VIBRANT FLOWER DECORATIONS SPEAKS THE GRANDEUR OF BRAHMOTSAVAMS_ నవరాత్రి బ్రహ్మోత్సవాలలో మరింత ఆకట్టుకునేలా పుష్పాలంకరణలు – గార్డెన్ డిప్యూటీ డైరెక్టర్ శ్రీ శ్రీనివాసులు

Tirumala, 11 October 2018: The flower decorations with tons of varieties of flowers, at the Srivari Temple, floral exhibition and all over Tirumala hill shrine has been attracting tens of thousands of pilgrims and acting as a cynosure during the nine day mega religious event.

Speaking at the Media centre in Ram Bhagicha -2, Sri G Srinivasulu, Deputy Director of Garden Department, said that 40 tons of traditional flowers are used in flower decorations, which were altered to changing patterns. Nearly 2 lakh cut flowers and 60,000 seasonal flowers were rolled out as per directions of the EO Sri Anil Kumar Singhal at the Mega Exhibitions where mythological characters were set up.

Similarly the idols of Lord Malayappaswamy and Lakshmi Devi were cared out in vegetables and a flower garden rose in 100 feet area. Cut flowers were also used to build shapes of elephant, horses with the help of 200 flower decorators during the Brahmotsavams and rolled out flower decorations all over Tirumala from GNC gates Vaibhava mandapam.


ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

నవరాత్రి బ్రహ్మోత్సవాలలో మరింత ఆకట్టుకునేలా పుష్పాలంకరణలు – గార్డెన్ డిప్యూటీ డైరెక్టర్ శ్రీ శ్రీనివాసులు

అక్టోబ‌రు 11, తిరుమల 2018: తిరుమ‌ల శ్రీ‌వారి నవరాత్రి బ్రహ్మూత్సవాల్లో మరింత ఆకట్టుకునేలా పుష్పాలంకరణలు చేపట్టామని టిటిడి గార్డెన్ విభాగం డిప్యూటీ డైరెక్టర్ శ్రీ శ్రీనివాసులు తెలిపారు. తిరుమలలోని రాంభగీచా-2లో గల మీడియా సెంటర్‌లో గురువారం ఉద్యాన‌వ‌న‌, ఆయుర్వేద‌, మ్యూజియం విభాగాల అధికారులు మీడియా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా శ్రీ శ్రీనివాసులు మాట్లాడుతూ నవరాత్రి బ్రహ్మోత్సవాలలో దాదాపు 40 టన్నుల సాంప్రదాయ పుష్పాలతో అలంకరణలు చేశామన్నారు. టిటిడి ఈవో శ్రీ అనిల్ కుమార్ సింఘాల్ ఆదేశాల మేరకు ఎప్పటికప్పుడు వస్తున్న మార్పులను జోడిస్తూ అలంకరణలు చేస్తున్నామన్నారు. నవరాత్రి బ్రహ్మోత్సవాలలో కట్ ఫ్లవర్స్ 2లక్షలు, సీజనల్ ఫ్లవర్స్ దాదాపు 60వేలు, పౌరాణిక విగ్రహాలు, సైకత శిల్పాలు, కూరగాయలతో శ్రీమలయప్ప స్వామివారు, లక్ష్మీదేవి విగ్రహాలను, వంద అడుగులలో ప్రహరీ ఉద్యానవనాన్ని ఏర్పాటు చేశామన్నారు. అదేవిధంగా, కట్ ఫ్లవర్స్ తో ఏనుగు, గుర్రం రూపాలను తీర్చిదిద్దామన్నారు. 250 మంది నిపుణులు పుష్పాలంకరణ‌ చేసేందుకు సహకారం అందించారని తెలిపారు. తిరుమలలో జీఎన్సి నుండి వైభవ మండపం వరకు పుష్పాలతో అలంకరణలు చేశామని చెప్పారు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.