FIR REGISTERED AGAINST ONE MORE FAKE WEBSITE _ మరో నకిలీ వెబ్సైట్ పై ఎఫ్ఐఆర్ నమోదు

FIR REGISTERED AGAINST ONE MORE FAKE WEBSITE

AP FORENSIC CYBER CELL ON INVESTIGATION

TTD APPEALS TO DEVOTEES TO BE CAUTIOUS WITH SUCH FAKE WEBSITES

TIRUMALA, 23 APRIL 2023: One more fake website has been identified by TTD IT wing and upon their complaint a case has been registered in Tirumala 1 Town Police Station.

as FIR 19/2023 u/s 420,468,471 IPC.

Based on the complaint the AP Forensic Cyber Cell has also plunged into action to investigate the fake website. So far cases have been registered against 40 fake websites and the new one is enlisted as 41st under Cyber Crime.

The fake website was developed by the miscreants almost similar to TTD official website with negligible modifications. The address of the Fake Website URL is https://tirupatibalaji-ap-gov.org/ 

While the official website URL is https://tirupatibalaji.ap.gov.in/

TTD once again appeals and cautions the devotees not to fall prey to such fake websites. The devotees are requested to make note of the URL address of TTD Official website and be cautious verifying the credentials of the correct website before booking the online tickets. The devotees shall book tickets through the TTD official Mobile App also. The TTD official Mobile App is TTDevasthanams.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

మరో నకిలీ వెబ్సైట్ పై ఎఫ్ఐఆర్ నమోదు

– ఎపి ఫోరెన్సిక్ సైబర్ సెల్ విచారణ

– నకిలీ వెబ్సైట్లను నమ్మవద్దని భక్తులకు టీటీడీ విజ్ఞప్తి

తిరుమల, 23 ఏప్రిల్ 2023: తిరుమల తిరుపతి దేవస్థానముల పేరుతో గల మరో నకిలీ వెబ్సైట్ ను టీటీడీ ఐటీ విభాగం గుర్తించి తిరుమల వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎఫ్ఐఆర్ 19/2023 యు/ఎస్ 420, 468, 471 ఐపిసి ప్రకారం పోలీసులు నమోదు చేసి ఎపి ఫోరెన్సిక్ సైబర్ సెల్ కు అప్పగించారు. ఈ మేరకు సైబర్ సెల్ అధికారులు నకిలీ వెబ్సైట్ పై విచారణ ప్రారంభించారు.

ఇదివరకే 40 నకిలీ వెబ్సైట్లపై కేసులు నమోదు కాగా, దీంతో కలిపి కేసుల సంఖ్య 41కి చేరింది.

అధికారిక వెబ్సైట్ https://tirupatibalaji.ap.gov.in/ ఇలా ఉండగా, చిన్న మార్పులతో కొందరు వ్యక్తులు రూపొందించిన https://tirupatibalaji-ap-gov.org/ వెబ్సైట్ ను టిటిడి గుర్తించింది. టీటీడీ అధికారిక వెబ్సైట్లోనే శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శన టికెట్లు, గదులు బుక్ చేసుకోవాలని కోరడమైనది. దీంతో పాటు టీటీడీ అధికారిక మొబైల్ యాప్ ను TTDevasthanams కూడా వినియోగించవచ్చు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.