ఎఫ్‌ఏ, సిఏవో శ్రీ ఓ.బాలాజి, సిఏవో శ్రీ రవిప్రసాదు, ఐటి విభాగాధిపతి శ్రీ శేషారెడ్డి, సిఐఓ శ్రీ సుధాకర్‌, టిసిఎస్‌ అధికారులు శ్రీ భీమశేఖర్‌, శ్రీ సత్య తదితరులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.