NEW DELHI TEMPLE BRAHMOTSAVAMS FROM MAY 4 _ మే 4 నుండి 12వ తేదీ వరకు న్యూఢిల్లీ శ్రీ వేంకటేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు

TIRUPATI, 23 APRIL 2023: The annual brahmotsavams in Srivari temple at New Delhi will be observed between May 4 and 12 with Ankurarpanam on May 3.

In connection with this, on April 25 Koil Alwar Tirumanjanam will be performed. On May 4 in the auspicious Vrishabha Lagnma between 8am and 9am, Dhwajarohanam will be observed. 

Important days includes Garuda Vahanam and Kalyanotsavam on May 8, Rathotsavam on May 11 and Chakrasnanam on May 12. Pushpayagam will be performed on May 13 between 6pm and 8pm.

Every day the morning vahana sevas will be observed between 8am and 9am and evening between 7:30pm and 8:30pm.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

మే 4 నుండి 12వ తేదీ వరకు న్యూఢిల్లీ శ్రీ వేంకటేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు

తిరుపతి, 23 ఏప్రిల్ 2023: న్యూఢిల్లీలోని శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయంలో మే 4 నుంచి 12వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు వైభ‌వంగా జరుగనున్నాయి. మే 3న‌ సాయంత్రం అంకురార్పణం జ‌రుగ‌నుంది.

బ్రహ్మోత్సవాల ముందు ఏప్రిల్ 25వ తేదీ కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం(ఆలయ శుద్ధి) నిర్వ‌హిస్తారు. మే 4వ తేదీ ఉదయం 8.30 నుండి 9.30 గంటల మ‌ధ్య వృషభ ల‌గ్నంలో ధ్వజారోహణం నిర్వహించనున్నారు. బ్రహ్మోత్సవాల్లో ఉదయం 8 నుండి 9 గంటల వరకు, రాత్రి 7.30 నుండి 8.30 గంటల వరకు వాహన సేవలు జరుగనున్నాయి. మే 13వ తేదీన సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంట‌ల వ‌ర‌కు పుష్ప‌యాగం నిర్వ‌హిస్తారు.

బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాలు :

04-05-2023 ఉదయం – ధ్వజారోహణం, రాత్రి – పెద్ద‌శేష వాహనం.

05-05-2023 ఉదయం – చిన్న‌శేష వాహ‌నం, రాత్రి – హంస వాహనం.

06-05-2023 ఉదయం – సింహ వాహ‌నం, రాత్రి – ముత్య‌పుపందిరి వాహ‌నం.

07-05-2023 ఉదయం – క‌ల్ప‌వృక్ష వాహ‌నం, రాత్రి – స‌ర్వ‌భూపాల వాహనం.

08-05-2023 ఉదయం – మోహినీ అవ‌తారం, సాయంత్రం – క‌ల్యాణోత్స‌వం, రాత్రి – గ‌రుడ వాహ‌నం.

09-05-2023 ఉదయం – హ‌నుమంత వాహ‌నం, రాత్రి – గజవాహనం.

10-05-2023 ఉదయం – సూర్య‌ప్ర‌భ వాహ‌నం, రాత్రి – చంద్ర‌ప్ర‌భ వాహ‌నం.

11-05-2023 ఉదయం – ర‌థోత్స‌వం, రాత్రి – అశ్వ వాహ‌నం.

12-05-2023 ఉదయం – చక్రస్నానం, రాత్రి – ధ్వజావరోహణం.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది