EVERY ONE SHOULD PROTECT THE SANCTITY OF SACRED TIRUMALA-CVSO_ తిరుమలలలో పలు ప్రాంతాలలో తనిఖీలు నిర్వహించిన టిటిడి సివిఎస్వో శ్రీ ఆకే.రవికృష్ణ

Tirumala, 10 January 2018: The Chief Vigilance and Security Officer of TTD Sri Ake Ravikrishna called up on every one to vow to protect the sanctity and serenity of sacred Tirumala Hills.

Briefing media persons near Varaha Swamy Rest House on Wednesday evening, the CVSO said, everyone who is associated with Tirumala including employees, security personnel, other departments, pilgrims, locals, media should strictly follow the do’s and don’ts prescribed for hill town to protect it’s sanctity.

The top cop of TTD told media persons, that the security check at Alipiri toll gate, Alipiri footpath and Srivarimettu will be enhanced. “Our security sleuths henceforth will wear Tirunamam and address the devotees in a polite way and ensure them feel comfortable during their pilgrimage to Tirumala. If any body come across any unscrupulous activities, they can immediately call 0877-2263695/3828 and lodge a complaint”, he added.

Earlier, the CVSO along with VGO Sri Ravindra Reddy, AVSOs Sri Nandeeshwar, Sri Chiranjeevi inspected various places in Tirumala and verified the existing security apparatus.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

తిరుమల పవిత్రను ప్రతి ఒక్కరు కాపాడాలి

తిరుమలలలో పలు ప్రాంతాలలో తనిఖీలు నిర్వహించిన టిటిడి సివిఎస్వో శ్రీ ఆకే.రవికృష్ణ

జనవరి 10, తిరుమల 2018: పవిత్ర పుణ్య క్షేత్రమైన తిరుమల పవిత్రతను ప్రతి ఒక్కరు కాపాడాలని టి.టి.డి సి.వి.ఎస్‌.ఓ శ్రీ ఆకే. రవికృష్ణ విజ్ఞప్తి చేశారు.

తిరుమలలోని వరాహస్వామి అతిథి భవన సముదాయంలో బుధవారంనాడు సాయంత్రం మిడియాతో మాట్లాడుతూ తిరుమల పవిత్రతను కాపాడేందుకు ప్రత్యేక చట్టాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. తిరుమల పవిత్రతకు భంగం కలిగించే నిషేధిత పదార్థాలను ఎవరు వినియోగించినా టి.టి.డి విజిలెన్స్‌ సిబ్బందికి తెలియచేయాలన్నారు. భద్రతా సిబ్బంది మరింత భక్తి భావంతో భక్తులకు సేవలందిస్తున్నట్లు తెలిపారు. టి.టి.డి విజిలెన్స్‌ సిబ్బంది తిరునామం ధరించి స్నేహపూర్వకంగా భక్తుల సమస్యలు పరిష్కరించాలన్నారు.

అలిపిరి టోల్‌గేట్‌, అలిపిరి, శ్రీవారిమెట్టు నడక మార్గాలలో మరింత క్షుణంగా వాహనాలను, భక్తులను తణిఖీ చేయనున్నట్లు తెలిపారు. తిరుమలలో నిషేధిత పదార్థాలను భక్తులు, స్థానికులు, టి.టి.డి సిబ్బంది, విజిలెన్స్‌ సిబ్బంది ఎవరైనా వినియోగిస్తున్న యెడల ఫోన్‌ 0877-2263695/3828 నెంబర్లకు సమాచారం అందించాలని భక్తులకు విజ్ఞప్తి చేశారు. అంతకు ముందు సి.వి.ఎస్‌.ఓ, తో కూడి వి.జి.ఓ రవీంద్రారెడ్డి, ఏ.వి.ఒస్‌.ఓలు, విజిలెన్స్‌ సిబ్బంది తిరుమలలోని పలు ప్రాంతాలలో తణిఖీలు నిర్వహించారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.