EXPERTS COMMITTEE TO ENHANCE QUALITY OF EDUCATION IN TTD EDUCATIONAL INSTITUTIONS _ విద్యా ప్రమాణాలు మెరుగు పరచడానికి నిష్ణాతులతో కమిటీ
AWARENESS ON SMART CLASSES TO FIRST STANDARD TO DEGREE LEVEL- TTD EO
Tirupati, 21 August 2021: An Experts Committee shall soon be set up to study the all aspects of quality of education, result orientation, future of students, UGC grants, Research Projects etc. to enhance the educational standards in the TTD educational institutions, said Executive Officer Dr KS Jawahar Reddy.
Addressing officials during a review meeting on performance of TTD educational institutions held at his chambers in TTD administrative buildings on Saturday evening, EO said the focus was to spread awareness about smart classes from Class 1 to Degree level to beget good results by tutoring students with higher institutions.
He asked the TTD officials to strive to procure UGC grants for the Sri Venkateswara Arts, Govindaraja Swamy Arts, SV Oriental and Sri Padmavati colleges and also to get at least 10 UGC research projects for each institution.
He directed officials to organize campus interviews in Corporate Institutions like Sri City through negotiations. He said besides recognition from NAAC, tie-ups and MoUs should be promoted with Agriculture, Veterinary, Horticultural and Cooking/ hospitality universities to procure good job opportunities for students.
He also wanted the institutions to offer Diploma and Certificate courses to become self-reliant.
The EO also directed that all students of TTD institutions should wear a single uniform and ensure that classes should commence at 8 am in all the institutions.
TTD JEO Smt Sada Bhargavi, FA & CAO Sri O Balaji, DEO Sri Govindarajan were also present.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
విద్యా ప్రమాణాలు మెరుగు పరచడానికి నిష్ణాతులతో కమిటీ
– ఒకటి నుంచి డిగ్రీ దాకా చదివే విద్యార్థులకు స్మార్ట్ క్లాస్ లపై అవగాహన
విద్యా శాఖపై సమీక్షలో అధికారులకు ఈవో ఆదేశం
తిరుపతి, 21 ఆగస్టు 2021: టిటిడి విద్యా సంస్థల్లో విద్యా ప్రమాణాలు మరింత మెరుగు పరచడానికి నిష్ణాతులతో కమిటీ ఏర్పాటు చేస్తామని టిటిడి ఈవో డాక్టర్ కె ఎస్ జవహర్ రెడ్డి చెప్పారు. విద్యా సంస్థల్లో ఉత్తమ ఫలితాల సాధన, విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు, వసతులు, యుజిసి గ్రాంట్, పరిశోధన ప్రాజెక్టులు తెచ్చే అంశాలపై ఈ కమిటీ పని చేస్తుందన్నారు. టిటిడి పరిపాలన భవనంలోని తన చాంబర్లో శనివారం ఆయన విద్యా శాఖపై సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ టిటిడి విద్యా సంస్థల్లో ఒకటి నుంచి డిగ్రీ దాకా చదివే విద్యార్థులకు స్మార్ట్ క్లాస్ లపై అవగాహన కల్పించి, ఉత్తమ ఫలితాలు సాధించేలా పెద్ద సంస్థలతో శిక్షణ ఇప్పించడానికి చర్యలు తీసుకోవాలన్నారు. టిటిడి నిర్వహణలోని శ్రీ వేంకటేశ్వర, శ్రీ గోవింద రాజ స్వామి, ఓరియంటల్, శ్రీ పద్మావతి మహిళా కళాశాలలకు యూజిసి ప్రాజెక్టులు సాధించడం పైన శ్రద్ధ పెట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రతి కళాశాల యూజిసి నుంచి కనీసం పది పరిశోధన ప్రాజెక్టులు తెచ్చుకోగలిగేలా కృషి చేయాలని ఈవో సూచించారు. టిటిడి కళాశాలల్లో విద్యా ప్రమాణాలు మరింత మెరుగు పరచాలన్నారు. మౌళిక వసతులు, పరిశోధనలకు అనువైన వాతావరణం కల్పించడం ద్వారా శ్రీ సిటి లాంటి పెద్ద సంస్థలతో అవగాహన కుదుర్చుకుని క్యాంపస్ ఇంటర్వ్యూలు నిర్వహించాలన్నారు.
టిటిడి కళాశాలలకు న్యాక్ లో ఉత్తమ గుర్తింపు లభించేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని చెప్పారు.వ్యవసాయ,పశు వైద్య, ఉద్యాన, పాక శాస్త్ర విశ్వ విద్యాలయాలతో ఎంఓయులు కుదుర్చుకుని విద్యార్థులకు మంచి అవకాశాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలన్నారు. కళాశాలల స్వయం సమృద్ధి కోసం డిప్లొమో, సర్టిఫికెట్ కోర్సులు ప్రారంభించాలని చెప్పారు.
టిటిడి విద్యా సంస్థలన్నింటిలో ఒకే రకమైన యూనిఫాం ఉండాలన్నారు. ఉదయం 8 గంటలకు తరగతులు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు.
జెఈవో శ్రీమతి సదా భార్గవి, ఎఫ్ఏ సిఏఓ శ్రీ బాలాజి, విద్యా శాఖాధికారి శ్రీ గోవింద రాజన్ పాల్గొన్నారు.
టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది