FOCUS ON QUALITY MEDICATION AND EDUCATION-TIRUPATI JEO_ టిటిడి తిరుపతి జెఈవో శ్రీ బి.లక్ష్మీకాంతం విస్తృత తనిఖీలు
Tirupati, 10 February 2019:Sri B Lakshmikantham who has taken charges as Joint Executive Officer of TTD for Tirupati on Sunday, inspected various important institutions in the evening.
As a part of his inspection he has covered SPWDPG college, BIRRD hospital, Goshala and Balamandiram institutions on his first day of office.
Speaking on this occasion he said, education and medication are considered to be the two most pious areas in our tradition. When I interacted with the students in Padmavathi college they brought some issues to my notice like not having a medical officer in the campus, lack of some books in the library etc. Similarly, in the BIRRD hospital we need to provide best possible medication to all the patients. The authorities also brought to my notice about FMS services.
I will hold a meeting soon with all these departments and focus on improvement of education in TTD institutions and quality medication in TTD hospitals, he added.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs TIRUPATI
టిటిడి తిరుపతి జెఈవో శ్రీ బి.లక్ష్మీకాంతం విస్తృత తనిఖీలు
తిరుపతి, 10 ఫిబ్రవరి 2019: టిటిడి తిరుపతి జెఈవోగా బాధ్యతలు స్వీకరించిన శ్రీ బి.లక్ష్మీకాంతం ఆదివారం తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా డిగ్రీ కళాశాల, గోశాల, బర్డ్ ఆసుపత్రి, ఎస్వీ బాలమందిరంలో విస్తృత తనిఖీలు నిర్వహించారు.
ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ శ్రీ పద్మావతి మహిళా డిగ్రీ కళాశాలలో విద్యార్థినులు తాగునీటి వసతి, గ్రంథాలయం పనివేళల పెంపు, మెడికల్ అధికారి నియామకం తదితర అంశాలను తన దృష్టికి తెచ్చారని, త్వరలోనే తగిన చర్యలు చేపడతామని తెలిపారు. బర్డ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామన్నారు. సెంట్రలైజ్డ్ ఏసి పనితీరును పరిశీలించామన్నారు. ఎఫ్ఎంఎస్ అంశం బోర్డు పరిధిలో ఉందన్నారు. గోశాలలోని ఏనుగులు, గోవులు, వృషభాలకు సరైన ఆహారం అందిస్తున్నారని, ఇతర ఏర్పాట్లు బాగున్నాయని తెలిపారు. రానున్న వేసవిని దృష్టిలో ఉంచుకుని చేపట్టాల్సిన ఏర్పాట్లపై ప్రణాళిక రూపొందిస్తామన్నారు. విద్య, వైద్యం, గోసంరక్షణపై అవగాహన కోసం క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టినట్టు వివరించారు.
అనంతరం ఎస్వీ బాలమందిరాన్ని నూతన జెఈవో పరిశీలించారు. అక్కడ రథసప్తమి పర్వదినం కోసం ఆదిత్యహృదయం శ్లోకాలు, సూర్యాష్టకాన్ని విద్యార్థులు సాధన చేస్తుండడాన్ని పరిశీలించారు.
ఈ తనిఖీల్లో టిటిడి డిఈవో శ్రీ రామచంద్ర, గోశాల డైరెక్టర్ శ్రీ హరనాథరెడ్డి, బర్డ్ మెడికల్ సూపరింటెండెంట్ డా.. అంకారెడ్డి, శ్రీ పద్మావతి మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డా..కె.మహదేవమ్మ తదితరులు పాల్గొన్నారు.
తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.