GARUDA SEVA HELD _ వైభవంగా ఒంటిమిట్ట శ్రీ కోదండరాముని గరుడసేవ

Vontimitta, 21 April 2024: The annual Navahnika Sri Ramanavami Brahmotsavam at Vontimitta entered the fifth day on Sunday.

In the evening, Sri Rama flanked by Sita Devi and Lakshmana Swamy took out a celestial ride on Garuda Vahanam to bless His devotees.

The paraphernalia comprised on colourful dance troupes leading the mighty vahanam in a grand manner.

DyEO Sri Natesh Babu, Superintendent Sri Hanumantaiah, and others were present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

వైభవంగా ఒంటిమిట్ట శ్రీ కోదండరాముని గరుడసేవ

ఒంటిమిట్ట, 2024 ఏప్రిల్ 21: ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదో రోజు ఆదివారం రాత్రి గరుడ వాహనంపై శ్రీ సీతారామలక్ష్మణులు భక్తులకు అభయమిచ్చారు.

రాత్రి 7 నుండి వాహనసేవ వైభవంగా జరిగింది. కేరళ డ్రమ్స్, భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి ఊరేగింపు కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.

గరుత్మంతుడు శ్రీమహావిష్ణువుకు నిత్యవాహనం. దాసుడుగా, సఖుడుగా, విసనకఱ్ఱగా, చాందినిగా, ఆసనంగా, ఆవాసంగా, వాహనంగా ధ్వజంగా అనేక విధాల సేవలందిస్తున్న నిత్యసూరులలో అగ్రగణ్యుడైన వైనతేయుడు కోదండరామస్వామిని వహించి కదిలే తీరు సందర్శనీయమైనది. 108 దివ్య దేశాలలోనూ గరుడ సేవ విశిష్టమైనది.

ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈఓ శ్రీ నటేష్ బాబు, సూపరింటెండెంట్ శ్రీ హనుమంతయ్య, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ నవీన్ తదితరులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.