FIRE FIGHTING INITIATIVES BY TTD FOREST DEPARTMENT_ వేసవిలో టిటిడి అటవీ సంరక్షణ చర్యలు

24×7 SERVICES BY FIRE FIGHTING SQUAD
FIRE LINES TO AVOID FOREST FIRES
SAUCER PITS TO QUENCH THE THIRST OF WILD FAUNA

Tirumala, 19 Apr. 18: As the high temperatures have already started crossing 40 degrees on the Mercury Scale in Tirupati and Tirumala, the Forest Wing of TTD has taken fire fighting initiatives to avoid forest fires in Seshachalam Ranges.

According to the new DFO of TTD, Sri Phani Kumar Naidu, about 2750 hectares of forest area is under TTD purview. To vigil and safeguard this green cover, there are four 40-feet height watch towers each in Tirumala and Tirupati with two sleuths working in two shifts round the clock.

The watch tower vigil in Tirupati covers Nakkalavanka, Samidhulapatlu, Depot, SV Poor Home Nursery while Narayanagiri Padalu, Kakulakonda, Fanlagutta, Chittekkudu(near Galigopuram) will be covered under Tirumala.

On the other hand there are around 85 members in Tirupati and 64 members in Tirumala in Fire Fighting Squad discharging 24X7 duties in shifts. There are massive blowers, fire engines to put off the fire in the wake of any forest fires. Fire fighting lines have also been set to avoid spread of forest fire.

As a conservator of forest, TTD has also made arrangements to quench the thirst of wild beasts and birds during the summer season by setting up “Saucer Pits”. As these cement water tanks are in the shape of a Saucer, they are named so and these will be convenient for the animals to drink water rather than the water tanks.

TTD has appealed its devotees not to carry any fire catching objects while trekking in footpath routes.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATHI

వేసవిలో టిటిడి అటవీ సంరక్షణ చర్యలు

అగ్నిప్రమాదాల నివారణకు పటిష్ట ఏర్పాట్లు

వాచ్‌టవర్ల ద్వారా పర్యవేక్షణ

నిరంతరం అప్రమత్తంగా ఫైర్‌ ఫైటింగ్‌ స్క్వాడ్‌

మంటలు వ్యాప్తి కాకుండా ఫైర్‌ లైన్స్‌

ఏప్రిల్‌ 19, తిరుమల 2018: వేసవి మొదలుకావడంతో అటవీ ప్రాంతాన్ని సంరక్షించేందుకు టిటిడి పటిష్టమైన చర్యలు తీసుకుంది. అగ్నిప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడంతోపాటు, ప్రమాదాల నివారణకు పలు ఏర్పాట్లు చేపట్టింది. తిరుమల, తిరుపతిలోని వాచ్‌టవర్ల ద్వారా సిబ్బంది నిరంతరం అటవీ ప్రాంతాన్ని పరిశీస్తున్నారు. ఎక్కడైనా మంటలు వ్యాపిస్తే వెంటనే స్పందించి అదుపు చేసేందుకు వీలుగా ఫైర్‌ ఫైటింగ్‌ స్క్వాడ్‌ నిరంతరం అప్రమత్తంగా ఉన్నారు. టిటిడి డిఎఫ్‌వో శ్రీ డి.ఫణికుమార్‌ నాయుడు పర్యవేక్షణలో అటవీ సంరక్షణ చర్యలు జరుగుతున్నాయి.

టిటిడి పరిధిలో 2,750 హెక్టార్ల విస్తీర్ణంలో అటవీ ప్రాంతం ఉంది. ఈ మొత్తం ప్రాంతాన్ని పరిశీలించేందుకు తిరుమలలో 4, తిరుపతిలో 4 వాచ్‌ టవర్లు ఉన్నాయి. సుమారు 40 అడుగుల ఎత్తు గల ఈ వాచ్‌ టవర్లపై నుండి అటవీ ప్రాంతంలో మంటల కారణంగా వచ్చే పొగను సిబ్బంది సులువుగా గుర్తిస్తారు. తిరుపతిలో నక్కలవంక, సమిధుల ప్లాటు, కట్టెల డిపో, ఎస్వీ పూర్‌ హోమ్‌ నర్సరీ, తిరుమలలో నారాయణగిరి పాదాలు, కాకులకొండ, ఫ్యాన్లగుట్ట, చిట్టెక్కుడు(గాలిగోపురం వద్ద) ప్రాంతాల్లో వాచ్‌ టవర్లు ఉన్నాయి. ఒక్కో వాచ్‌ టవర్‌లో ఇద్దరు చొప్పున టిటిడి అటవీ సిబ్బంది ఉంటారు. ఉదయం 8 నుంచి రాత్రి 7 గంటల వరకు ఇక్కడ సిబ్బంది అందుబాటులో ఉంటారు. తిరుపతిలోని కట్టెలడిపో, తిరుమలలోని నారాయణగిరి పాదాలు, కాకులకొండ వద్ద 24 గంటల పాటు సిబ్బంది ఉంటారు. ఆకతాయిలు, పశువుల కాపరులు అడవిలోకి వెళ్లి నిప్పు పెట్టడం, ఎండ వేడి ఎక్కువగా ఉన్నపుడు, విపరీతమైన గాలి వీచినపుడు చెట్ల కొమ్మలు రాసుకోవడం వల్ల నిప్పు పుడుతుండడం, పిడుగులు పడడం వల్ల అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి.

ఫైర్‌ ఫైటింగ్‌ స్క్వాడ్‌ :

ఫైర్‌ ఫైటింగ్‌ స్క్వాడ్‌ పేరుతో తిరుపతిలో 85 మంది, తిరుమలలో 64 మంది సిబ్బంది షిప్టుల వారీగా 24 గంటల పాటు విధుల్లో ఉంటారు. వీరికి తిరుపతిలో 2, తిరుమలలో 2 వాహనాలున్నాయి. సిబ్బంది బ ందాలుగా విడిపోయి అటవీ ప్రాంతాన్ని తనిఖీ చేస్తుంటారు. మంటలు వ్యాపించినపుడు వెంటనే అక్కడికి చేరుకుని అదుపుచేస్తారు. మంటలు ఇతర ప్రాంతాలకు వ్యాపించకుండా బ్లోయర్ల ద్వారా ఎండుటాకులను తొలగిస్తారు. రోడ్డు మార్గం ఉన్న పక్షంలో ఫైరింజన్‌ సహకారం తీసుకుంటారు. అగ్నిప్రమాదాలు జరిగినపుడు మంటలు వ్యాప్తి చెందకుండా ఫైర్‌లైన్లను టిటిడి ఏర్పాటుచేసింది. 10 మీటర్లు, 20 మీటర్ల వెడల్పుతో ఒకే వరుసలో చెట్లను, ఎండుటాకులను తొలగించి శుభ్రంగా ఉంచుతారు. అటవీప్రాంతంలో అక్కడక్కడా ఈ ఫైర్‌లైన్లను ఏర్పాటుచేశారు.

త్వరలో సాసర్‌ పిట్స్‌(సిమెంటు తొట్టెలు) :

వేసవిలో అడవి జంతువుల దాహార్తిని తీర్చేందుకు ఘాట్‌ రోడ్లలోని తొట్టెల్లో క్రమం తప్పకుండా నీటిని నింపుతున్నారు. అటవీప్రాంతంలో పలు చోట్ల సాసర్‌పిట్స్‌(సిమెంటు తొట్టెలు) ఏర్పాటుకు టిటిడి చర్యలు చేపట్టింది. ఇందుకోసం టెండరు ప్రక్రియ కూడా ముగిసింది. ఈ తొట్టెలు సాసర్‌ ఆకారంలో ఉంటాయి. కొన్ని జంతువులకు నీటి లోపలికి దిగి తాగడం అలవాటు. ఈ కారణంగా జంతువులు సులువుగా నీటిలోకి దిగి, తిరిగి వెళ్లేందుకు వీలుగా ఈ రకమైన తొట్టెలను నిర్మించనున్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.