SESHACHALA FORESTS REPLICATED BY FOREST WING _ కల్యాణవేదిక వద్ద ప్రదర్శనశాలలను ప్రారంభించిన టిటిడి ఛైర్మ‌న్‌

SCULPTURE, AYURVEDA THROWS LIGHT ON ANCIENT ART AND WISDOM

TIRUMALA PAST AND PRESENT PHOTO EXPO ENLIGHTENS DEVOTEES ON DEVELOPMENTS BY TTD 

TIRUMALA, 27 SEPTEMBER 2022: TTD Chairman Sri YV Subba Reddy along with the TTD EO Sri AV Dharma Reddy inaugurated the exhibition stalls set up by various wings of TTD at Kalyana Vedika on Tuesday.

They visited all the stalls and observed the displays in detail and appreciated all the departments. Later speaking on the occasion to the media, the Chairman said, the exhibition threw light on the transformation of Tirumala in the last eight decades. “The Garden department has portrayed the mythological themes in a colourful manner. The episodes from Ramayana, Mahabharata, Bhagavata, Bhakta Tukaram, Trilokas, Viswarupa Darshanam in Sand Art are cynosure and the devotees will have a grand feast to their eyes”, he observed.

Besides the arrangements by the Garden wing, the Forest Wing of TTD, for the first time displayed the Seshachala ranges consisting of the various species of flora, fauna etc. replicating the green belt and bio-diversity of Tirumala Hills, the Nakshatra Vanam.

The photo exhibition by the Public Relations Wing clearly portrayed the transformation of Tirumala temple from the 1940s till date, visits by prominent personalities, Tirumala in the Past and Present etc. The flexis on the recent initiatives by TTD also highlighted the development activities. SV Ayurveda college and SV Ayurveda pharmacy have presented the medicinal plants while the Sri Venkateswara sculpture college showcased its sculpture art consisting of stone, metal, wood idols, paintings etc.

JEO Sri Veerabrahmam, CVSO Sri Narasimha Kishore, TTD Chief Engineer Sri Nageswara Rao, SE-2 Sri Jagdeeswar Reddy, DFO Sri Srinivasulu, PRO Dr T.Ravi, Garden Deputy Director Sri Srinivasulu, Principal of SV Ayurveda College Dr Murali Krishna and others were also present.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

2022 శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు

కల్యాణవేదిక వద్ద ప్రదర్శనశాలలను ప్రారంభించిన టిటిడి ఛైర్మ‌న్‌

సెప్టెంబర్ 27, తిరుమల 2022: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమలలోని కల్యాణవేదిక వద్ద ఏర్పాటుచేసిన పలు ప్రదర్శనశాలలను టిటిడి ఛైర్మ‌న్ శ్రీ వైవి.సుబ్బారెడ్డి ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డితో కలిసి మంగళవారం ప్రారంభించారు. తిరుప‌తి జెఈవో శ్రీ వీర‌బ్ర‌హ్మం, సివిఎస్‌వో శ్రీ న‌ర‌సింహ కిషోర్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా టిటిడి ఛైర్మ‌న్ మీడియాతో మాట్లాడుతూ ప్రజాసంబంధాల విభాగం ఆధ్వర్యంలో ఫొటో ఎగ్జిబిషన్‌, ఇటీవ‌ల చేప‌ట్టిన అభివృద్ధి కార్య‌క్ర‌మాల ఫ్లెక్సీల ప్ర‌ద‌ర్శ‌న‌, పంచ‌గ‌వ్య ఉత్ప‌త్తులు, ప్రచురణల ప్రదర్శన, విక్రయం ఏర్పాటు చేసిన‌ట్టు తెలిపారు. అదేవిధంగా, టిటిడి అట‌వీ విభాగం ఆధ్వ‌ర్యంలో శేషాచ‌లం న‌మూనా, న‌క్ష‌త్ర‌వ‌నంలోని వివిధ మొక్క‌లు, ఎస్వీ ఆయుర్వేద కళాశాల, ఎస్వీ ఆయుర్వేద ఫార్మసి ఆధ్వర్యంలో వనమూలికా ప్రదర్శన, శ్రీ వేంకటేశ్వర శిల్పకళాశాల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన శిల్పకళా ప్రదర్శనలు చ‌క్క‌గా ఉన్నాయ‌ని చెప్పారు.

ఉద్యానవన విభాగం ఆధ్వర్యంలో వివిధ రంగుల, జాతుల పుష్పాల‌తో ఏర్పాటుచేసిన ప్రదర్శన ర‌మ‌ణీయంగా ఉంద‌న్నారు. త్రిలోక ద‌ర్శ‌నం, వివిధ పౌరాణిక ఘ‌ట్టాల సెట్టింగులు ఆక‌ట్టుకుంటున్నాయ‌ని చెప్పారు. మైసూరుకు చెందిన క‌ళాకారిణి ఎంఎన్‌.గౌరి రూపొందించిన శ్రీ‌కృష్ణుని విశ్వ‌రూప ద‌ర్శ‌నం సైక‌త శిల్పం ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలుస్తోంద‌న్నారు. ఈసారి వినూత్నంగా ప్రదర్శనలు ఏర్పాటుచేశామని, భక్తులు తిలకించి తరించాలని కోరారు. ఈ సందర్భంగా ప్రదర్శనశాలలను ఏర్పాటుచేసిన ఆయా విభాగాల అధికారులను ఛైర్మ‌న్‌ అభినందించారు.

ఈ కార్యక్రమంలో టిటిడి చీఫ్ ఇంజినీర్ శ్రీ నాగేశ్వ‌ర‌రావు, ఎస్‌ఇ-2 శ్రీ జ‌గ‌దీశ్వ‌ర్‌రెడ్డి, డిఎఫ్‌వో శ్రీ శ్రీ‌నివాసులు, ప్రజాసంబంధాల అధికారి డా|| టి.రవి, ఉద్యానవన విభాగం డెప్యూటీ డైరెక్ట‌ర్‌ శ్రీ శ్రీనివాసులు, ఎస్వీ ఆయుర్వేద క‌ళాశాల ప్రిన్సిపాల్ డాక్ట‌ర్ ముర‌ళీకృష్ణ‌ ఇతర అధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.