COW BE DECLARED AS NATIONAL ANIMAL _ గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలి

–       MORE MUHURTAM FOR SRI KALYANAMASTU

Tirupati, 26 Feb. 21: The HDPP, Dharmic wing of TTD has resolved on Friday to request the Union Government to declare Cow-Gomata as the national animal.

This was one of the major decisions of the HDPP’s Executive committee meeting held at Sri Padmavati Rest House in Tirupati which was presided by TTD Chairman Sri YV Subba Reddy.

The HDPP meeting also sought more Muhurtam from the TTD pundits council for the relaunch of the unique program of Sri Kalyanamastu – the mass marriage program facilitating free weddings for the poor.

The TTD chairman directed officials to frame guidelines for implementing the Gudiko- Gomata program on a national scale.

Officials informed that 31 temples from Telangana had applied for Gomata grants and after examination of facilities there the pairs of cow and calf will be handed over to them.

The meeting also decided that TTD should give shelter and funds for stray animals in towns and cities.

TTD EO Dr KS Jawahar Reddy, Board members Sri J Rameswar Rao, Sri Shiv Kumar, Sri DP Ananta, Sri Govind Hari, Additional EO Sri AV Dharma Reddy, HDPP members Sri Penchalaih, Sri Subba Rao, HDPP secretary Acharya Rajagopalan, OSD Sri Hemant were present.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలి
– కళ్యాణమస్తుకు మరిన్ని ముహూర్తాలు

హెచ్ డిపిపి కార్యనిర్వాహక మండలి సమావేశం తీర్మానం

తిరుపతి 26 ఫిబ్రవరి 2021: గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరాలని హిందూ ధర్మ ప్రచార పరిషత్ కార్యనిర్వాహక మండలి తీర్మానించింది.కల్యాణమస్తు సామూహిక వివాహాలకు మరిన్ని ముహూర్తాలు నిర్ణయించాలని పండిత మండలిని కోరింది. తిరుపతి శ్రీ పద్మావతి విశ్రాంతి గృహంలో శుక్రవారం రాత్రి టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి అధ్యక్షతన సమావేశం జరిగింది.

గుడికో గోమాత కార్యక్రమం దేశ వ్యాప్తంగా మరింత వేగంగా అమలు చేయడానికి మార్గదర్శకాలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. తెలంగాణ నుంచి 31 ఆలయాలు గోమాత కోసం దరఖాస్తు చేసుకున్నాయని అధికారులు వివరించారు. ఆలయాల్లో గోవు, దూడకు తగిన వసతి,వాటి పోషణకు అవసరమైన ఏర్పాట్లు పరిశీలించి 10 రోజుల్లో గోవులను అందించాలని అధికారులను ఆదేశించారు. పట్టణాల్లో వీధుల్లో తిరిగే గోవులను గోశాలలకు తరలించి అవసరమైతే వాటి పోషణకు టీటీడీ ద్వారా నిధులు ఇవ్వాలని నిర్ణయించారు. తెలుగు రాష్ట్రాల్లో ముందుగా కళ్యాణ మస్తు వివాహాలు నిర్వహించాలని నిర్ణయించారు.

టీటీడీ ఈవో డాక్టర్ కె ఎస్ జవహర్ రెడ్డి, పాలకమండలి సభ్యులు శ్రీ రామేశ్వరరావు, శ్రీ శివకుమార్, శ్రీ డిపి అనంత, శ్రీ గోవింద హరి, అదనపు ఈవో శ్రీ ధర్మారెడ్డి, డిపిపి సభ్యులు శ్రీ పెంచులయ్య, శ్రీ సుబ్బారావు, డిపిపి కార్యదర్శి ఆచార్య రాజగోపాలన్, డిపిపి ప్రత్యేకాధికారి శ్రీ హేమంత్ ఈ సమావేశంలో పాల్గొన్నారు.

సమావేశం అనంతరం చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలని శనివారం జరిగే పాలక మండలి సమావేశంలో తీర్మానం చేస్తామని చెప్పారు. దీనివల్ల గోవధను అరికట్టడానికి అవకాశం ఏర్పడుతుందని అభిప్రాయ పడ్డారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది