“EVERY EMPLOYEE SHOULD STAND UP DURING THE TIME OF CRISIS”-EO _ సమ్మెను సమర్థవంతంగా ఎదుర్కొందాం- టీటీడీ ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి

BACKUP SUPPORT SYSTEM MUST

NO HINDRANCE TO PILGRIM SERVICES

EO THANKS DISTRICT ADMN. TMC FOR EXTENDING SUPPORT

EMPLOYEES EXPRESS THEIR SOLIDARITY

Tirumala, 26 April 2023: The entire workforce of TTD should during rise up to the situation during the time of crisis and need of the hour to render services to the multitude of visiting pilgrims at any time without causing any hindrance to devotee services, asserted TTD EO Sri AV Dharma Reddy.

A meeting was held at Seva Sadan 2 in Tirumala on Wednesday evening wherein top brass officials from the district, TMC, HoDs, Principals, employees representatives of TTD participated.

Addressing the gathering the EO gave a clarion call to the TTD employees, whenever a situation of crisis or emergency arises, all the employees should stand upto the situation and ensure that the pilgrims are not put any sort of inconvenience.

“The Father of the Nation Mahatma Gandhi always given importance to Swacchta and that is the reason even the Swacch Bharat mission logo is Spectacles of Bapuji. Likewise, all the employees of TTD irrespective of cadre should gear up even to discharge sanitation duties at anytime for the next few days till a backup mechanism for sanitation workers be worked out.

The EO also thanked District Collector Sri Venkatramana Reddy, SP Sri Parameshwar Reddy, TMC Commissioner Smt Harita and above all the legislators Sri Karunakar Reddy, Sri Bhaskar Reddy who supported TTD during the crisis hour to a great extent.

He also said the services of Srivari sevaks shall also be utilised whenever necessity arises.

The EO also complimented all the Employees representatives for rising up to the situation and extending support during the hard hour.

Earlier a few HoDs, employees representatives also expressed their solidarity and complete support to the management at anytime for the reputation of the institution as well for the cause of multitude of visiting pilgrims.

JEOs Smt Sada Bhargavi, Sri Veerabrahmam, CEO SVBC Sri Shanmukh Kumar, CE Sri Nageswara Rao, FACAO Sri Balaji, DLO Sri Reddeppa Reddy, and other top officials of TTD from various departments, HoDs,  Principals were also present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

 
సమ్మెను సమర్థవంతంగా ఎదుర్కొందాం
 
– భక్తులకు అసౌకర్యం కలగకుండా పారిశుద్ధ్య చర్యలు
 
– అధికారులు, సిబ్బంది పారిశుద్ధ్య విధుల్లో పాల్గొనాలి
 
– టీటీడీ ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి
 
ఏప్రిల్‌ 26,  తిరుమల 2023: సులభ్ సంస్థలో పని చేస్తున్న పారిశుద్ధ్య కార్మికులు భక్తులకు ఇబ్బంది కలిగించేలా మెరుపు సమ్మెకు వెళ్లారని, టీటీడీలో పనిచేస్తున్న అన్ని విభాగాల అధికారులు,  రెగ్యులర్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులంతా దీన్ని ఒక యుద్ధంగా భావించి విజయం సాధించాలని టీటీడీ ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి పిలుపునిచ్చారు. పారిశుద్ధ్య కార్మికులు సమ్మె కొనసాగిస్తున్న నేపథ్యంలో బుధవారం రాత్రి తిరుమలలోని శ్రీవారి సేవా సదన్ లో జిల్లా అధికార యంత్రాంగం, అన్ని విభాగాల అధిపతులు, ఉద్యోగ సంఘాల నాయకులతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు.
 
ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ తిరుమలకు వచ్చే భక్తులకు టీటీడీ అందించే అన్ని రకాల సేవల్లో పారిశుద్ధ్యం ముఖ్యమైందన్నారు. టిటిడిలో 8 వేల మంది రెగ్యులర్, 4 వేల మంది కార్పొరేషన్ ఉద్యోగులు ఉన్నారని, ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు ఎదుర్కోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. విభాగాధిపతుల ఆధ్వర్యంలో టిటిడి ఉద్యోగులందరూ సెక్టార్లవారీగా పారిశుద్ధ్య విధులు నిర్వహించాలని కోరారు. శ్రమదానానికి ఎంతో ప్రాధాన్యత ఉందని, తిరుమల బాలాజీ నగర్ లో తమతో పాటు అధికారులు, ఉద్యోగులు కలిసి పూర్తి పరిశుభ్రంగా మార్చామని చెప్పారు. ఆసక్తి గల శ్రీవారి సేవకులను కూడా పారిశుద్ధ్య విధులు నిర్వహించడానికి ఆహ్వానించాలని పిఆర్వో ను ఆదేశించారు. దాదాపు 25 రోజులపాటు పారిశుద్ధ్య విధులు నిర్వహించాలని, ఆ తర్వాత కొత్త ఏజెన్సీని ఏర్పాటు చేసుకుని పారిశుద్ధ్య విధులు అప్పగిస్తామని చెప్పారు. మహాత్మా గాంధీని ఆదర్శంగా తీసుకుని ఉద్యోగులు పారిశుద్ధ్య విధులు నిర్వహించాలని కోరారు.
 
జిల్లా కలెక్టర్ శ్రీ వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తుల విశ్వాసం చూరగొన్న ఆధ్యాత్మిక సంస్థ టిటిడి అన్నారు. ఈ సంస్థలో భవిష్యత్తులో సమ్మెలు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మూడు రోజులపాటు తిరుపతి జిల్లాలోని పంచాయతీల నుంచి సిబ్బందిని పారిశుద్ధ్య విధులకు రప్పిస్తున్నట్టు తెలిపారు. ఈ పరిస్థితులను ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం తరపున టిటిడి కి అన్ని సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు.
 
తిరుపతి ఎస్పీ శ్రీ పరమేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ పారిశుద్ధ్య కార్మికుల సమ్మె కారణంగా ఎలాంటి శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా జిల్లా పోలీసు యంత్రాంగం తరపున అన్ని చర్యలు తీసుకున్నామని తెలిపారు. సమ్మె వెనుక కొన్ని శక్తుల కుట్ర ఉందని, వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు.
 
మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ శ్రీమతి హరిత మాట్లాడుతూ తిరుమల శ్రీవారి క్షేత్రం వల్లే తిరుపతి నగరం అభివృద్ధి చెందుతోందన్నారు. తిరుపతి నగర అభివృద్ధికి టీటీడీ సంపూర్ణ సహకారం అందిస్తోందని తెలిపారు. పారిశుద్ధ్య కార్మికుల సమ్మె నేపథ్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు.
 
వివిధ ఉద్యోగ సంఘాల నాయకులు మాట్లాడుతూ పారిశుద్ధ్య కార్మికుల సమ్మె నేపథ్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తమ సంపూర్ణ సహకారం అందించి పారిశుద్ధ్య విధుల్లో పాల్గొంటామని హామీ ఇచ్చారు.
 
జేఈవోలు శ్రీమతి సదా భార్గవి, శ్రీ వీరబ్రహ్మం, ఎస్ వి బి సి సీఈవో శ్రీ షణ్ముఖ కుమార్, ఎఫ్ఏసిఏఓ శ్రీ బాలాజీ, లా ఆఫీసర్ శ్రీ రెడ్డెప్పరెడ్డి, చీఫ్ ఇంజనీర్ శ్రీ నాగేశ్వరరావుతో పాటు అన్ని విభాగాల అధికారులు పాల్గొన్నారు.
 
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.