ON DAY 3 SRI GT TEPPOTSAVAM_ SRI KALYANA VENKATESWARA SWAMYతెప్పపై శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి అభయం

Tirupati, 5 February 2017: On day 3 of Sri Govindaraja swamy Teppotsavam, Sri Kalyana Venkateswara Swamy along with His Consorts was taken out on a float in the evening at 7pm to 8pm and the devotees were enthralled in the divine, colorful and glittering spectacle on the four mada streets of the Sri GT.

The celestial float carrying the presiding deity went around five times giving the devotees an eyeful of darshan. The artisans of the HDPP, Annamayya Project and Dasa Sahitya Project organised a bevy of cultural events and bhakti music for the benefit of the devotes.

Among others the DyEO Smt P Varalakshmi, AEO Sri Prasad Murthy Raju and other TTD officials participated.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs TIRUPATI

తెప్పపై శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి అభయం

తిరుపతి, 2018 జనవరి 27: తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి తెప్పోత్సవాల్లో భాగంగా మూడో రోజు శనివారం స్వామివారు శ్రీకల్యాణవేంకటేశ్వరస్వామివారి అవతారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. రాత్రి 6.30 నుండి 8.00 గంటల వరకు స్వామివారు ఉభయదేవేరులతో కలిసి తెప్పపై విహరించి భక్తులకు కనువిందు చేస్తారు. అనంతరం ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగి భక్తులను అనుగ్రహిస్తారు.

స్వామివారు మొత్తం ఐదు చుట్లు తిరిగి భక్తులకు దర్శనభాగ్యం కల్పిస్తారు. అదేవిధంగా ఆదివారం ఆండాళ్‌ అమ్మవారితో కలిసి శ్రీకృష్ణస్వామివారి అవతారంలో స్వామివారు తెప్పలపై భక్తులను అనుగ్రహించనున్నారు. ఈ సందర్భంగా తితిదే హిందూ ధర్మప్రచార పరిషత్‌, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో భజనలు, హరికథ, సంగీత కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

ఈ కార్యక్రమంలో శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయ ఉపకార్యనిర్వహణాధికారి శ్రీమతి పి.వరలక్ష్మి, సహాయ కార్యనిర్వహణాధికారి శ్రీ ఉదయభాస్కర్‌రెడ్డి, సూపరింటెండెంట్‌ శ్రీజ్ఞానప్రకాష్‌, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీ కృష్ణమూర్తి ఇతర అధికారులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.