FORMER CJI OFFERS PRAYERS _ తిరుమల శ్రీవారిని దర్శించుకున్న భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ
TIRUMALA, 27 AUGUST 2023: Former CJI Justice NV Ramana offered prayers in Tirumala temple on Sunday evening.
Both the TTD Chairman Sri B Karunakara Reddy and EO Sri AV Dharma Reddy received him at Mahadwaram and accompanied him to Srivari darshan.
Later he was offered Vedasirvachanam at Ranganayakula Mandapam followed by the presentation of Srivari Theertha Prasadams.
The former CJI also had darshan of Sri Bedi Anjaneya Swamy and offered coconuts at Akhilandam.
Earlier he also had darshan of Sri Padmavathi Ammavaru at Tiruchanoor.
TTD JEO Sri Veerabrahmam and DyEO Sri Govindarajan welcomed him and made darshan arrangements.
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ
తిరుమల, 2023 ఆగస్టు 27: భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ఆదివారం రాత్రి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయ మహద్వారం వద్దకు చేరుకున్న మాజీ ప్రధాన న్యాయమూర్తికి టీటీడీ ఛైర్మన్ శ్రీ భూమన కరుణాకర్ రెడ్డి, ఈవో శ్రీ ఎవి ధర్మారెడ్డి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.
అనంతరం రంగనాయకుల మండపంలో జస్టిస్ రమణకు శ్రీవారి ప్రసాదాలను అందజేశారు. ఆ తరువాత శ్రీ బేడి ఆంజనేయ స్వామివారిని జస్టిస్ ఎన్వీ రమణ దర్శించుకున్నారు. అఖిలాండం వద్ద కొబ్బరికాయలు కొట్టి మహాద్వారానికి నమస్కరించారు.
అంతకు ముందు జస్టిస్ ఎన్వీ రమణ తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయం ఎదుట జేఈవో శ్రీ వీరబ్రహ్మం, డెప్యూటీ ఈవో శ్రీ గోవిందరాజన్ స్వాగతం పలికి దర్శనం ఏర్పాట్లు చేశారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.