GARUDA SEVA A GRAND SUCCESS THROUGH TEAM WORK _ సమిష్టి కృషితో గరుడసేవ విజయవంతం

TTD EO THANKS ALL FOR DEDICATED SERVICE TO DEVOTEES

Tirumala, October 16, 2026: TTD Executive Officer Sri Muddada Ravichandra said the Garuda Seva held on Friday night during the annual Navaratri Brahmotsavams of Lord Venkateswara was a grand success due to the collective efforts of all departments. He spoke to the media along with Additional EO Sri C.H. Venkaiah Chowdary after the Seva.

Despite heavy rain, devotees waited with unwavering devotion to witness Garuda Seva, and all were provided a full darshan of the Lord, the EO said. TTD ensured the supply of Annaprasadam, drinking water, almond milk, sundal, buttermilk and biscuit packets to devotees even during the rain.

Inspired by the motto “Service to devotees is service to the Lord,” the EO thanked the TTD Board, officers, staff, Vigilance and Security personnel, district administration, police, Srivari Sevaks and media representatives for their dedicated service.

He said officials had been instructed to prepare a report suggesting permanent solutions to provide better protection and facilities for devotees during heavy rains in the future.

The EO also appreciated the Electrical Department officials and staff for the attractive illumination arrangements, which added special charm to the Brahmotsavams.

TTD JEOs Dr A. Sharath and Sri Prabhala Gopinath, CVSO Sri K.V. Muralikrishna, District SP Sri L. Subbarayudu and other officials participated.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER

సమిష్టి కృషితో గరుడసేవ విజయవంతం

భక్తులకు విశేష సేవలందించిన ప్రతి ఒక్కరికీ ఈవో ధన్యవాదాలు

తిరుమల, అక్టోబరు 16, 2026: తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం రాత్రి జరిగిన గరుడసేవ సమిష్టి కృషితో విజయవంతమైందని టీటీడీ ఈవో శ్రీ ముద్దాడ రవిచంద్ర తెలిపారు. గరుడసేవ అనంతరం అదనపు ఈవో శ్రీ సీహెచ్ వెంకయ్య చౌదరితో కలిసి మీడియాతో మాట్లాడారు.

భారీ వర్షం కురుస్తున్నా భక్తులు అచంచలమైన భక్తిశ్రద్ధలతో స్వామివారి గరుడసేవను వీక్షించేందుకు వేచి ఉన్నారని, వారికి సంపూర్ణ దర్శనం కల్పించామని ఈవో తెలిపారు. వర్షంలోనూ భక్తులకు అన్నప్రసాదాలు, తాగునీరు, బాదంపాలు, సుండలు, మజ్జిగ, బిస్కెట్ ప్యాకెట్లు అందించినట్లు చెప్పారు.

“భక్తుల సేవే భగవంతుని సేవ” అనే స్ఫూర్తితో సేవలు అందించిన టీటీడీ పాలకమండలి, మరింత బాధ్యతగా విధులు నిర్వహించిన అధికారులు, సిబ్బంది, విజిలెన్స్, జిల్లా యంత్రాంగం, పోలీసు శాఖ, శ్రీవారి సేవకులు, మీడియా ప్రతినిధులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

భవిష్యత్తులో వర్షాల సమయంలో భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు శాశ్వత పరిష్కార మార్గాలతో నివేదిక సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు.

 బ్రహ్మోత్సవాల్లో మరింత ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన విద్యుత్ అలంకరణల ఏర్పాట్లపై ఎలక్ట్రికల్ శాఖ అధికారులను, సిబ్బందిని అభినందించారు.

ఈ కార్యక్రమంలో టీటీడీ జేఈవోలు డా. ఎ. శరత్, శ్రీ ప్రభల గోపీనాథ్, సీవీఎస్వో శ్రీ కేవీ మురళీకృష్ణ, జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు తదితరులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రధాన ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.