15TH CENTURY PURIFICATION FESTIVAL TO BE OBSERVED IN SRI TT_ ఆగస్టు 3 నుండి 5వ తేదీ వరకు తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి పవిత్రోత్సవాలు
Tirumala, 24 Jul. 17: The Festival of Purification-Pavitrotsavams, which made its entry in the long list of annual rituals that are being observed in the famous shrine of Tirumala temple by Tirumala Tirupati Devasthanams (TTDs) every year will be performed from August 3 to 5 for three days with Ankurarpanam on August 2.
This annual festival will be observed on the important days of Ekadasi, Dwadasi and Trayodasi in the month of Sravana as per Hindu calendar. This festival was first instituted by Saluva Mallaiah Deva Raja in 1463 A.D. at Tirumala during the period of Saluva Narasimha as per the inscription 157 present on inner prakaram of Srivari Temple.
During these three days, Tirumanjanam and Homam are performed to the main deity and as well as primary idols of Lord Sri Venkateswara Swamy.
The significance of the festival is that the priests symbolically seek the pardon of the Lord for their acts of all omissions and commissions committed either knowingly or unknowingly during the performance of daily rituals to the presiding deity inside the temple all through the year.
On the first day of Pavithra Homam, second day Pavitra Samarpana and on final day Purnahuti will be observed in the temple. TTD has cancelled Vasanthotsavam and Sahasra Deeplankara Seva on August 2, Tiruppavada, Nija Pada Darshanam, Kalyanotsavam, Dolotsavam, arjitha brahmotsavam, vasanthotsavam and Sahasra Deepalankara Seva on the remaining days.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI
ఆగస్టు 3 నుండి 5వ తేదీ వరకు తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి పవిత్రోత్సవాలు
తిరుమల, 2017 జూలై 24: కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ఆగస్టు 3 నుండి 5వ తేదీ వరకు పవిత్రోత్సవాలు వైభవంగా నిర్వహించనున్నారు. ఈ ఉత్సవాలు ఆగస్టు 2వ తేదీ బుధవారం అంకురార్పణతో ప్రారంభమవుతాయి.
సంవత్సరము పొడవున శ్రీవారి ఆలయంలో జరిగే అర్చనలు, కైంకర్యాలు, ఉత్సవాలు, యాత్రికుల వల్లగానీ, సిబ్బంది వల్లగానీ, అర్చక పరిచారకుల వల్లగానీ, తెలిసి తెలియక కొన్ని దోషాలు జరుగుతుంటాయి. వీటివల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా ఆగమశాస్త్రం ప్రకారం పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు.
ఈ ఉత్సవాల్లో భాగంగా మూడు రోజుల పాటు ఉదయం 9.00 నుండి 11.00 గంటల వరకు ఆలయంలోని సంపంగి ప్రాకారంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారికి స్నపన తిరుమంజనం వైభవంగా నిర్వహించనున్నారు. సాయంత్రం 6.00 నుండి 8.00 గంటల వరకు ప్రత్యేకంగా అలంకరించిన ఆభరణాలతో స్వామి, అమ్మవార్లు ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులను కటాక్షించానున్నారు. ఆగష్టు 3న పవిత్ర ప్రతిష్ట, ఆగస్టు 4న పవిత్ర సమర్పణ, ఆగస్టు 5న మహాపూర్ణహుతితో పవిత్రోత్సవాలు ముగుస్తాయి.
ఈ ఉత్సవాల సందర్భంగా ఆగస్టు 2వ తేదీ బుధవారం వసంతోత్సవం, సహస్రదీపాలంకారసేవ, ఆగస్టు 3 నుండి 5వ తేదీ వరకు తిరుప్పావడసేవ, నిజపాద దర్శనం, కల్యాణోత్సవం, ఊంజలసేవ, ఆర్జీత బ్రహ్మోత్సవం, వసంతోత్సవం, సహస్రదీపాలంకారసేవలను టిటిడి రద్దు చేసింది. ఆయా రోజుల్లో ఆర్చన, తోమాల సేవలను ఏకాంతంగా నిర్వహిస్తారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.