GANDHI JAYANTHI OBSERVED- టిటిడి పరిపాలన భవనంలో ఘనంగా మహాత్మాగాంధీ 150వ జయంతి వేడుకలు  

Tirupati,2 Oct. 19: The 150th Birth Anniversary of Mahatma Gandhi was observed with patriotic fervour in TTD Administrative Building on Wednesday in Tirupati.

The Chief Audit Officer Sri Sesha Sailendra Gandhiji has shown the world the power of Non-violence and fondly called by everyone as Mahatma.

Welfare DyEO Smt Snehalatha, Spl.Gr.DyEO Smt Varalakshmi, Annamacharya Project Director Sri Viswanath,  Additional Health Officer Dr Sunil and other officers were also present. 

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

 

 

టిటిడి పరిపాలన భవనంలో ఘనంగా మహాత్మాగాంధీ 150వ జయంతి వేడుకలు  

తిరుపతి, 2019 అక్టోబరు 02: టిటిడి పరిపాలన భవనంలో ఘనంగా మహాత్మాగాంధీ 150వ జయంతి వేడుకలు బుధ‌వారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టిటిడి అధికారులు గాంధీ మహాత్ముని చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు.

 అనంత‌రం ముఖ్య గ‌ణాంక అధికారి శ్రీ శేష‌శైలేంద్ర ప్రసంగిస్తూ లక్ష్యం ఎంత ముఖ్యమో దాన్ని సాధించేందుకు అనుసరించాల్సిన మార్గం కూడా అంతే ముఖ్యమని గాంధీజీ తెలియజేశారన్నారు. అహింసామార్గం ద్వారా స్వాతంత్య్రాన్ని సాధించిన మహాత్ముడు గాంధీ అన్నారు. దేశప్రజల్లో జాతీయభావాన్ని పెంపొందించి ఒక్కతాటిపై నడిపించారని తెలిపారు. జాతిపిత మహాత్మాగాంధీ స్ఫూర్తితో మానవాళి సత్యం, స్వచ్ఛత, అహింసలను ఆచరించాలని కోరారు.

 ఈ కార్యక్రమంలో టిటిడి డెప్యూటీ ఈవోలు శ్రీమతి స్నేహలత, శ్రీమతి వరలక్ష్మీ, అద‌న‌పు ఆరోగ్య‌శాఖ అధికారి శ్రీ సునీల్‌, అన్నమాచార్య ప్రాజెక్టు సంచాలకులు శ్రీ విశ్వనాథశాస్త్రీ, ఇతర అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.  

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.