TTD EO RELEASES TTD PUBLICATIONS AT VAHANAMS_ కల్పవృక్ష వాహనసేవలో ఆవిష్కరించిన ఆధ్యాత్మిక గ్రంథాలు
Tirumala, 26 September 2017: Books on daily rituals at Srivari Temple,commentary on Atharvana Veda and bhakti culture of Purandasadasa were the highlights of the publications relased by the TTD executive officer, Sri Anil Kumar Singhal on the 4th day of the ongoing annual Brahmotsvam-2017
The books released included Sri Venkateswaraswamivari Puja vidhanamu (Telugu) by Sriman Archakam Ramakrishna Dikshitulu, Tirumalesudi Darbar (Telugu) by Sri Julakanti Balasubramanyam, Atharvana Veda samhita (7th volume) by Dr Kompalli Satyanarayana and Dr Chirvavuri Shivramakrishna Sharma and Purandara Dasu by Dr S Rajeswara Shastri.
Speaking on the occasion the TTD Executive officer said that TTD has been publishing all relevant works with regard to Srivari Temple and Sanatana Hindu dharma.’TTD is committed to propagation and protection of ancient knowledge and sacred Vedic works as part of its role as custodian of Vedic culture.
Among others CVSO Sri Ake Ravikrishna and temple priests and officials participated in the event
ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTD,TIRUPATI
కల్పవృక్ష వాహనసేవలో ఆవిష్కరించిన ఆధ్యాత్మిక గ్రంథాలు
సెప్టెంబర్ 26, తిరుమల 2017: శ్రీవారి సాలకట్ల బ్రహ్మూటత్సవాల్లో నాలుగో రోజైన మంగళవారం ఉదయం శ్రీమలయప్పస్వామివారు కల్పవృక్ష వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా టిటిడి ప్రచురణల విభాగం ఆధ్వర్యంలో రూపొందించిన 4 ఆధ్యాత్మిక గ్రంథాలను టిటిడి ఈవో శ్రీఅనిల్‌కుమార్ సింఘాల్, తిరుమల జెఈవో శ్రీకె.ఎస్.శ్రీనివాసరాజు, సివిఎస్‌వో శ్రీ ఆకె.రవిక ష్ణ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో టిటిడి ప్రచురణల విభాగం ప్రత్యేకాధికారి డా|| తాళ్లూరు ఆంజనేయులు, సబ్ ఎడిటర్ డా|| నొస్సం నరసింహాచార్యులు, గ్రంథ రచయితలు పాల్గొన్నారు.
శ్రీవేంకటేశ్వరస్వామివారి పూజావిధానము (తిరుమల క్షేత్ర సంప్రదాయ అనుసరితం):
ఈ గ్రంథాన్ని టిటిడి అనువంశిక అర్చకులు శ్రీమాన్ అర్చకం రామకృష్ణ దీక్షితులు రచించారు. తిరుమల దివ్యక్షేత్రంలో నిత్యం శ్రీనివాస భగవానునికి నిత్చార్చనలు జరుగుతున్నాయి. తమ ప్రాంతాల్లో, తమ ఆలయాల్లో, తమ గృహాల్లో శ్రీవేంకటేశ్వరస్వామివారిని సేవించుకునే భక్తులకు సులభతరంగా, అనుసరణీయంగా ఉండేందుకు పూజా విధానం అవసరం. ఆ అవసరాన్ని తీరుస్తూ ఈ గ్రంథాన్ని శ్రీమాన్ అర్చకం రామకృష్ణ దీక్షితులు రచించారు.
తిరుమలేశుడి దర్బార్ :
ఈ గ్రంథాన్ని సప్తగిరి మాసపత్రిక పూర్వ సంపాదకులు శ్రీ జూలకంటి బాలసుబ్రహ్మణ్యం రచించారు. ఇందులో నిత్యకల్యాణ చక్రవర్తి అయిన శ్రీవేంకటేశ్వరుని గురించిన 18 వ్యాసాలున్నాయి. అన్నీ ఆయా ప్రత్యేక సందర్భాల్లో శ్రీనివాస భగవానునికి జరిగే ఉత్సవ విశేషాలను గురించి తెలుపుతున్నవే. ఈ వ్యాసాలన్నీ టిటిడి సప్తగిరి మాసపత్రికలో ప్రత్యేకవ్యాసాలుగా ప్రకటించబడి భక్తపాఠకుల విశేషమైన ఆదరాభిమానాలను చూరగొన్నాయి.
అథర్వవేద సంహిత (7వ సంపుటం)(తెలుగు అనువాదం):
ఈ గ్రంథాన్ని డా|| కొంపెల్ల సత్యనారాయణ, డా|| చిఱ్ఱావూరి శివరామకృష్ణశర్మ రచించారు. వేద వాఙ్మయాన్ని సామాన్య ప్రజానీకానికి వివరణాత్మకంగా అందించే ప్రక్రియలో భాగంగా టిటిడి ప్రస్తుతం అథర్వవేద సంహితను 10 సంపుటాలుగా ప్రచురిస్తోంది. ప్రస్తుత గ్రంథం 7వ సంపుటం. ఇందులో 16, 17, 18 కాండలున్నాయి. 16వ కాండను డా|| కొంపెల్ల సత్యనారాయణ, 17, 18వ కాండలను డా|| చిఱ్ఱావూరి శివరామకృష్ణశర్మ రచించారు. అథర్వ వేదంలో శారీరక చికిత్స, రాజధర్మాలు, మానవజీవితంలో వచ్చే అనేక సమస్యలను తొలగించుకోవడానికి ప్రార్థనలు, శాంతి పౌష్టిక కర్మలు, రాజకర్మలు, పురోహిత కర్మలు మొదలైనవి ఉన్నాయి. 16వ కాండలో శాంత్యుదక మంత్రాలు, సూర్యాదుల ప్రార్థన, దుస్వప్నదోష శాంతి ప్రార్థనలు, 17వ కాండలో సూర్యప్రార్థన, ఇంద్రప్రార్థన, ఉష్ణదేవతల ప్రార్థనలు, 18వ కాండలో శవదహన ప్రకరణ, యమీ, యమసంవాదం, అగ్ని, ఇంద్రుడు, యముడు, సరస్వతి, పితృదేవతల ప్రార్థనలు, పరలోకానికి సంబంధించిన మంత్రాలు మొదలైనవి ఉన్నాయి.
పురందరదాసు :
ఈ గ్రంథాన్ని డా|| ఎస్.రాజేశ్వరశాస్త్రి రచించారు. భావిభారత పౌరులైన పిల్లలకు సభ్యత, సంస్కారాలు నేర్పి కుటుంబానికి, దేశానికి పేరు ప్రతిష్టలు తెచ్చేలా తీర్చిదిద్దాలనే సంకల్పంతో టిటిడి శ్రీనివాస బాలభారతి గ్రంథమాలను తెలుగులో ప్రారంభించింది. పురాణ ఇతిహాసాల్లోని మహాపురుషుల జీవితగాథలను పిల్లలకు సంక్షిప్తంగా కథల రూపంలో పరిచయం చేసే ఈ గ్రంథమాలను తెలుగులోనే గాక ఇతర భాషలైన ఇంగ్లీషు, హిందీలోకి అనువదించి అందిస్తున్నాం. ఇందులో భాగమే పురందరదాసు. పరమలోభిగా ఉన్న వ్యక్తి ఎలా పరమసాత్వికుడుగా మారి సకల సంపదలను దానధర్మాలు చేసి భగవంతుని స్మరిస్తూ జీవితాన్ని గడిపి ఎలా పరమాత్ముడిని చేరుకున్నాడో తెలియజేసే గ్రంథమే పురందరదాసు. దీనిని ఆంగ్లంలోకి అనువదించినవారు డా|| ఎస్.రాజేశ్వరశాస్త్రి.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.