KSHEERADHIVASA TIRUMANJANAM PERFORMED _ శాస్త్రోక్తంగా క్షీరాధివాస తిరుమంజనం

Tirumala, 15 August 2018: On the fourth day of ongoing five day Maha Samprokshanam religious fete, Ksheeradhivasam ritual was performed to Mula Virat and Parihara deities on Wednesday.

ADHIVASAM:

As a part of Prana Pratishta, Adhivasam is performed to induce cosmic energy to the Vigrahas. The Vigrahas bear a tremendous cosmic power through performance of Prana Pratishta. Worship of manifestation of Lord in the form of Vigrahas enables us to fulfill our wishes and achieve peace.

TYPES OF ADHIVASAM:

The Adhivasas are of different types which includes Ksheeradhivasam, Jaladhivasam, Phaladhivasam, Chayadhivasam, Dhanyadhivasam, Pudhpadhivasam, Sayanadhivasam will be usually performed as per the temple tradition as mentioned in the Scriptures.

KSHEERADHIVASAM:

Ksheeraivasam signifies performing abhishekam to the main deity with holy milk. In Mukundamala, Sri Kulashekara Alwar explains “ksheera saagara taranga sikara saara tarakita charu-murtaye“. The importance of performing Ksheeradhivasam is clearly explained.

ABHISHEKAM PERFORMED TO GOPURA SIKHARAS SEEING THROUGH MIRROR

Another interesting aspect which took part on Wednesday morning was the performance of Abhishekam with sacred water and milk to Gopura Sikhara kalasas of Sri Vimana Venkateswara Swamy, Sri Garudalwar, Sri Yoga Narasimha Swamy, Sri Bhashyakarulavaru, Dhwajasthambha, Sri Bedi Anjaneya Swamy by witnessing their images in mirror.

TTD EO Sri Anil Kumar Singhal, TTD Trust Board member Smt Sudha Narayana Murthy, Tirumala JEO Sri KS Sreenivasa Raju, Temple DyEO Sri Harindranath and other staffs were also present.

MAHA SAMPROKSHANAM ON THURSDAY-JEO

Elaborating on Astabandhana Balalaya Maha Samprokshanam religious fete, Tirumala JEO Sri KS Sreenivasa Raju said as part of it Ksheeradhivasa Tirumanjanam was performed to mula varulu and Parihara deities in 14 kalasas on Wednesday.

He said the Maha Samprokshana Purnahuti will be observed between 10.16am and 12 noon.


ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

శాస్త్రోక్తంగా క్షీరాధివాస తిరుమంజనం

ఆగస్టు 15, తిరుమల 2018 ; తిరుమల శ్రీవారి ఆలయ అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణంలో భాగంగా నాలుగో రోజు బుధవారం ఉదయం శ్రీవారి మూలమూర్తికి ఇతర పరివార దేవతలకు క్షీరాధివాస తిరుమంజనం క్రతువులు శాస్త్రోక్తంగా నిర్వహించారు.

అధివాసం :

విగ్రహాలకు ప్రాణప్రతిష్ఠ సమయంలో విశ్వంలోని శక్తిని ఆవాహన చేసేందుకు అధివాసం నిర్వహిస్తారు. ప్రాణప్రతిష్ట ద్వారా విగ్రహాలు అనంతమైన శక్తిని పొందుతాయి. ఇలాంటి విగ్రహరూపంలో ఉన్న దేవతలను దర్శించడం ద్వారా కోరిన కోరికలు తీరడంతోపాటు మానసిక శాంతి చేకూరుతుంది.

అధివాసం రకాలు :

శాస్త్రాల ప్రకారం ఆలయాల ప్రాణప్రతిష్ఠ సమయంలో క్షీరాధివాసం, జలాధివాసం, ఫలాధివాసం, ఛాయాధివాసం, ధాన్యాధివాసం, పుష్పాధివాసం, శయనాధివాసం తదితర కార్యక్రమాలను నిర్వహిస్తారు.

క్షీరాధివాసం :

శ్రీవారి మూలమూర్తిని పవిత్రమైన పాలతో అభిషేకం చేయడాన్నే క్షీరాధివాసం అంటారు. ”క్షీరసాగర తరంగ శిఖర సార తరకిత చారుమూర్తే” అంటూ ముకుందమాల స్తోత్రంలో శ్రీకులశేఖరాళ్వార్‌ క్షీరాధివాసం వైశిష్ట్యాన్ని తెలియజేశారు.

అద్దంలోని గోపుర శిఖరాల ప్రతిబింబాలకు అభిషేకం :

శ్రీవారి ఆలయంలో బుధవారం ఉదయం గోపురాల కళశాలను అద్దంలో చూపి వాటి ప్రతిబింబాలకు అభిషేకం నిర్వహించారు. శ్రీ విమాన వేంకటేశ్వరస్వామి, శ్రీ గరుడాళ్వార్‌, శ్రీవరదరాజస్వామి, శ్రీభాష్యకారులు, శ్రీ యోగనరసింహస్వామివారికి, ధ్వజస్తంభం, శ్రీ బేడి ఆంజనేయస్వామివారి గోపురాల కలశాలకు ఈ విధంగా పవిత్రమైన జలం, పాలతో అభిషేకం చేశారు.

ఈ కార్యక్రమంలో టిటిడి ధర్మకర్తల మండలి సభ్యురాలు శ్రీమతి సుధా నారాయణమూర్తి, తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ హరీంద్రనాథ్‌ ఇతర అధికారులు పాల్గొన్నారు.

ఆగస్టు 16న మహాసంప్రోక్షణం : జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు

శ్రీవారి ఆలయంలో ఆగస్టు 16న గురువారం ఉదయం 10.16 నుండి 12 గంటల వరకు మహాసంప్రోక్షణం జరుగనుందని టిటిడి తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు తెలిపారు. బుధవారం ఉదయం పవిత్ర జలం, పాలు, పంచగవ్యాలతోకూడిన 14 కలశాలతో శ్రీవారి మూలమూర్తికి, ఇతర పరివార దేవతలకు క్షీరాధివాస తిరుమంజనం, మధ్యాహ్నం మహాశాంతి పూర్ణాహుతి, మహాశాంతి తిరుమంజనం జరిగినట్టు వివరించారు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.