FLAG FESTIVAL OBSERVED _ తిరుమలలో ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవం

Tirumala, 15 August 2018: Tirumala JEO Sri KS Sreenivasa Raju hoisted the National Flag on the occasion of Independence Day in Gokulam Rest House premises on Wednesday.

In his I Day address, the JEO said, discharging the duties with responsibility and dedication is the real tribute which we can pay to our National leaders.

“The time slot darshan introduced by TTD id a Revolution reform measure to tackle the day by day increasing pilgrim rush”, he added.

He said the unique feature of this Independence Day is that it coincided with Astabandhana Balalaya Maha Samprokshanam religious fete. I thank Lord Venkateswara for providing me an opportunity to take part in Astabandhanam and my eighth I Day fete in TTD”, he maintained.

SE 2 Sri Ramachandra Reddy, Health Officer Dr Sermista, VSO Sri Ravindra Reddy, Special Officer Annaprasadam Sri Venugopal and other officers were also present.


ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

తిరుమలలో ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవం

ఆగస్టు 15, తిరుమల 2018 ; తిరుమలలో బుధవారం స్వాతంత్య్రదిన వేడుకలు ఘనంగా జరిగాయి. గోకులం విశ్రాంతి భవనంలోని క్యాంపు కార్యాలయంలో టిటిడి తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్.శ్రీనివాసరాజు జాతీయ జెండాను ఎగురవేశారు.

ఈ సందర్భంగా జెఈఓ మాట్లాడుతూ ఉద్యోగులు బాధ్యతాయుతంగా, అంకితభావంతో విధులు నిర్వహించడమే స్వాతంత్ర్య సమరయోధులకు సమర్పించే నిజమైన నివాళి అన్నారు. భక్తుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్న క్రమంలో టిటిడి సర్వదర్శనం టోకెన్ల విధానాన్ని ప్రవేశపెట్టడాన్ని మంచి సంస్కరణగా అభివర్ణించారు. మహాసంప్రోక్షణ రోజుల్లో జరుగుతున్న స్వాతంత్ర్య దినోత్సవంలో పాల్గొనడం అరుదైన విషయమన్నారు. అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణలో పాల్గొనే అవకాశం కల్పించినందుకు గాను శ్రీవారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని, టిటిడిలో 8వ సారి స్వాతంత్ర్య దినోత్సవంలో పాల్గొంటున్నానని చెప్పారు.

ఈ కార్యక్రమంలో టిటిడి ఎస్ఇ-2 శ్రీ రామచంద్రారెడ్డి, ఆరోగ్యశాఖాధికారి డా.. శర్మిష్ట, విఎస్వో శ్రీ రవింద్రారెడ్డి, అన్నప్రసాదం ప్రత్యేకాధికారి శ్రీ వేణుగోపాల్ ఇతర అధికారులు పల్గొన్నారు.


తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.