RAMAKRISHNA TEERTHA MUKKOTI ON JAN 31- TIRUMALA JEO REVIEWS ON ARRANGEMENTS_ జనవరి 31న రామకృష్ణ తీర్థ ముక్కోటికి విస్తృత ఏర్పాట్లు : తిరుమల జెఈవో

Tirumala, 27 January 2018: As the Ramakrishna teertha mukkoti falls on January 31, Tirumala JEO Sri KS Sreenivasa Raju reviewed the arrangements for the with officials concerned at Annamaiah Bhavan on Saturday evening.

He instructed the engineering wing to erect display boards showing way leading to the torrent with closing and opening timings for the information of the devotees. He also directed them to provide queue lines near the mouth point for smooth movement of pilgrims.

A team comprising an AVSO, FRO, Health Inspector, Annaprasadam Supervisor, DyEE will visit the torrent to supevise the arrangements on January 28.

He directed the Health Officer Dr Sermista to keep ready 15, 000 water satchets and another 10, 000 water bottles. He also directed Annaprasadam officials to distribute Pulihora packets to the pilgrims upto 11am on January 31.

The JEO directed SVBC CEO Sri Narasimha Rao to give wide publicity
in the channel on not to carry prohibited items like match boxes, fire equipment, cooking articles etc. which give scope for forest fires.

SE II Sri Ramachandra Reddy, Special Officer Annaprasadam Sri Venugopal, GM Sri Sesha Reddy, Peishkar Sri Ramesh, AVSOs and others were also present.


ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

జనవరి 31న రామకృష్ణ తీర్థ ముక్కోటికి విస్తృత ఏర్పాట్లు : తిరుమల జెఈవో

తిరుమల, 2018 జనవరి 27: శేషాచలగిరుల్లో నెలవైన పుణ్యతీర్థాల్లో ఒకటైన శ్రీరామకృష్ణ తీర్థ ముక్కోటి జనవరి 31వ తేదీన జరుగనుందని, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా విస్తృతంగా ఏర్పాట్లు చేపట్టాలని టిటిడి తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు ఆదేశించారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో శనివారం రామకృష్ణ తీర్థ ముక్కోటి ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ రామకృష్ణ తీర్థానికి వెళ్లే మార్గాన్ని చక్కగా రూపొందించాలని, అవసరమైన చోట్ల చెక్క నిచ్చెనలు ఏర్పాటు చేయాలని ఇంజినీరింగ్‌ అధికారులను ఆదేశించారు. జనవరి 30, 31వ తేదీల్లో ఈ తీర్థానికి వెళ్లే భక్తులకు పాపవినాశనం డ్యామ్‌ వద్ద పొంగళి, ఉప్మా, సాంబారన్నం, పెరుగన్నం పంపిణీ చేయాలన్నారు. తీర్థానికి చేరుకున్నాక తినేందుకు వీలుగా భక్తులకు క్యారీబాగుల్లో పులిహోర పొట్లాలు అందించాలని సూచించారు. ఇక్కడ అన్నప్రసాద వితరణకు ప్రయివేటు వ్యక్తులకు అనుమతి లేదని తెలియజేశారు. ఈ రెండు రోజుల్లో భక్తులకు పంపిణీ చేసేందుకు 15 వేల తాగునీటి ప్యాకెట్లు, వెయ్యి వాటర్‌ బాటిళ్లు సిద్ధంగా ఉంచుకోవాలని ఆరోగ్య విభాగం అధికారులను ఆదేశించారు. తీర్థం వద్ద ప్రథమ చికిత్స కేంద్రాన్ని ఏర్పాటుచేయాలని, పాపవినాశనం డ్యామ్‌ వద్ద పారామెడికల్‌ సిబ్బందితోపాటు రెండు అంబులెన్సులను సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. అటవీమార్గంలో భక్తులకు ఇబ్బందులు లేకుండా తగిన భద్రతా ఏర్పాట్లు చేపట్టాలన్నారు.

ఈ సమీక్షలో టిటిడి ఎస్‌ఇ-2 శ్రీ రామచంద్రారెడ్డి, ట్రాన్స్‌పోర్టు జిఎం శ్రీ శేషారెడ్డి, సిఎంవో డా|| నాగేశ్వరరావు, అన్నప్రసాదం ప్రత్యేకాధికారి శ్రీ వేణుగోపాల్‌, క్యాటరింగ్‌ అధికారి శ్రీ జిఎల్‌ఎన్‌.శాస్త్రి ఇతర అధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.