GARUDA SEVA ON GARUDA PANCHAMI_ జూలై 28న తిరుమలలో గరుడ పంచమి గరుడవాహనంపై ఊరేగనున్న శ్రీవారు
Tirumala, 24 Jul. 17: On the auspicious day of Garuda Panchami on July 28, Garuda Seva will be observed in Tirumala.
Lord Sri Malayappa Swamy will be taken on a ride on mighty Garuda along the four mada streets on a celestial procession with religious fervour between 7pm and 9pm.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI
జూలై 28న తిరుమలలో గరుడ పంచమి గరుడవాహనంపై ఊరేగనున్న శ్రీవారు
తిరుమల, 2017 జూలై 24: జూలై 28వ తేదీ శుక్రవారంనాడు గరుడ పంచమి పర్వదినాన్ని పురస్కరించుకొని తిరుమలలో శ్రీ మలయప్పస్వామివారు రాత్రి 7.00 నుండి 9.00 గంటల వరకు తమ ఇష్టవాహనమైన గరుడునిపై తిరుమాడ వీధులలో ఊరేగి భక్తులను అనుగ్రహించనున్నారు.
శ్రీవారి వాహనాల్లోను, సేవకుల్లోను అగ్రగణ్యుడు గరుత్మంతుడు. ప్రతి ఏడాది గరుడ పంచమిని శుక్ల పక్షమి ఐదవ రోజు ఘనంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ”గరుడపంచమి” పూజను నూతన దంపతులు తమ వైవాహిక జీవితం ఆనందదాయకంగా వుండేందుకు, స్త్రీలు తమకు పుట్టే సంతానం గరుడునిలాగా బలశాలిగా, మంచి వ్యక్తిత్వం గలవాడిగా ఉండేందుకు పూజిస్తారని ప్రాశస్త్యం.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.