FLOWER GARDEN SHOW OPENS_ ప్రదర్శనశాలలను ప్రారంభించిన టిటిడి ఈవో

Tiruchanur, 15 November 2017: The TTD EO Sri Anil Kumar Singhal along with Tirupati JEO Sri P Bhaskar and CVSO Sri A Ravikrishna inaugurated flower show in Friday Gardens. The garden wing of TTD arranged various mythological themes with varieties of colourful, traditional and exotic flowers.

The themes included Hanumantha vishwarupam in Lanka, Origin of Mahalakshmi in ksheerasagara Madhanam, Govardhanagiridhara Govinda
Lord Srinivasa saving Goddess Padmavathi from wild elephant in forest and many more.

The Ayurvedic wing of TTD has also exhibited rare medicinal herbs in the exhibition.

Garden Suptd Sri Srinivas, Spl Gr DyEO Sri Munirathnam Reddy, DE Sri Ravishankar Reddy and others officials were present.


ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

ప్రదర్శనశాలలను ప్రారంభించిన టిటిడి ఈవో

తిరుపతి, 2017 నవంబరు 15: శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా తిరుచానూరులోని శుక్రవారపుతోటలో ఏర్పాటుచేసిన ప్రదర్శనశాలలను టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌, తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్‌తో కలిసి ప్రారంభించారు.

ఇందులో టిటిడి ఉద్యానవన విభాగం ఆధ్వర్యంలో ‘క్షీరసాగర మధనము శ్రీలక్ష్మీదేవి ఉద్భవించుట’, ‘వేంకటాద్రిపై తపస్సు చేస్తున్న శ్రీనివాసుడిని దర్శించిన బ్రహ్మ, శివ, నారదులు’, ‘లంకలో సీతమ్మ ముందు తన విశ్వరూప ప్రదర్శనద్వారా తన బలమును నిరూపిస్తున్న హనుమంతుడు’, ‘గోవర్ధనగిరిని పైకి చిటికిన వేలుతో ఎత్తి గోకులంలోని ప్రజలను, జంతు జాలాన్ని కాపాడుతున్న శ్రీకృష్ణుడు’, ‘ఉద్యానవనానికి విహరానికి విచ్చేసిన శ్రీపద్మావతి దేవిని ఏనుగు బారి నుంచి రక్షిస్తున్న శ్రీనివాసుడు’, ‘ఆకాశరాజు పొలము దున్నుతున్న వేళ పద్మము నందు పాప రూపములో అమ్మవారు అవతరించుట’ తదితర పౌరాణిక అంశాలు, పుష్పాలతో వివిధ జంతువులు, పక్షుల ఆకృతులు భక్తులను ఆకట్టుకుంటున్నాయి.

అదేవిధంగా, ఎస్వీ ఆయుర్వేద కళాశాల ఆధ్వర్యంలో ఎక్స్‌పో ఆయు, ఎస్వీ ఆయుర్వేద ఫార్మసి ఆధ్వర్యంలో వనమూలికా ప్రదర్శన, ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం, టిటిడి పుస్తక ప్రదర్శన మరియు విక్రయశాల, ఎస్వీ సంప్రదాయ ఆలయ శిల్ప శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో కళల ప్రదర్శనశాల, సూక్ష్మకళాచిత్ర ప్రదర్శన భక్తులను ఆకట్టుకుంటున్నాయి.

భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్న పద్మావతి, శ్రీనివాసుల సైకత శిల్పం టిటిడి ఉద్యానవన విభాగం ఆధ్వర్యంలో శుక్రవారపుతోటలో మొదటి సారిగా అమ్మవారి బ్రహ్మోత్సవాలలో ఏర్పాటు చేసిన ”పద్మ సరోవరంలో పద్మావతిని ప్రతిష్టించిన శుకుడికి శ్రీనివాసుడు దర్శనమిచ్చుట” సైకత శిల్పం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది.

మైసూరుకు చెందిన కుమారి గౌరి, కుమారి నిలాంభికలు ఈ సైకత శిల్పాన్ని రూపొందించారు. వీరు గత 5 సంవత్సరాలుగా తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలలో టిటిడి ఉద్యానవన విభాగం ఏర్పాటు చేసే పుష్ప ప్రదర్శనశాలలో సైకత శిల్పాన్ని రూపొందిస్తున్నారు.

కొల్హాపుర్‌ శ్రీ మహాలక్ష్మీ అమ్మవారి గాజుల మండపం

అమ్మవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా శుక్రవారపుతోటలో మొదటిసారిగా గాజులతో రూపొందించిన కొల్హాపురం శ్రీ మహాలక్ష్మీ అమ్మవారి మండపం భక్తులలో మరింత భక్తి భావాన్ని పెంచుతుంది. దీనిని ఏర్పాటు చేసేందుకు 3 లక్షల గాజులను ఉపయోగించారు.

వెంకటగిరికి చెందిన శ్రీ అమరనాథరెడ్డి, శ్రీ మల్లి ఆధ్యర్యంలో 20 మంది మహిళలు వారం రోజులపాటు శ్రమించి ఎంతో ఆకర్షణీయంగా ఈ మండపాన్ని ఏర్పాటు చేశారు.

అనంతరం ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ మాట్లాడుతూ తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్‌ ఆధ్వర్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వివరించారు. ఎగ్జిబిషన్‌, లైటింగ్‌, ఫ్లవర్‌ డెకరేషన్‌ పూర్తి చేసినట్లు తెలిపారు. సివిఎస్వో శ్రీ ఆకే.రవికృష్ణ తిరుపతి స్థానిక పోలీస్‌లతో సమన్వయం చేసుకుని కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో టిటిడి సివిఎస్వో శ్రీ ఆకే.రవికృష్ణ, అదనపు సివిఎస్వో శ్రీ శివకుమార్‌రెడ్డి, తిరుపతి విజివో శ్రీ అశోక్‌కుమార్‌ గౌడ్‌, ఆలయ ప్రత్యేక శ్రేణి ఉపకార్య నిర్వహణాధికారి శ్రీమునిరత్నరెడ్డి, గార్డెన్‌ సూపరెండెంట్‌ శ్రీ శ్రీనివాసులు, ఇతర అధికారులు, భక్తులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.