FEAST OF DANCE AND BHAJANS AT KALPAVRUKSHA VAHANAM FETE_ కల్పవృక్ష వాహనసేవలో కళానీరాజనం

Tirumala, 26 September 2017: Aghora dance by 50 members of the Sri Maruti Nasik dolu team led by Sri Shivramakrishna performed in front of the Kalpavruksha vahanam from Rajanmundry won the hearts of the devotees on the mada streets. Aghora artists danced to the drum beats with trishul around the artists adorning the role of gods-Brahma, Maheswara, Vinayaka etc. The cultural feast was organised by the artists of HDPP,Annamacharya project, and Dasa Sahitya.

The 20 artists of Gudiyattam also presented Dappu vadyam with 4 big drums, 8 small drums and 4 talas at the vahanam.

Another team from Rajahmundry led by Smt Hemalatha of the Garudadrivasa Bhajana mandali presented the unique Sagara Mathanam depicting the Mahalakshmi, Kamadhenu and Kalpavruksha.

The highlight of the vahanam procession was the legim display by 60 artists led by Sri Aravind Kapoor of the Sholapur, Dance by the Maharashtra. Dressed as gopikas with butter pots enthralled the devotees in the galleries. Chakka Bhajans and Kolatas were also part of the entourage of the Lord Malayappaswamy at the four mada streets.


ISSUED BY PUBLIC RELATIONS OFFICER,TTD, TIRUPATI

కల్పవృక్ష వాహనసేవలో కళానీరాజనం

సెప్టెంబర్‌ 26, తిరుమల 2017: శ్రీవారి సాలకట్ల బ్రహ్మూెత్సవాల్లో నాలుగో రోజైన మంగళవారం ఉదయం కల్పవృక్ష వాహనసేవలో కళాబృందాలు తమ ప్రదర్శనలతో స్వామివారికి కళానీరాజనం సమర్పించాయి. టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్‌, అన్నమాచార్య ప్రాజెక్టు, దాససాహిత్యప్రాజెక్టుల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కళాబృందాల ప్రదర్శనలు భక్తులను అలరించాయి.

అలరించిన అఘోరా నృత్యం :

రాజమండ్రికి చెందిన శ్రీ మారుతి నాసిక్‌ డోలు బృందం ప్రదర్శించిన అఘోరా నృత్యం భక్తులను అలరించింది. శ్రీ శివరామకృష్ణ ఆధ్వర్యంలో 50 మంది కళాకారులు ఈ ప్రదర్శన ఇచ్చారు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, వినాయకుడు దేవతారూపాలు ధరించిన కళాకారులు మధ్యలో నిలిచి ఉండగా, అఘోరా వేషధారణలోని కళాకారులు శూలాలతో నృత్యం చేశారు. ముగ్గురు కళకారులు డోలు వాయిస్తుండగా అందుకు అనుగుణంగా అఘోరాలు అడుగులు వేసి ముందుకు కదిలారు.

లయబద్ధంగా గుడియాత్తం కళాకారుల డప్పు వాద్యం :

తమిళనాడులోని గుడియాత్తంకు చెందిన కళాకారుల డప్పు వాయిద్య ప్రదర్శన లయబద్ధంగా సాగింది. శ్రీవారి ట్రస్టుకు చెందిన శ్రీ శివనటేషన్‌ ఆధ్వర్యంలో 20 మంది కళాకారులు ఈ ప్రదర్శన ఇచ్చారు. ఇందులో 4 పెద్ద డ్రమ్స్‌, 8 డప్పులు, 4 తాశాలు ఉన్నాయి. పెద్ద డ్రమ్స్‌ను లయబద్ధంగా వాయిస్తుండగా డప్పు కళాకారులు వారిని అనుసరిస్తూ గుండ్రంగా తిరుగుతూ ప్రదర్శన ఇచ్చారు.

సాగరమథనంలో ఉద్భవించిన కల్పవృక్షం :

రాజమండ్రికి చెందిన శ్రీమతి హేమలత ఆధ్వర్యంలో శ్రీ గరుడాద్రివాసా భజన మండలి సభ్యులు సాగరమథనంలో కల్పవృక్షం ఉద్భవించే ఘట్టాన్ని ప్రదర్శించారు. ఒకవైపు దేవతలు, మరోవైపు రాక్షసులు అమృతం కోసం సాగరాన్ని మథించగా, అందులో నుంచి శ్రీమహాలక్ష్మి అమ్మవారు, కామధేనువు, కల్పవృక్షం ఉద్భవించిన తీరును చక్కగా ప్రదర్శించారు.

అలాగే, మహారాష్ట్రలోని షోలాపూర్‌కు చెందిన శ్రీ అరవింద పునూర్‌ ఆధ్వర్యంలో 60 మంది కళాకారులు ప్రదర్శించిన లెజిమ్‌ వాద్య విన్యాసం ఆకట్టుకుంది. గోపికల వేషధారణలో బాలికలు వెన్నకుండతో నృత్యం చేయడం, పిఠాపురానికి చెందిన శ్రీవేంకటేశ్వర అన్నమాచార్య సేవా సంఘం ప్రదర్శించిన కోలాటం, చెక్కభజనలు భక్తుల్లో భక్తిభావాన్ని నింపాయి.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది