GAJA VAHANA SEVA IN GT _ గ‌జ వాహ‌నంపై శ్రీ గోవిందరాజస్వామి అభ‌యం

Tirupati, 21 May 2024: The annual Brahmotsavam in Sri Govindaraja Swamy temple on Tuesday evening witnessed Gaja Vahanam.

Sri Govindaraja atop mighty Gaja Vahana blessed His devotees.

Both the senior and junior pontiffs of Tirumala, FACAO Sri Balaji, DyEO Smt Shanti and others were present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

గ‌జ వాహ‌నంపై శ్రీ గోవిందరాజస్వామి అభ‌యం

తిరుపతి, 2024 మే 21: తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి బ్రహ్మోత్సవాల్లో ఆరో రోజైన మంగ‌ళ‌వారం రాత్రి 7 గంట‌ల‌కు శ్రీ గోవిందరాజస్వామివారు గ‌జ వాహ‌నంపై అభయమిచ్చారు. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.

హైందవ సనాతన ధర్మంలో రాజసానికి, రణరంగంలో గానీ, రాజదర్బారులో గానీ, ఉత్సవములలో గానీ గజానిదే అగ్రస్థానం. సాక్షాత్తు సిరుల తల్లి లక్ష్మీదేవికి ఇష్టవాహనం అయిన గజవాహనం స్వామివారికి వాహనంగా విశేష‌ సేవలు అందిస్తోంది.

ఈ కార్యక్రమంలో తిరుమల శ్రీ‌శ్రీ‌శ్రీ పెద్ద‌జీయ‌ర్‌స్వామి, శ్రీ‌శ్రీ‌శ్రీ చిన్న‌జీయ‌ర్‌స్వామి, ఎఫ్ ఎ అండ్ సిఏవో శ్రీ బాలాజీ, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమ‌తి శాంతి, సూపరింటెండెంట్‌ శ్రీ మోహ‌న్‌రావు, టెంపుల్ ఇన్‌స్పెక్ట‌ర్‌ శ్రీ ధ‌నంజ‌య‌, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.