ALL SET FOR VONTIMITTA KALYANAM _ ఏప్రిల్ 22 సా.6 30 నుండి 8:30 మధ్య వైభవంగా సీతారాముల కళ్యాణం -జేఈఓ శ్రీ వీరబ్రహ్మం

CELESTIAL MARRIAGE COMMENCES AT 6:30PM ON APRIL 22

VONTIMITTA, 21 APRIL 2024: The celestial Sri Sita Rama Kalyanam will be observed with utmost religious fervour on April 22 between 6:30pm and 8:30pm said TTD JEO Sri Veerabrahmam.

Along with the District Joint Collector Sri Ganesh Kumar, he inspected the galleries and other arrangements including Annaprasadam counters, drinking water facilities etc.

Speaking to the media he said this year the Talambralu will be distributed in the galleries itself while Annaprasadam after marriage.

He also said water points at the temple and Kalyana Vedika have also been arranged and toilets too for the sake of a multitude of devotees.

Top brass district and TTD officials were present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

ఏప్రిల్ 22 సా.6 30 నుండి 8:30 మధ్య వైభవంగా సీతారాముల కళ్యాణం –
జేఈఓ శ్రీ వీరబ్రహ్మం

ఏర్పాట్ల పరిశీలన

ఒంటిమిట్ట, 2024 ఏప్రిల్ 21: ఒంటిమిట్ట శ్రీ సీతారాముల కల్యాణాన్ని అత్యంత వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని జేఈవో శ్రీ వీరబ్రహ్మం చెప్పారు. సీతారాముల కళ్యాణ వేదికను ఆదివారం సాయంత్రం జేఈవో శ్రీ వీరబ్రహ్మం జిల్లా జేసీ శ్రీ గణేష్ కుమార్ మరియు ఇతర యంత్రాంగంతో కలిసి పరిశీలించారు.

ఈ సందర్భంగా జేఈవో మాట్లాడుతూ, శ్రీ సీతారాముల కళ్యాణం సోమవారం సాయంత్రం 6:30గం నుండి 8:30గం మధ్యలో అంగరంగ వైభవంగా నిర్వహించ నున్నట్లు తెలిపారు.

కళ్యాణానికి విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా టీటీడీ, జిల్లా యంత్రాంగం సమన్వయంతో కలసి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. కళ్యాణo వీక్షించే భక్తులకు శ్రీవారి లడ్డు ప్రసాదాలు, ముత్యాల తలంబ్రాలు గ్యాలారీల్లో నే అందించనున్నట్లు చెప్పారు.

కళ్యాణ వేదికకు ఇరువైపులా దాదాపు 150 కౌంటర్లలో శ్రీవారి సేవకుల సహకారంతో అన్నప్రసాదాలు కళ్యాణం తరువాత పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.

వాహనాల పార్కింగ్, భద్రత, సీసీ కెమెరాలు తదితర అంశాలను పరిశీలించి జేఈవో పలు సూచనలు చేశారు.

ఈ కార్యక్రమంలో అన్ని విభాగాల టీటీడీ ఉన్నతాధికారులు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.