18 STATES TO PRESENT CULTURAL BONANZA DURING THE BRAHMOTSAVAMS- HDPP CHIEF_ 18 రాష్ట్రాల నుండి కళాబృందాల ప్ర‌ద‌ర్శ‌న‌లు : టిటిడి హిందూ ధర్మ ప్రచార పరిషత్తు కార్యదర్శి డా. రమణప్రసాద్

Tirumala, 2 Oct. 19: Devotees and pilgrims who thronged to witness Srivari annual Brahmotsavams will get an opportunity to feast on popular dance formats of India like Norda, Baredi, Akhara and Katta Dance Of Madhya Pradesh, Puja kunithan of  Karnataka, and Bhrigu Dance Of Assam.

For the first time TTD has invited 18 states to send dance cum cultural teams to participate in the Srivari Brahmotsavams 2019, says Dr Ramana Prasad, the Secretary of Hindu Dharma Prachara Parishad of TTD.

Briefing media at the Media Center Dr Prasad said the objective was to promote and project pan India cultural unity through showcasing cultural formats of all regions at the Srivari Brahmotsavams. Under the instructions of TTD EO Sri Anil Kumar Singhal,  letters were written to Cultural Secretaries of different states. The Cultural Department of Government of India has taken initiative and sent teams from different states.

He said about 677 artists in 39 teams from 18 states will present their arts st various platforms Tamil Nadu with 110 artists is the biggest team, followed by Madhya Pradesh and Karnataka. They included dancers, drum beaters, vocal and instrumental musicians.

He introduced team leaders of Manipur, Himachal Pradesh,  Madhya Pradesh, Gujrat,  Rajasthan,  Chattisgarh and the artists who said they were happy to perform in the abode of Sri Venkateswara Swamy and foresee to continue the same in future too.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

2019 శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు

18 రాష్ట్రాల నుండి కళాబృందాల ప్ర‌ద‌ర్శ‌న‌లు : టిటిడి హిందూ ధర్మ ప్రచార పరిషత్తు కార్యదర్శి డా. రమణప్రసాద్

అక్టోబరు 02, తిరుమల, 2019:   శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో 18 రాష్ట్రాల నుండి క‌ళాబృందాలు ప్ర‌ద‌ర్శ‌న‌లు ఇస్తున్నాయ‌ని, ఇన్ని రాష్ట్రాల నుండి క‌ళాకారులు రావ‌డం ఇదే మొద‌టిసారి అని టిటిడి హిందూ ధ‌ర్మ‌ప్రచార పరిషత్తు కార్యదర్శి డా. రమణప్రసాద్ తెలిపారు. తిరుమలలోని రాంభగీచా-2లో గల మీడియా సెంటర్‌లో బుధ‌వారం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు.

         ఈ సందర్భంగా డా.ర‌మ‌ణప్ర‌సాద్‌ మాట్లాడుతూ ఆయా రాష్ట్రాల క‌ళాకారులు స్థానిక సంప్ర‌దాయాల‌ను ప్ర‌తిబింబించేలా జాన‌ప‌ద బాణీలో ప్ర‌ద‌ర్శ‌న‌లు ఇస్తున్నార‌ని తెలిపారు. ఇందులో గుజరాత్ రాష్ట్రం నుంచి గ‌ర్భ, రాజ్ సాంప్రదాయ నృత్యాలు, ఛత్తీస్‌ఘ‌డ్‌ నుండి రౌత్ నృత్యం, కర్ణాటక నుండి పూజ కునిత, డొల్లు కునిత, చ‌క్క‌భ‌జ‌న‌, సమన కునిత, విర‌గాసి నృత్యాలు, కేరళ నుండి క‌ళాకారులు పంచ్ వాద్యం ప్రదర్శిస్తున్నార‌ని తెలిపారు. అదేవిధంగా, హ‌ర్యాణా నుండి గ్రుమార్ నృత్యం, ఒడిశా నుండి సాహియాత్ర‌, శంకాబంధ‌న్‌, ప‌శ్చిమ‌బెంగాల్ నుండి పురాలియ చావ్‌ను, మ‌ధ్య‌ప్ర‌దేశ్ నుండి నోర్దా, బ‌రేడి, అఖాడా, క‌త్తి నృత్యాలు, పంజాబ్ రాష్ట్రం నుండి బాంగ్ర నృత్యం, రాజ‌స్థాన్ నుండి అంగీ గైర్ నృత్యం, మ‌ణిపూర్ నుండి సంప్ర‌దాయ నృత్యం, అస్సాం నుండి  బీగు నృత్యం, ఉత్త‌ర‌ప్ర‌దేశ్ నుండి ప‌ర్వాహి, పూల నృత్యం, ఉత్త‌రాఖండ్ నుండి చోలియ నృత్యం, త‌మిళ‌నాడు నుండి కై శిలంబాట్టం, ఒయిలాట్టం, గ‌ర‌గాట్టం, త‌ప్పాట్టం, గోల్ కోలాట్టం, డ‌మ్మీ హార్స్‌, దేవ‌రాట్టం నృత్యం, పుదుచ్చేరి నుండి భ‌ర‌త‌నాట్యం, క‌లియాట్టం, హిమాచ‌ల్ ప్ర‌దేశ్ నుండి స్థానిక సంప్ర‌దాయ నృత్యం ప్ర‌ద‌ర్శిస్తున్నార‌ని తెలియ‌జేశారు. ఇత‌ర రాష్ట్రాల నుండి 39 బృందాల్లో 677 మంది క‌ళాకారులు వ‌చ్చిన‌ట్టు తెలిపారు.

 భక్తులకు భక్తిభావాన్ని మరింత పెంచేలా తిరుమల, తిరుపతిలలోని వివిధ వేదికలపై ఆద్యాత్మిక, భక్తి, సంగీతం, సాంస్కృతిక, ధార్మిక కార్యక్రమాలను హిందూ ధర్మ ప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్టు, దాస సాహిత్య ప్రాజెక్టు, శ్రీ వేంకటేశ్వర సంగీత నృత్య కళాశాలల భాగస్వామ్యంతో నిర్వహిస్తున్నామ‌న్నారు. తిరుమలలోని నాదనీరాజనం వేదిక, ఆస్థానమండపం వేదిక, తిరుపతిలో మహతి, రామచంద్రపుష్కరిణి, అన్నమాచార్య కళామందిరం వేదికలపై భక్తులను ఆకట్టుకునేలా కార్యక్రమాలను ఏర్పాటు చేశామన్నారు. వాహనసేవల్లో హిందూ ధర్మ ప్రచార పరిషత్తు నుండి చెక్క భజన, కోలాటం, అడుగుల భజన, పిల్లనగ్రోవి, గరగాట భజన, కీలుగుర్రాలు, కులుకు భజన, తప్పిటగుళ్ళు, బళ్ళారి డ్రమ్స్ తో భజనల బృందాలు ప్రదర్శనలు ఇస్తున్నాయని తెలిపారు. వివిధ దేవతామూర్తుల ప్రదర్శనలు, వెంకన్న గొడుగు భక్తులను అలరింపజేస్తున్నాయన్నారు. ప్రసిద్ద కళాకారులచే హరికథలు, భక్తి సంగీతం, పౌరాణిక నాటకాలు, యక్షగాన ప్రదర్శన, నృత్య సంగీతం వంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపట్టామన్నారు. తిరుమల నాలుగు మాడ వీధులలో ఆయా ప్రాజెక్టుల‌కు కేటాయించిన వేదికలపై వాహన సమయంలో నామసంకీర్తన చేస్తున్నారని చెప్పారు. టిటిడి విజిలెన్స్, హిందూ ధర్మ ప్రచార పరిషత్తు, వివిధ విభాగాల అధికారులు, సిబ్బంది చక్కటి సమన్వయంతో వాహన సేవల ముందు కళాబృందాలు ప్రదర్శనలు ఇస్తున్నాయన్నారు.

  మీడియా స‌మావేశంలో టిటిడి స‌హాయ ప్ర‌జాసంబంధాల అధికారి కుమారి పి.నీలిమ, క‌ళాకారుల ప్ర‌తినిధులు గుజ‌రాత్ నుండి శ్రీ‌మ‌తి వ్యాస్‌, మ‌ధ్య‌ప్ర‌దేశ్ నుండి శ్రీ అర‌వింద్ కుమార్ యాద‌వ్‌, మ‌ణిపూర్ నుండి శ్రీ రాజ్‌కుమార్‌, హిమాచ‌ల్ ప్ర‌దేశ్ నుండి శ్రీ సుంద‌ర్ శ్యామ్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.