FOLK ARTS SPECTACLE AT MADA STREETS_ మోహినీ అవతారంలో ఆకట్టుకున్న కళాబృందాల ప్రదర్శనలు

Tirumala, 27 September 2017: The folk arts display on four mada streets organised by various cultural projects of TTD as part of the cultural foray during the Brahmotsavams, kept the devotees spell bound on Wednesday.

As Lord Malayappaswamy graced on the Pallaki vahanam in Mohini avatar and moved along four mada streets, the exhibit presented by artistes belonging to HDPP, Dasa Sahitya, Annamacharya Project and the SV dance and music college captivated the devotees in the galleries of mada streets.

Focus of today’s cultural bonanza was the Tappeta Gullu folk dances by the tribal artists from Gangada village of Balijapeta mandal in Vizianagaram district. The troupe led by Sri N Majji with artists presented the skits from Ramayana, Sri Krishnavatara in folk format. Tappetagullu is a folk art form of the contemporary hip-hop style and it was a visual treat to devotees to see them jump in air beating their drums.

Another enchanting display was by Sri Anand and Balaji of Madurai who presented Dasavatara Umbrella. While Smt Hemalatha leader of Sri Garudadri bhajana mandali of Rajahmundry presented the Sri Krishna-Kaliamardhana episode enthralling the devotees.

Another notable feature of cultural activities in front of Mohini Vahanam today were the Keelu-gurralu (wooden horses)dance by the Sri Venkateswara Janapada bhajan mandali of Palamner led by Sri Ravindra of Chittor district.

The star attraction of the event was the Khoya dance by the tribal artists from East Godavari. It was performed by the 41 artists of Sri Maruti Nasik Dolu team lead by Sri Shivaramakrishna Rao. The chakka bhajana by Sri Venkateswara bhajana mandal, chandi drum beat display by the Sri Ramanjaneya troupe of Udupi (Karnataka) kept the audience spell bound in the mada streets.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI

మోహినీ అవతారంలో ఆకట్టుకున్న కళాబృందాల ప్రదర్శనలు

సెప్టెంబర్‌ 27, తిరుమల 2017: శ్రీవారి సాలకట్ల బ్రహ్మూెత్సవాల్లో ఐదో రోజైన బుధవారం ఉదయం పల్లకీపై మోహినీ అవతారంలో శ్రీ మలయప్పస్వామివారు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్‌, అన్నమాచార్య ప్రాజెక్టు, దాససాహిత్యప్రాజెక్టు ఆధ్వర్యంలో నిర్వహించిన కళాబృందాల ప్రదర్శనలు భక్తులకు ఆధ్యాత్మికానందం కలిగించాయి.

తప్పెట గుళ్ల జానపద నృత్యం :

విజయనగరం జిల్లా బలిజపేట మండలం గంగాడ గ్రామానికి చెందిన కళకారులు ప్రదర్శించిన తప్పెట గుళ్లు జానపద నృత్యం భక్తులను ఆకట్టుకుంది. శ్రీ ఎన్‌.మజ్జి ఆధ్వర్యంలోని ఈ కళాకారులు రెండేళ్లుగా బ్రహ్మూెత్సవాల్లో ప్రదర్శనలిస్తున్నారు. మొత్తం 15 మంది కళకారులు ఉన్నారు. వీరు పాదానికి సిరిమువ్వలు, తొడకు పెద్ద మువ్వలు, రంగురంగుల కాశికోట, ఛాతిపై తప్పెటను అమర్చుకుని కళాకారులు ప్రదర్శించారు. వీరు శ్రీవేంకటేశ్వరుడు, శ్రీరాముడు, శ్రీకష్ణునికి సంబంధించిన కీర్తనలను జానపద బాణీలో పాడుతూ నృత్యం చేశారు. వీరు గుండ్రంగా తిరుగుతూ పైకి ఎగురుతూ నృత్యం చేయడం ఆకట్టుకుంది.

శంఖు చక్ర నామాల దశావతార గొడుగు :

తమిళనాడులోని మధురైకి చెందిన శ్రీ ఆనంద్‌ శంఖు చక్ర నామాలతో కూడిన దశావతార గొడుగుతో వాహనసేవలో పాల్గొన్నారు. అదేవిధంగా హనుమంత, గరుడ చిహ్నాలతో కూడిన సురుటితో శ్రీ బాలాజి పాల్గొన్నారు. వీరిరువురూ ఆరేళ్లుగా బ్రహ్మూెత్సవాల్లో పాల్గొంటున్నారు. కొయ్యతో చేసిన ఈ గొడుగులో మత్స్య, కూర్మ, వరాహ, నరసింహ, వామన, పరశురామ, రామ, బలరామ, శ్రీకృష్ణ అవతారాల చిత్రాలను అందంగా చెక్కారు. పైన శంఖుచక్రాలు, గరుత్మంతుని రూపాలున్నాయి.

శ్రీకృష్ణుని కాళీయమర్ధనం :

రాజమండ్రికి చెందిన శ్రీమతి హేమలత ఆధ్వర్యంలో శ్రీ గరుడాద్రివాసా భజన మండలి సభ్యులు శ్రీకృష్ణుని కాళీయమర్ధనం ఘట్టాన్ని చక్కగా ఆవిష్కరించారు. కృష్ణుని వేషధారణలోని చిన్నారి కాళీయుడిని సంహరిస్తుండగా, ముందు వెనక వైపున గోపికలు ఆనందంతో నృత్యం చేశారు.

పలమనేరు కీలుగుర్రాలు :

పలమనేరుకు చెందిన శ్రీవేంకటేశ్వర జానపద భజన బృందం కీలుగుర్రాల ప్రదర్శన ఆకట్టుకుంది. శ్రీ రవీంద్రబాబు ఆధ్వర్యంలో మొత్తం 15 మంది కళాకారులు ఈ ప్రదర్శన ఇచ్చారు. వీరు 15 ఏళ్లుగా బ్రహ్మూెత్సవాల్లో ప్రదర్శనలు ఇస్తున్నారు. ఇందులో పొడుగు కాళ్లతో కళాకారులు చేసిన విన్యాసాలు ఆకట్టుకున్నాయి. సుబ్రమణ్యస్వామివారి కావడి నృత్యం అద్భుతంగా సాగింది.

కోయ నృత్యం :

తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి చెందన కళకారుల కోయ నృత్యం నయనానందకరంగా సాగింది. శ్రీ మారుతి నాసిక్‌ డోలు బృందానికి చెందిన శ్రీ శివరామకృష్ణ ఆధ్వర్యంలో 41 మంది కళాకారులు ఈ ప్రదర్శన ఇచ్చారు. ఇందులో కళకారులు అటవీ ప్రాంతంలోని కోయ వారు, రాక్షసుల వేషాలు ధరించారు. రాక్షసులు వేధించడం, శ్రీవేంకటేశ్వరస్వామివారి ఆశీస్సులతో కోయలు తప్పించుకోవడాన్ని నృత్య రూపంలో చేసి చూపారు.

అలాగే పారుపల్లికి చెందిన శ్రీవేంకటేశ్వర భజన మండలి చెక్కభజన, కర్ణాటకలోని ఉడిపికి చెందిన శ్రీ రామాంజనేయ చండీ బలగ వాద్య ప్రదర్శన భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.