UNINTERRUPTED DISTRIBUTION OF ANNAPRASADAM DURING BRAHMOTSAVAMS _ సమష్టి కృషితో నిరంతరాయంగా భక్తులకు అన్న ప్రసాదాలు పంపిణీ
Tirumala, 14 October 2026: The Annaprasadam wing of TTD is fully geared to meet the expected 30 per cent increase in devotee turnout during the ongoing Srivari Navaratri Brahmotsavams, as compared with the Salakatla Brahmotsavams, said Sri Rajendra Kumar Deputy Executive Officer, Annaprasadam Department.
Addressing a media conference at the Media Centre in Rambageecha-2, Tirumala, on Wednesday he said Annaprasadam is being distributed to devotees without interruption, thanks to the collective efforts of all departments concerned.
He said special arrangements have been made to ensure uninterrupted distribution of Anna Prasadam from 7 a.m. till midnight on the day of the Garuda Seva.
Buttermilk, juice packets and biscuits would also be distributed to devotees along the four Mada Streets and other key locations, ensuring that they do not face any inconvenience.
As many as 30 Mutts in Tirumala have come forward to distribute Annaprasadam on the day of the Garuda Seva.
Arrangements have been made to distribute nearly three lakh packets of buttermilk by deploying 1,067 staff, 700 Srivari Sevaks.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER
సమష్టి కృషితో నిరంతరాయంగా భక్తులకు అన్న ప్రసాదాలు పంపిణీ
గరుడసేవకు ప్రత్యేక ఏర్పాట్లు
టీటీడీ అన్న ప్రసాదం విభాగం డిప్యూటీ ఈవో శ్రీ రాజేంద్ర కుమార్
తిరుమల, 2026 అక్టోబర్ 14: అన్ని విభాగాల సమష్టి కృషితో తిరుమలలో భక్తులకు నిరంతరాయంగా అన్న ప్రసాదాలు పంపిణీ చేస్తున్నట్లు టీటీడీ అన్న ప్రసాదం విభాగం డిప్యూటీ ఈవో శ్రీ రాజేంద్ర కుమార్ తెలియజేశారు.
తిరుమలలోని రామ్ భగీచా-2లోని మీడియా సెంటర్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
తిరుమల సాలకట్ల బ్రహ్మోత్సవాలకు విచ్చేసిన భక్తుల సంఖ్య ఆధారంగా అదనంగా దాదాపు 30 శాతం మంది భక్తులు అధికంగా వస్తారన్న అంచనాతో నవరాత్రి బ్రహ్మోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు చేపట్టినట్లు తెలిపారు. తిరుమలకు విచ్చేసిన ప్రతి భక్తుడికి అన్న ప్రసాదాలు పంపిణీ చేసేలా అన్న ప్రసాద విభాగం విశేష కృషి చేస్తున్నట్లు చెప్పారు.
క్యాటరింగ్ ప్రత్యేక అధికారి శ్రీ జీ ఎల్ ఎన్ శాస్త్రీ మాట్లాడుతూ అన్న ప్రసాదాల నాణ్యత, రుచిపై ఈ ఏడాది ఫిర్యాదుల రహితం కావడం విశేషమని తెలిపారు. గరుడ సేవ రోజున ఉదయం 7 గంటల నుండి అర్ధ రాత్రి 12 గంటల వరకు నిరంతరాయంగా అన్న ప్రసాదాలు పంపిణీ చేసేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించామని చెప్పారు. నాలుగు మాడ వీధులు, ఇతర ముఖ్య ప్రాంతాల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్న ప్రసాదాలతో పాటు మజ్జిగ, జ్యూస్ ప్యాకెట్లు, బిస్కెట్ల పంపిణీకి ఏర్పాట్లు చేశామని చెప్పారు.
తిరుమలలోని దాదాపు 30 మఠాల నిర్వాహకులు గరుడసేవ రోజున అన్న ప్రసాదాలు పంపిణీ చేసేందుకు ముందుకురావడంతో వారి సహకారం కూడా తీసుకుని విస్తృతంగా అన్న ప్రసాదాల పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు.
గరుడసేవ రోజున దాదాపు మూడు లక్షల మజ్జిగ ప్యాకెట్ల పంపిణీకి ఏర్పాట్లు చేశామన్నారు. 1067 మంది అన్న ప్రసాదం సిబ్బంది, 700 శ్రీవారి సేవకులు, 200 మంది ఇతర వాలంటీర్ల ద్వారా అన్న ప్రసాదాల పంపిణీకి సమగ్ర ఏర్పాట్లు చేశామని చెప్పారు.
ఈ కార్యక్రమంలో టీటీడీ శ్వేతా డైరెక్టర్ డాక్టర్ వేమా వేంకటరత్నం, అన్న ప్రసాదం (వైకుంఠం) ఏఈవో శ్రీ కృష్ణారావు పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.



