ADMISSIONS INTO TTD COLLEGES FROM JULY 17-21_ జూలై 17 నుంచి 21వ తేదీ వరకు టిటిడి జూనియర్‌, డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలకు స్పాట్‌ అడ్మిషన్లు

Tirupati, 15 July 2017: For the vacant seats in TTD Junior and Degree Colleges, the spot admissions will be conducted from July 17 to 21.

According to Devasthanams Educational Officer Smt Snehalatha, students who have already applied online can join the seats available in Commerce, Science, Arts courses by bringing the original certificates, xerox copies and take part directly for spot admissions held on the above mentioned dates.

TTD is extending one more chance to the interested students who have not earlier applied online to join in these courses. The students can apply online, admission.tirumala.org and attend the spot admissions with required certificates in the college of their choice. The details of seats and groups are available on TTD website for the information of the students.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

జూలై 17 నుంచి 21వ తేదీ వరకు టిటిడి జూనియర్‌, డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలకు స్పాట్‌ అడ్మిషన్లు

తిరుపతి, 2017, జూలై 15: టిటిడి ఆధ్వర్యంలోని జూనియర్‌ కళాశాలలు, డిగ్రీ కళాశాలల్లో సైన్స్‌, కామర్స్‌, ఆర్ట్స్‌ గ్రూపుల్లో భర్తీ కాని సీట్లకు జూలై 17 నుంచి 21వ తేదీ వరకు స్పాట్‌ అడ్మిషన్లు నిర్వహించనున్నట్టు టిటిడి విద్యాశాఖాధికారి శ్రీమతి ఆర్‌.స్నేహలత శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.

ఇదివరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు ఒరిజినల్‌ ధ్రువపత్రాలు, ఒక సెట్‌ జెరాక్స్‌ కాపీతో నేరుగా తమకు ఆసక్తి ఉన్న కళాశాలలో స్పాట్‌ అడ్మిషన్లకు హాజరుకావచ్చు.

అదేవిధంగా ఇప్పటివరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోని విద్యార్థులకు మరో అవకాశం కల్పించారు. ఇలాంటి విద్యార్థులు admission.tirumala.org వెబ్‌సైట్‌ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుని ఆసక్తి ఉన్న కళాశాలలో స్పాట్‌ అడ్మిషన్లకు హాజరుకావచ్చు.

కళాశాల వారీగా, గ్రూపుల వారీగా ఉన్న సీట్ల వివరాలను టిటిడి వెబ్‌సైట్‌లో విద్యార్థులకు అందుబాటులో ఉంచారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.