FLOAT FESTIVAL OBSERVED _ తెప్పపై శ్రీరామచంద్రమూర్తి కటాక్షం

Tirupati, 22 April 2024: As part of Sri Kodandarama Swamy annual Teppotsavams, on the second day on Monday evening, Sri Rama took seven rounds in Sri Ramachandra Pushkarini to bless the devotees.

In the morning along with Sri Sita Lakshmana Sri Kodandarama Swamy was rendered Snapana Tirumanjanam.

Temple Deputy EO Smt. Nagaratna, AEO Sri. Parthasarathy, Superintendent Sri. Soma Shekhar and a large number of devotees participated in this program.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

తెప్పపై శ్రీరామచంద్రమూర్తి కటాక్షం

తిరుపతి, 2024 ఏప్రిల్ 22: తిరుపతి శ్రీ కోదండరామస్వామి తెప్పోత్సవాల్లో భాగంగా రెండో రోజైన సోమవారం రాత్రి శ్రీ రామచంద్ర పుష్కరిణిలో స్వామివారు ఏడు చుట్లు తిరిగి భక్తులకు అభయమిచారు .

ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి తోమాల సేవ, సహస్రనామార్చన నిర్వహించారు. ఉదయం శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, కొబ్బరి నీళ్లతో విశేషంగా అభిషేకం చేశారు.

సాయంత్రం 6.30 గంటలకు శ్రీసీతారామలక్ష్మణులు ఆలయం నుండి ఊరేగింపుగా శ్రీరామచంద్ర పుష్కరిణికి చేరుకున్నారు. విద్యుద్దీపాలతో అందంగా అలంకరించిన తెప్పపై శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామివారు ఆశీనులై పుష్కరిణిలో 7 చుట్లు తిరిగి భక్తులకు కనువిందు చేశారు.

ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి నాగరత్న, ఏఈవో శ్రీ పార్థసారథి, సూపరింటెండెంట్‌ శ్రీ సోమ శేఖర్, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.