EXTENSIVE ARRANGEMENTS FOR TONSURE SERVICES AT TIRUMALA _ తిరుమలలో భక్తుల తలనీలాల సమర్పణకు విస్తృత ఏర్పాట్లు
Tirumala, 14 October 2026: Extensive arrangements have been made to facilitate the smooth conduct of tonsure services for devotees visiting Tirumala and fulfilling their vows in the form of offering hair, said DyEO (FAC) Sri Ramakanta Rao.
Addressing the media at Media Centre in Rambagicha-2 at Tirumala on Wednesday, he said that, in addition to the main Kalyanakatta, 11 mini-Kalyanakattas have been operating.
A total of 1,200 barbers, including 260 women barbers, have been deployed to help devotees fulfil their traditional vows.
Besides, four more Kalyanakattas are also functioning at TTD temples in Tirupati.
Each barber is expected to serve approximately 45 devotees every day.
He said that nearly three lakh devotees offered their hair during the nine-day Srivari Salakatla Brahmotsavams.
Special services by women barbers have been arranged to ensure convenience for women and young children offering their hair.
Feedback on the conduct of barbers and the facilities provided is being collected from devotees through QR codes, IVRS and Srivari Sevaks at every Kalyanakatta.
Special arrangements have also been made to play Govinda Namas while devotees offer their hair, creating a spiritual and serene atmosphere during the ritual.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER
తిరుమలలో భక్తుల తలనీలాల సమర్పణకు విస్తృత ఏర్పాట్లు
ప్రధాన కల్యాణకట్టతో పాటు 11 మినీ కల్యాణకట్టలు
దాదాపు 1,200 మంది క్షురకులతో నిరంతర సేవలు
మహిళలు, చిన్నారుల కోసం ప్రత్యేకంగా మహిళా క్షురకులు
తిరుమల, అక్టోబరు 14, 2026: తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారికి మొక్కుబడిగా తలనీలాలు సమర్పించే భక్తులకు మెరుగైన సేవలు అందించేందుకు విస్తృత ఏర్పాట్లు చేసినట్లు టీటీడీ కల్యాణకట్ట డిప్యూటీ ఈవో శ్రీ రమాకాంత్ తెలిపారు.
తిరుమలలోని రామ్ భగీచా-2 మీడియా సెంటర్లో బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తిరుమలలో ప్రధాన కల్యాణకట్టతో పాటు 11 మినీ కల్యాణకట్టలు, తిరుపతిలోని టీటీడీ ఆలయాల్లో మరో నాలుగు కల్యాణకట్టల ద్వారా భక్తులకు సేవలు అందిస్తున్నట్లు తెలిపారు.
తొమ్మిది రోజుల్లో 3 లక్షల మంది భక్తుల తలనీలాల సమర్పణ
తిరుమలలో దాదాపు 1,200 మంది క్షురకులు విధులు నిర్వహిస్తుండగా, వీరిలో సుమారు 260 మంది మహిళా క్షురకులు ఉన్నట్లు తెలిపారు. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల తొమ్మిది రోజుల్లో దాదాపు మూడు లక్షల మంది భక్తులు తలనీలాలు సమర్పించగా, నవరాత్రి బ్రహ్మోత్సవాల తొలి రెండు రోజుల్లో సుమారు 60 వేల మంది భక్తులు మొక్కులు చెల్లించుకున్నట్లు వెల్లడించారు.
మహిళలు, చిన్నారులు సౌకర్యవంతంగా తలనీలాలు సమర్పించేందుకు మహిళా క్షురకుల ద్వారా ప్రత్యేక సేవలు అందిస్తున్నట్లు పేర్కొన్నారు.
పరిశుభ్రతకు ప్రాధాన్యం.. భక్తుల అభిప్రాయాలకు పెద్దపీట
కల్యాణకట్టల్లో పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యం ఇస్తూ, భక్తులు ప్రశాంతంగా తలనీలాలు సమర్పించేలా ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. క్షురకుల ప్రవర్తన, సౌకర్యాలపై క్యూఆర్ కోడ్, ఐవీఆర్ఎస్, శ్రీవారి సేవకుల ద్వారా భక్తుల అభిప్రాయాలను సేకరిస్తున్నట్లు చెప్పారు. భక్తులకు ఏ చిన్న సమస్య ఎదురైనా తక్షణమే స్పందించి పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని, గత రెండున్నరేళ్లలో ఫిర్యాదులు గణనీయంగా తగ్గాయని వివరించారు.
గోవింద నామస్మరణతో ఆధ్యాత్మిక వాతావరణం
భక్తులు తలనీలాలు సమర్పించే సమయంలో గోవింద నామాలు వినిపించేలా ఏర్పాట్లు చేయడంతో కల్యాణకట్టల్లో ఆధ్యాత్మిక, ప్రశాంత వాతావరణం నెలకొందని తెలిపారు.
భక్తులకు ప్రత్యక్షంగా సేవలందించే క్షురకుల ఆరోగ్య పరిరక్షణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని, ప్రతి మూడు నెలలకు ఒకసారి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో శ్వేత డైరెక్టర్ (ఎఫ్ఏసీ) డాక్టర్ వేమా వేంకట రత్నం పాల్గొన్నారు.

