VIP BREAK DARSHAN LIMITED TO PROTOCOL ON FEB 11 AND 12_ ఫిబ్రవరి 11, 12వ తేదీల్లో విఐపి బ్రేక్‌ దర్శనాలు ప్రోటోకాల్‌ ప్రముఖులకు ప‌రిమితం

Tirumala, 10 Feb. 19: In view of Radhasapthami on February 12, the VIP break darshan will be given to only protocol VIPs on February 11 and 12.

TTD has also cancelled all other privilege darshans through supatham entry including senior citizens, physically challenged, parents with infants below one year old, donors and also Angapradakshinam tokens on February 12 anticipating heavy pilgrim rush for the big fete.

All arjitha sevas including Astadala Pada Padmaradhana were also cancelled on the day of Radhasapthami.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs TIRUPATI

ఫిబ్రవరి 11, 12వ తేదీల్లో విఐపి బ్రేక్‌ దర్శనాలు ప్రోటోకాల్‌ ప్రముఖులకు ప‌రిమితం

తిరుమల, 10 ఫిబ్రవరి 2019: తిరుమల శ్రీవారి ఆలయంలో ఫిబ్రవరి 12న రథసప్తమి పర్వదినం సందర్భంగా సామాన్య భక్తుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఫిబ్రవరి 11, 12వ తేదీల్లో విఐపి బ్రేక్‌ దర్శనాలను ప్రోటోకాల్‌ ప్రముఖులకు మాత్రమే టిటిడి పరిమితం చేసింది.

అదేవిధంగా, ఫిబ్రవరి 12న చంటిపిల్లల తల్లిదండ్రులకు, వయోవృద్ధులు, దివ్యాంగులకు, దాతలకు సుపథం మార్గంలో కల్పించే ప్రత్యేక దర్శనాలను టిటిడి రద్దు చేసింది.

కాగా, ఫిబ్రవరి 12న రథసప్తమినాడు శ్రీవారి ఆలయంలో నిర్వహించే ఆర్జితసేవలైన అష్టదళపాదపద్మారాధన, కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్‌సేవ, వసంతోత్సవం, సహస్రదీపాలంకార సేవలు ర‌ద్ద‌య్యాయి. సుప్రభాతం, తోమాల, అర్చన సేవ‌ల‌ను ఏకాంతంగా నిర్వహిస్తారు.

ఫిబ్ర‌వ‌రి 12న అంగ‌ప్ర‌ద‌క్షిణ టోకెన్లు ర‌ద్దు

ర‌థ‌స‌ప్త‌మి ప‌ర్వ‌దినం కార‌ణంగా ఫిబ్ర‌వ‌రి 12న అంగ‌ప్ర‌ద‌క్షిణ టోకెన్ల‌ను టిటిడి ర‌ద్దు చేసింది. భ‌క్తులు ఈ విష‌యాన్ని గ‌మ‌నించి స‌హ‌క‌రించాల‌ని టిటిడి కోరింది.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.