FREE KNEECAP AND HIP SURGERIES -BIRRD BOARD DECIDES _ బర్డ్ లో ఉచితంగా మోకీలు, తుంటి మార్పిడి సర్జరీలు
Tirupati, 26 Feb. 21: The BIRRD board on Friday decided to provide free implants and surgeries of Kneecap and hip freely to deserving poor and also launch Spinal Chord surgeries.
During the BIRRD Trust meeting held in the new building of the ortho hospital in the Chairmanship of TTD Board Chief Sri YV Subba Reddy, it was decided to provide free surgeries to all-white ration cards and pension cardholders.
While kneecap and hip surgeries are also done free for all Arogyasree cardholders, they have to pay Rs. 65-70,000 only for implants.
The meeting sanctioned Rs.3.5 crores for a new four-floor OPD block, the appointment of more doctors, purchase of MRI and CT scan to improve services to the poor in the institution.
The meet also deliberated on the feasibility of inviting eminent surgeons to offer free services at BIRRD and also to build three more Operation theatres to slash waiting for queues for operations.
TTD EO Dr KS Jawahar Reddy, Additional EO and BIRRD director Sri AV Dharma Reddy, Honorary Director of BIRRD Dr Madanmohan Reddy, TTD Health advisor Dr Seetha were also present.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI
బర్డ్ లో ఉచితంగా మోకీలు, తుంటి మార్పిడి సర్జరీలు
– వెన్నెముక ఆపరేషన్లకు శ్రీకారం
– ఎంఆర్ఐ, సి.టి. స్కాన్ యంత్రాల కొనుగోలుకు అనుమతి
– బర్ద్ ట్రస్ట్ బోర్డ్ సమావేశంలో నిర్ణయాలు
తిరుపతి 26 ఫిబ్రవరి 2021: బర్డ్ ఆసుపత్రిలో పేదలందరికీ ఉచితంగా మోకీలు, తుంటి మార్పిడి సర్జరీలు చేయాలని బర్ద్ ట్రస్ట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటిదాకా మోకీలు, తుంటి మార్పిడి సర్జరీలు మాత్రమే చేస్తున్న బర్డ్ లో త్వరలోనే వెన్నెముక ఆపరేషన్లకు శ్రీకారం చుట్టాలని నిర్ణయించారు.
బర్ద్ నూతన భవనంలోని సమావేశ మందిరంలో శుక్రవారం సాయంత్రం టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి అధ్యక్షతన ట్రస్ట్ సమావేశం జరిగింది. తెల్ల రేషన్ కార్డు దారులు, పెన్షన్ కానుక కార్డు దారులందరికీ ఉచితంగా సర్జరీలు చేయాలని నిర్ణయించారు. ఆరోగ్యశ్రీ కార్డు కలిగిన వారికి మోకీలు, తుంటి మార్పిడి సర్జరీలు ఉచితంగా చేయాలని, ఇంప్లాంట్స్ కు మాత్రం రూ 65 నుంచి 70 వేలు చెల్లించాలని తీర్మానించారు. రోగులకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించడానికి కొత్తగా డాక్టర్ల నియామకానికి ఆమోదం తెలిపారు. అధునాతన వైద్య పరికరాల కొనుగోలుకు సమావేశం ఆమోదం తెలిపింది. నూతన ఓపిడి బ్లాక్ లో 4వ అంతస్తు నిర్మాణానికి రూ.3 . 5 కోట్లు మంజూరు చేసింది. రోగుల సదుపాయం కోసం ఎంఆర్ఐ, సి.టి. స్కాన్ యంత్రాలు కొనుగోలు చేయడానికి సమావేశం ఆమోదించింది. దేశంలోని నిపుణులైన ప్రముఖ వైద్యులందరినీ సంప్రదించి వారికి వీలైన సమయంలో బర్డ్ కు వచ్చి ఉచితంగా సర్జరీలు చేసే ఏర్పాట్లు చేయడంపై సమావేశంలో ప్రాథమిక చర్చ జరిగింది. సర్జరీల వెయిటింగ్ సమయం తగ్గించడం కోసం కొత్తగా మూడు ఆరేషన్ థియేటర్లు నిర్మించాలని నిర్ణయం తీసుకున్నారు.
టీటీడీ ఈవో డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి, అదనపు ఈవో, బర్డ్ డైరెక్టర్ శ్రీ ఎవి ధర్మారెడ్డి, బర్డ్ గౌరవ డైరెక్టర్ డాక్టర్ ఎం. మదన్ మోహన్ రెడ్డి, టీటీడీ ఆరోగ్య విభాగం సలహాదారు డాక్టర్ శ్వేత సమావేశంలో పాల్గొన్నారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది