FESTIVALS IN SRI GT IN THE MONTH OF MARCH _ మార్చిలో శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో విశేష ఉత్సవాలు
Tirupati, 3 Mar 20: Series of festivals have been lined up in the month of March in Sri Govindaraja Swamy temple at Tirupati.
March 6, 13, 20,27 : Procession of Andal Ammavaru in mada streets on every friday evening
March 9 : Pournami Garuda Seva
March 10: Uttara Nakshatram procession of Sri Govindaraja Swamy
March 20: Procession of Sri Kalyana Venkateswara Swamy in mada streets along with Sridevi and Bhudevi on the occasion of Sravana Nakshatram
March 30: Procession of Sri Rukmini Satyabhama Sametha Sri Parthasaradhi Swamy along mada streets on the occasion of Rohini Nakshatram
ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI
మార్చిలో శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో విశేష ఉత్సవాలు
తిరుపతి, 2020 మార్చి 03 ;టిటిడికి అనుబంధంగా ఉన్న తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో మార్చి నెలలో పలు విశేష ఉత్సవాలు జరుగనున్నాయి. వాటి వివరాలు ఇలా ఉన్నాయి.
– మార్చి 6, 13, 27వ తేదీల్లో శుక్రవారం నాడు సాయంత్రం 5.30 గంటలకు శ్రీ ఆండాళ్ అమ్మవారు ఆలయ మాడవీధుల్లో భక్తులకు దర్శనమిస్తారు.
– మార్చి 9న పౌర్ణమి సందర్భంగా సాయంత్రం 6.00 గంటలకు స్వామివారు గరుడ వాహనంపై విహరిస్తారు.
– మార్చి 10న ఉత్తర నక్షత్రాన్ని పురస్కరించుకుని సాయంత్రం 5.30 గంటలకు ఉభయనాంచారులతో కలిసి శ్రీగోవిందరాజస్వామివారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తారు.
– మార్చి 20న శ్రవణ నక్షత్రాన్ని పురస్కరించుకుని సాయంత్రం 5.30 గంటలకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామివారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తారు.
– మార్చి 30న రోహిణి నక్షత్రాన్ని పురస్కరించుకుని సాయంత్రం 5.30 గంటలకు రుక్మిణి, సత్యభామ సమేత శ్రీ పార్థసారధిస్వామివారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు అభయమిస్తారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.