RICH HERITAGE OF TIRUMALA HIGHLIGHTED_ భక్తులను మరింత ఆకట్టుకునేలా ఎస్వీ మ్యూజియంను తీర్చిదిద్దుతున్నాం – కల్నల్ చంద్రశేఖర్

Tirumala, 11 October 2018: TTD has rolled out an extensive program to popularize the rich heritage of Tirumala hill shrine and display invaluable artifact at the SV Museum through the mega expo which has been attracting multitude of pilgrims.

Colonel Chandrasekhar Manda, In-charge of the SV Museum briefing media at media centre in Tirumala on Thursday said that the various facets of devotional culture of Tirumala and centuries old rich heritage of Lord Venkateswara were showcased at the ongoing Mega Exhibition.

As per the directions of the EO Sri Anil Kumar Singhal the SV Museum has been refurbished and newly added 20 galleries will be opened up soon for devotees and in all, around 98 galleries are in the process of completion.

He said the SV Museum has at the exhibition showcased the heritage and culture of Lord Venkateswara with a real time temple experience besides a laser show on daily rituals including Abhisekam at Srivari Temple.

The Museum wing has also displayed old photos, arms and weapons used by kings during wars, coins, inscriptions and old rathams to give the devotees a glimpse of the heritage of Sri Venkateswara Swamy.


ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

భక్తులను మరింత ఆకట్టుకునేలా ఎస్వీ మ్యూజియంను తీర్చిదిద్దుతున్నాం – కల్నల్ చంద్రశేఖర్

అక్టోబ‌రు 11, తిరుమల 2018: తిరుమలలో ఎస్వీ మ్యూజియంను మరింత ఆకట్టుకునేలా తీర్చిదిద్దుతున్నామని మ్యూజియం ఇంచార్జీ అధికారి కల్నల్ చంద్రశేఖర్ తెలియజేశారు. టిటిడి ఈవో శ్రీ అనిల్ కుమార్ సింఘాల్ ఆదేశాల మేరకు మాస్టర్ ప్లాన్ లో భాగంగా భక్తులను మరింతగా ఆకట్టుకునేలా సాంఘీక, ధార్మిక, ఆధ్యాత్మిక, వారసత్వ, పురావస్తు, సాంకేతిక అంశాలను జోడించి ఎస్వీ మ్యూజియంను రూపొందిస్తున్నామన్నారు.

ఇప్పటికే 20 గ్యాలరీలను అదనంగా ఏర్పాటు చేశామని, మరో 98 గ్యాలరీలు ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రూపొందించామన్నారు. స్వామివారి పురాతన చిత్రాలు, ఆయుధాలు, నాణేలు, శిలాశాసనాలను మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతున్నామని అన్నారు. మరో 6 నెలల్లో పూర్తి స్థాయిలో భక్తులకు అందుబాటులోకి తీసుకువస్తామని చెప్పారు. స్వామి వైభవంతో కూడిన పోస్టర్స్, క‌ర‌ప‌త్రాలు కూడళ్లలో ఏర్పాటు చేస్తామన్నారు. సాంకేతిక సహకారంతో స్వామివారి విగ్రహాలకు ఆకట్టుకునే లైటింగ్ తో కూడిన వీడియోను మీడియాకు చూపించారు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.