JEO BHASKAR REVIEWS ERP APP AT SVETA _ ఈఆర్‌పి అప్లికేషన్‌పై జెఈవో సమీక్ష

Tirupati, 5 October 2017: TTD Joint Executive Officer Sri Pola Baskar today reviewed the latest ERP app which is designed to be implemented in the TTD administration with goal to make the administration more transparent and increase the accountability among officials.

Reviewing the ERP app with officials at the SVETA bldgs here, the JEO said that currently five key departments were implementing the e-filing app and in the second phase 10 other departments will be added to the ERP network, by March 31st 2018 all the departments will be online for better administration and service to devotees.The TCS officials provided a demoof the ERP app- e-filing on the ocassion.

Among others TTD Chief Engineer Sri Chandrasekhar Reddy, Addl FACAO Sri Balaji, IT head Sri Sesha Reddy, SVETA Director Smt Chenchulakshmi particiapted in the review meeting.


ISSUED BY PUBLIC RELATIONS OFFICER,TTDs,TIRUPATI

ఈఆర్‌పి అప్లికేషన్‌పై జెఈవో సమీక్ష

అక్టోబరు 05, తిరుపతి, 2017: టిటిడిలో మరింత పారదర్శక పాలన కోసం ఉద్దేశించిన ఎంటర్‌ప్రైజ్‌ రిసోర్స్‌ ప్లానింగ్‌(ఈఆర్‌పి) అప్లికేషన్‌పై తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్‌ గురువారం తిరుపతిలోని శ్వేత భవనంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ మొదటి దశలో ఐదు కీలక విభాగాల్లో ఈఆర్‌పిలో భాగంగా ఈ-ఫైలింగ్‌ విధానాన్ని అమలుచేస్తున్నామని, రెండో దశలో 10 విభాగాల్లో ప్రవేశపెడతామని తెలిపారు. 2018, మార్చి 31వ తేదీ నాటికి అన్ని విభాగాల్లో వర్తింపజేస్తామని వివరించారు. అనంతరం టిసిఎస్‌ అధికారులు ఈఆర్‌పి అప్లికేషన్‌పై డెమో ఇచ్చారు.

ఈ సమావేశంలో టిటిడి చీఫ్‌ ఇంజినీర్‌ శ్రీ చంద్రశేఖర్‌రెడ్డి, ఎఫ్‌ఏ,సిఏవో శ్రీ బాలాజి, ఐటి విభాగాధిపతి శ్రీ శేషారెడ్డి, శ్వేత సంచాలకులు శ్రీమతి చెంచులక్ష్మి ఇతర అధికారులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.