FMS HELP LINE TO PROVIDE IMPROVISED SERVICES TO PILGRIMS-TIRUMALA JEO
Tirupati, 17 November 2017: The FMS Help Line which will be launched shortly is aimed at providing improvised services to pilgrims who stay in various cottages with immediate effect, said Tirumala JEO Sri KS Sreenivasa Raju.
A review meeting with Engineering and Reception officials on FMS related works and upcoming Helpline centre was held at Annamaiah Bhavan on Friday. Speaking on this occasion, the JEO said, FMS Helpline is going to be a “State of Art” telephonic solution for the problems being faced by pilgrims in accommodation.
Earlier the representatives from Caretel Infotech Private Limited, New Delhi Sri Rajesh Sehgal and Sri Janam Singh presented the software application for FMS Helpline through the powerpoint presentation.
CE Sri Chandra Sekhar Reddy, SE II Sri Ramachandra Reddy, DyEOs Reception Sri Harindranath, Sri Sreedhar and others were also present.
ISSUED BY TTDs,PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
ఎఫ్.ఎమ్.ఎస్ హెల్ప్‌లైన్‌తో భక్తులకు మరింత ఉన్నత సేవలు – తిరుమల జె.ఈ.ఓ
నవంబరు 17, తిరుమల 2017; త్వరలో తిరుమలలో ఏర్పాటు చేయనున్న ప్రత్యేక ఎఫ్.ఎమ్.ఎస్ హెల్ప్‌లైన్ కేంద్రం ద్వారా భక్తులకు మరింత ఉన్నతంగా తి.తి.దే సేవలందించనుందని తిరుమల జె.ఈ.ఓ శ్రీ కె.ఎస్.శ్రీనివాసరాజు తెలిపారు.
శుక్రవారం నాడు తిరుమలలోని అన్నమయ్య భవనంలో ఆయన ఇంజనీరింగ్ మరియు విడిది విభాగం అధికారులతో ఎఫ్.ఎమ్.ఎస్ హెల్ప్‌లైన్ కేంద్రం ఏర్పాటుపై జరుగుతున్న పనులను సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భవిష్యత్తులో ఎఫ్.ఎమ్.ఎస్ హెల్ప్‌లైన్ కేంద్రం ద్వారా వివిధ వసతి గృహాలలో బస చేసే భక్తులు వారి బస చేస్తున్న ప్రదేశాలలో లోపాలు ఏదైనా ఈ కేంద్రానికి తెలియపరచిన వెను వెంటనే లోపాలను సవరించేందుకు చర్యలు చేపడతామన్నారు.
కాగా అంతకు పూర్వం ఎఫ్.ఎమ్.ఎస్ సాప్ట్‌వేర్ రూపొందించిన న్యూడిల్లీకి చెందిన క్యార్‌టెల్ ఇన్‌ఫోటెక్ సంస్థ ప్రతినిధులు శ్రీ రాజేష్‌సెహగల్, శ్రీ జానంసింగ్ మరియు నిక్సి డి.జి.యం శ్రీ జగన్నాథరావులు పవర్ పాయింట్ సహకారంతో తాము రూపొందించిన సాప్ట్‌వేర్ అప్లికేషన్ గురించి వివరించారు.
ఈ సమావేశంలో సి.ఇ శ్రీ చంద్రశేఖర్ రెడ్డి, ఎస్.ఇ.2 శ్రీ రామచంద్రారెడ్డి, విడిదివిభాగం డిప్యూటి.ఈ.ఓలు శ్రీ హరీంద్రనాద్, శ్రీ శ్రీధర్, ఓ.ఎస్.డి శ్రీ లక్ష్మినారాయణ యాదవ్, తదితర అధికారులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.