FIRST ANNIVERSARY OF VAKULAMATA TEMPLE OBSERVED _ వేడుకగా శ్రీ వకుళ మాత ఆలయ వార్షికోత్సవం

SON PRESENTS JEWELS TO HIS MOTHER

TIRUPATI, 13 JUNE 2023: The first anniversary of the TTD sub-temple of Sri Vakulamata temple located on Peruru Banda (Patakalva) near Tirupati was observed with religious fervour on Tuesday.

After Punyahavachanam, Kalasa Sthapana, Kalasa Puja, Viswaksena Aradhana, Sankalpa Puja, Agni Pratista, Maha Shanti Homam, Purnahuti, Astottara Satakalasa Snapanam were performed under the supervision of Sri Mohana Rangacharyulu and Sri Sitarmacharyulu. 

On the auspicious occasion, the doting son of Vakulamata, Sri Venkateswara presented a 160gms weighing two Harams to His caring mother. Tirumala temple DyEO Sri Lokanatham handed over the jewels to Tirupati JEO Sri Veerabrahmam. The jewels were presented to the presiding deity Vakula Mata over the hands of the Honourable Minister Sri Peddireddi Ramachandra Reddy. The Minister also presented Pattu Vastrams to Vakula Mata.

Later speaking to the media he said, it’s been a year since the temple of Vakula Mata was inaugurated a year ago and on the auspicious occasion of the first anniversary, he felt privileged to be a part of this great religious ceremony.

TTD Board member Sri Ashok Kumar, RDO Sri Kananka Narasa Reddy, Special Grade DyEO Smt Varalakshmi, Srivari temple Chief Priest Sri Venugopala Deekshitulu were also present.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

వేడుకగా శ్రీ వకుళ మాత ఆలయ వార్షికోత్సవం

తిరుపతి 13 జూన్ 2023: తిరుపతి రూరల్ మండలం పేరూరు బండ ( పాత కాల్వ) పై నిర్మించిన శ్రీ వకుళ మాత ఆలయ మొదటి వార్షికోత్సవ కార్యక్రమాలు మంగళవారం వేడుకగా జరిగాయి.

ఉదయం పుణ్యాహవచనం, కలశ స్థాపన, కలశ పూజ, విశ్వక్షేనారాధన జరిపారు. అనంతరం సంకల్ప పూజ, అగ్ని ప్రతిష్ట, మహాశాంతి హోమము, పూర్ణాహుతి , అష్టోత్తర శత కలశ స్నపనం శాస్త్రోక్తంగా నిర్వహించారు.

ఆగమ సలహాదారులు శ్రీ మోహన రంగా చార్యులు, శ్రీ సీతారామాచార్యులు నిర్వహించిన ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దంపతులు, టీటీడీ బోర్డు సభ్యులు శ్రీ పోకల అశోక్ కుమార్ దంపతులు, జేఈవో శ్రీ వీరబ్రహ్మం, ఆర్డీవో శ్రీ కనక నరసా రెడ్డి, ప్రత్యేక శ్రేణి డెప్యూటీ ఈవో శ్రీమతి వరలక్ష్మి, తిరుమల శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ వేణుగోపాల దీక్షితులు, డెప్యూటీ ఈవో శ్రీ లోకనాథం పాల్గొన్నారు.

అమ్మకు కానుక

శ్రీ వకుళ మాత ఆలయ తొలి వార్షికోత్సవం సందర్భంగా తిరుమల నుండి ఆమె కుమారుడు శ్రీ వేంకటేశ్వర స్వామి 160 గ్రాముల బరువైన రెండు బంగారు హారాలు కానుకగా పంపారు. శ్రీవారి ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ లోకనాథం ఈ ఆభరణాలను తీసుకువచ్చి జేఈవో శ్రీ వీరబ్రహ్మం కు అందజేశారు. మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ద్వారా జేఈవో ఈ ఆభరణాలను ఆలయానికి అందించారు. మంత్రి దంపతులు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీ రామచంద్రారెడ్డి శ్రీ వకుళ మాత చిత్రపటాలను ఆవిష్కరించారు.

అనంతరం మంత్రి శ్రీ రామచంద్రారెడ్డి మీడియాతో మాట్లాడారు. శ్రీ వకుళ మాత ఆలయం నిర్మించి ఏడాది అయిన సందర్బంగా టీటీడీ నిర్వహించిన వేడుకల్లో తాను పాల్గొనడం అదృష్టం గా భావిస్తున్నానని చెప్పారు. భక్తులకు వసతులు బాగా ఉన్నాయని, మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి తనవంతు కృషి చేస్తానని ఆయన చెప్పారు.

టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయడమైనది