GOKULASTAMI CELEBRATIONS IN PAT _ సెప్టెంబ‌రు 7న తిరుచానూరు శ్రీకృష్ణస్వామి ఆలయంలో గోకులాష్టమి

TIRUPATI, 27 AUGUST 2023: As part of Gokulastami on September 7, Abhishekam will be performed to Sri Krishna Swamy mulavirat in Tiruchanoor.

 

In the evening snapanam will be observed to utsava deity in Sri Krishn Mukha Mandapam followed by Pedda Sesha Vahana seva in the night. Later Gokulastami Asthanam will be observed.

 

On September 8, on the day of Utlotsavam, Tirumanjanam and Unjal Seva will be observed.

 

TTD has cancelled Sahasra Deepalankara Seva on September 8 in the temple.

 

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

సెప్టెంబ‌రు 7న తిరుచానూరు శ్రీకృష్ణస్వామి ఆలయంలో గోకులాష్టమి

తిరుపతి, 2023 ఆగస్టు 27: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీకృష్ణస్వామి ఆలయంలో సెప్టెంబ‌రు 7వ తేదీన గోకులాష్టమి పర్వదినాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించనున్నారు.

గోకులాష్టమి రోజున ఉదయం శ్రీకృష్ణస్వామి మూలవర్లకు అభిషేకం, అర్చన నిర్వహిస్తారు. శ్రీ కృష్ణ‌స్వామి ముఖ మండ‌పంలో మ‌ధ్యాహ్నం 3 నుండి సాయంత్రం 4 గంట‌ల వ‌ర‌కు శ్రీ కృష్ణ స్వామి ఉత్స‌వ‌ర్ల‌కు స్నపన తిరుమంజనం, సాయంత్రం స్వామివారికి ఊంజల్‌సేవ జ‌రుగ‌నుంది. రాత్రి 7 నుండి 8.15 గంట‌ల వ‌ర‌కు స్వామివారు పెద్దశేష వాహ‌నంపై ఆల‌య నాలుగు మాడ వీధుల్లో విహ‌రించి క‌టాక్షించ‌నున్నారు. అనంతరం రాత్రి 8.30 నుండి 9 గంటల‌ వరకు గోపూజ‌, గోకులాష్ట‌మి ఆస్థానం నిర్వ‌హిస్తారు.

అదేవిధంగా సెప్టెంబ‌రు 8న ఉట్లోత్స‌వంను పుర‌స్క‌రించుకొని మధ్యాహ్నం 3 నుండి సాయంత్రం 4 గంట‌ల వ‌ర‌కు స్నపన తిరుమంజనం, త‌రువాత ఊంజల్‌సేవ జ‌రుగ‌నుంది. సాయంత్రం 6.15 నుండి రాత్రి 7.30 గంట‌ల వ‌ర‌కు స్వామివారికి ఉట్లోత్స‌వం, ఆస్థానం నిర్వహిస్తారు.

ఈ కార‌ణంగా సెప్టెంబ‌రు 8న ఆల‌యంలో స‌హ‌స్ర దీపాలంక‌ర‌ణ సేవ‌ను టీటీడీ ర‌ద్ధు చేసింది.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.