EXTENDED SECURITY FOR DEVOTEES- TTD CVSO _ భక్తులకు పటిష్టంగా భద్రతా ఏర్పాట్లు

3 LAYER CHECKING AND FRISKING

 

NO HARATIS ON GARUDA SEVA

 

Tirumala, 26 September 2022:  TTD CVSO Sri Narasimha Kishore said that all out efforts are being made for providing a pleasant and trouble-free Darshan and vahana sevas for devotees during the ensuing Srivari Brahmotsavams in Tirumala.

 

Addressing media on the eve of Srivari Brahmotsavam at Annamaiah Bhavan in Tirumala on Monday, the CVSO said TTD is operating a three-layer checking and frisking to ensure the safety and security of devotees from anti-socials and other possible threats.

 

First check is at the Alipiri checkpoint, later inside Srivari temple and thereafter at Mada streets.

 

Secondly TTD has installed 2200 CC cameras and another 1500 more are on the anvil in the third phase.

 

“We are planning to cover even the Ghat roads in a phased manner”.

 

He said about 5000 strong force including special squads against thefts, law and order, and a SPF contingent of 460 are being deployed in addition to the existing TTD vigilance for the Srivari Brahmotsavam. Especially for Garuda Seva an additional force of 1256 personnel are being deployed.

 

He said focus of the security forces is to reduce congestion and in that direction vehicles and men will be stopped at Alipiri itself, if the crowds at Tirumala cross the manageable limits.

 

The ongoing Puratasi month anticipated to bringing massive devotees from Tamilnadu is a challenge for TTD during Brahmotsavam.

 

He said the Mada streets galleries have a sitting capacity of 1.25 lakhs but almost 2.25 lakhs could be managed by moving crowds after darshsn from galleries by accommodating upto 10,000 at each of the gates. A chart of Do’s and Don’ts are being issued to all security personnel to follow and ensure devotee comforts and convenience.

 

Special arrangements are made for press, police and employees via Bedi Anjaneya temple through ES-7 and exit through ES-6 gates. 

 

He said during Brahmotsavam special routes also have been earmarked for devotees to enter Sarva Darshan queues through VQC-1&2.

 

He said major hurdles and a eyesore for Tirumala is the menace of stranded chappals scattered all over in heaps.

 

Secondly he urged devotees to opt for steel or copper bottles instead of glass bottles in place of plastic bottles which are banned.

 

He said that to provide more darshan to a larger audience, TTD board has cancelled haratis on Garuda Seva day while on other days haratis will continue.

 

TTD has also organised 24 swimmers during Chakra Snanam.

 

Tirumala VGO Sri Bali Reddy was also present.

 

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

భక్తులకు పటిష్టంగా భద్రతా ఏర్పాట్లు

– మూడంచల భద్రతా విధానం

– గరుడ సేవలో హారతి ఉండదు

– మీడియా స‌మావేశంలో సివిఎస్వో శ్రీ న‌ర‌సింహ కిషోర్‌

తిరుమల, 2022 సెప్టెంబ‌రు 26: తిరుమలలో జరిగే శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భక్తులకు సంతృప్తికరంగా మూలమూర్తి దర్శనం, వాహనసేవల దర్శనం కల్పించేందుకు అన్ని చర్యలు తీసుకున్నామని, పటిష్టంగా భద్రతా ఏర్పాట్లు చేప‌ట్టామ‌ని టిటిడి సివిఎస్వో శ్రీ నరసింహకిషోర్ తెలిపారు.

తిరుమల అన్నమయ్య భవనంలో సోమవారం సివిఎస్‌వో మీడియాతో మాట్లాడుతూ అసాంఘిక శ‌క్తుల నుండి భక్తులకు ప‌టిష్ట‌మైన భ‌ద్ర‌త క‌ల్పించేందుకు మూడంచ‌ల భ‌ద్ర‌తా విధానాన్ని అమ‌లు చేస్తున్నామ‌ని, ప్ర‌తి ఒక్క‌రినీ క్షుణ్ణంగా త‌నిఖీ చేసిన త‌రువాతే అనుమ‌తిస్తామ‌ని తెలిపారు. మొద‌టి ద‌శ‌లో అలిపిరి చెక్ పాయింట్ వద్ద, రెండో ద‌శ‌లో శ్రీవారి ఆలయంలోకి ప్ర‌వేశించే ముందు, మూడో ద‌శ‌లో మాడ వీధుల్లోకి అనుమ‌తించే ముందు త‌నిఖీలు చేప‌డ‌తామ‌న్నారు. తిరుమ‌ల‌లో 2200 సిసి కెమెరాల ద్వారా భ‌ద్ర‌త‌ను ప‌ర్య‌వేక్షిస్తున్నామ‌ని, మూడో ద‌శ‌లో 1500 సిసి కెమెరాలు ఏర్పాటు చేస్తామ‌ని చెప్పారు. దశలవారీగా ఘాట్‌ రోడ్లను కూడా సిసి కెమెరాల ద్వారా కవర్ చేస్తామ‌న్నారు.

శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో దొంగ‌త‌నాలు జ‌ర‌గ‌కుండా చూసేందుకు, శాంతిభద్రతలను అదుపు చేసేందుకు టిటిడి విజిలెన్స్ సిబ్బందితో పాటు ప్రత్యేక స్క్వాడ్‌లు, 460 మంది ఎస్‌పిఎఫ్ సిబ్బంది క‌లిపి 5000 మంది బలగాలను మోహరిస్తున్నట్లు చెప్పారు. ప్రత్యేకంగా గరుడ సేవ కోసం 1256 మంది సిబ్బందిని అదనంగా ర‌ప్పిస్తున్న‌ట్టు వివ‌రించారు. తిరుమలలో ప‌రిమితికి మించి వాహ‌నాల రద్దీ పెరిగితే వాహ‌నాల‌ను అలిపిరిలోనే నిలిపివేస్తామన్నారు.

పెర‌టాసి మాసంలో బ్రహ్మోత్సవాలు రావ‌డంతో తమిళనాడు నుండి భారీ సంఖ్యలో భక్తులు వ‌చ్చే అవ‌కాశ‌ముంద‌న్నారు. మాడ వీధుల్లోని గ్యాలరీల్లో 1.25 లక్షల మంది కూర్చునే అవ‌కాశం ఉంద‌ని, వాహ‌న‌సేవ మొద‌లుకాగానే ఒక్కో గేటు నుండి 10 వేల మందికి అద‌నంగా ద‌ర్శ‌నం చేయించ‌డం వ‌ల్ల మొత్తం 2.25 లక్షల మందికి ద‌ర్శ‌నం చేయించ‌వ‌చ్చ‌ని తెలిపారు. తిరుమ‌ల‌లో చేయాల్సిన‌వి, చేయ‌కూడ‌ని అంశాల్లో భ‌క్తుల‌కు విస్తృతంగా ప్ర‌చారం చేస్తున్న‌ట్టు చెప్పారు. మీడియా, పోలీసులు, టిటిడి ఉద్యోగుల కోసం శ్రీ బేడి ఆంజనేయ దేవాలయం వ‌ద్ద ES-7 గేటు ద్వారా ప్ర‌వేశం క‌ల్పిస్తామ‌ని, ES-6 గేటు ద్వారా వెలుప‌లికి రావడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశామ‌న్నారు. బ్రహ్మోత్సవం సందర్భంగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌-1, 2 ద్వారా సర్వదర్శనం క్యూలైన్లలోకి భక్తులు ప్రవేశించేందుకు ప్రత్యేక మార్గాలను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు.

తిరుమ‌ల‌లో పాద‌ర‌క్ష‌ల కౌంట‌ర్ల వ‌ద్ద మాత్ర‌మే పాద‌ర‌క్ష‌లు ఉంచాల‌ని, చెల్లాచెదరుగా ప‌డ‌వేయ‌రాద‌ని కోరారు. ప్లాస్టిక్ వాట‌ర్ బాటిళ్ల స్థానంలో గాజు సీసాలు లేదా స్టీల్ లేదా రాగి సీసాల‌ను వినియోగించాల‌ని భక్తులను కోరారు. ఎక్కువ మంది భ‌క్తుల‌కు దర్శనం కల్పించేందుకు వీలుగా గరుడసేవ రోజున హారతిని టిటిడి బోర్డు రద్దు చేసిందని, మిగతా రోజుల్లో హారతులు కొనసాగుతాయని చెప్పారు. చక్రస్నానం సందర్భంగా 24 మంది ఈతగాళ్లను కూడా ఏర్పాటు చేశామ‌న్నారు.

మీడియా స‌మావేశంలో తిరుమల విజివో శ్రీ బాలిరెడ్డి పాల్గొన్నారు.

టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయ‌బ‌డిన‌ది.