FOCUS ON COMMON PILGRIMS-TTD CHAIRMAN _ శ్రీవారి బ్రహ్మోత్సవ వైభవాన్ని భక్తులకు చూపండి : మీడియా సెంటర్‌ ప్రారంభోత్సవంలో టీటీడీ ఛైర్మన్‌

FIRST ELECTRIC BUS TO BE INAUGURATED TO TIRUMALA BY CM

 

Tirumala, 27 September 2022:  The prime focus is on facilitating the common devotees with adequate rooms,  hassle-free Darshan and vahana sevas, laddus and Anna Prasadam as the annual event is taking place after the two-year gap of the Covid pandemic, said TTD Chairman Sri YV Subba Reddy.

 

Inaugurating the Media Centre set up by TTD for supporting media personnel from across the country for the coverage of the celestial nine-day festival, TTD Chairman said we will not compromise in achieving this objective of full patronisation of common bhaktas who will come a long way with all their hardships for Darshan of Sri Venkateswara Swamy.

 

He said the festivities will commence in the evening with Dhwajarohana and Pedda Sesha Vahanams. The Honourable CM of AP Sri  YS Jaganmohan Reddy will offer official pattu vastrams in the evening. Prior to that he would also flag of first ten electric buses of APSRTC on Tirupati – Tirumala route.

 

He said on September 28, the CM will inaugurate the new Parakamani Bhavan before leaving for Tirupati.

 

TTD EO  Sri AV Dharma Reddy, JEO Sri Veerabrahmam, CVSO Sri Narasimha Kishore and PRO Dr T.Ravi were present during the opening of the Media Centre.

 

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

2022 శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు

శ్రీవారి బ్రహ్మోత్సవ వైభవాన్ని భక్తులకు చూపండి : మీడియా సెంటర్‌ ప్రారంభోత్సవంలో టీటీడీ ఛైర్మన్‌

తిరుమల, 2022 సెప్టెంబరు27: శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల వైభవాన్ని ప్రసారమాధ్యమాలు, పత్రికల ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులకు చూపాలని టీటీడీ చైర్మ‌న్ శ్రీ వైవి.సుబ్బారెడ్డి మీడియా ప్రతినిధులను కోరారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల మొదటిరోజైన మంగ‌ళ‌వారం ఉదయం తిరుమలలోని రాంభగీచా-2 విశ్రాంతి గృహంలో ఏర్పాటు చేసిన మీడియా సెంటర్‌ను టీటీడీ ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డితో కలిసి ఛైర్మన్‌ ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఛైర్మన్‌ మాట్లాడుతూ కోవిడ్ కార‌ణంగా గ‌త రెండు సంవ‌త్స‌రాలుగా శ్రీవారి బ్ర‌హ్మోత్స‌వాలు ఏకాంతంగా నిర్వ‌హించిన‌ట్లు చెప్పారు. ఈ ఏడాది అధిక సంఖ్య‌లో విచ్చేసే భక్తులకు సేవలందించేందుకు అన్ని విభాగాల ఆధ్వర్యంలో విస్తృతంగా ఏర్పాట్లు చేపట్టినట్టు తెలిపారు. బ్రహ్మోత్సవాల్లో సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇచ్చి మూలవిరాట్టు దర్శనంతోపాటు వాహనసేవల దర్శనం కల్పించేందుకు అన్ని ర‌కాల ద‌ర్శ‌నాలు ర‌ద్దు చేసిన‌ట్లు తెలిపారు.

మంగ‌ళ‌వారం సాయంత్రం ధ్వ‌జారోహ‌నం సంద‌ర్భంగా రాష్ట్ర ప్ర‌భుత్వం త‌రుపున ముఖ్య‌మంత్రి శ్రీ వై.ఎస్‌.జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి శ్రీ‌వారికి పట్టు వ‌స్త్రాలు స‌మ‌ర్పిస్తార‌ని చెప్పారు. అదేవిధంగా దాత‌ల స‌హ‌కారంతో రూ.23 కోట్ల‌తో నిర్మించిన ప‌ర‌కామ‌ణి భ‌వ‌నాన్ని బుధ‌వారం ఉద‌యం సిఎం ప్రారంభించ‌నున్న‌ట్లు తెలియ‌జేశారు. మీడియా సెంటర్‌లో భోజన సదుపాయంతో పాటు కంప్యూటర్లు, ఇంటర్నెట్‌, ఫ్యాక్స్‌, టెలిఫోన్‌ వసతి కల్పించామని, మీడియా ప్రతినిధులు సద్వినియోగం చేసుకోవాలని చైర్మన్ కోరారు.

టీటీడీ జెఈవో శ్రీ వీర‌బ్ర‌హ్మం, సివిఎస్వో శ్రీ న‌ర‌సింహ కిషోర్‌, పిఆర్వో డా|| టి.రవి, ఎపిఆర్వో కుమారి పి.నీలిమ‌, ఒఎస్డీ శ్రీ నాగేశ్వ‌ర‌రావు, సూపరింటెండెంట్‌ శ్రీ శ్రీ‌నివాసులు రెడ్డి, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.