GAURI PEDDI’s CONTRIBUTION IN SOLVING ANNAMAYYA’S SANKEERTANS IS REMARKABLE _ అన్నమయ్య సంకీర్తనలను పరిష్కరించడంలో గౌరి పెద్ది వారి కృషి మరువలేనిది

•  SVIMS  VC AND DIRECTOR DR RV KUMAR

Tirupati, 21 January 2024: SVIMS VC and Director Dr RV Kumar, said Sri Gauri Peddi Ramasubba Sharma has done an incredible task in solving the Sankeertans of Sri Thallapaka Annamacharya

Addressing the 33rd death anniversary meeting of Sri Gauri Peddi Ramasubba Sharma held at Annamacharya Kalamandiram in Tirupati on Sunday evening, Dr R. V. Kumar spoke about the glory of Gauri Peddi’s literature. He also explained the relationship between medicine and worship.

Afterwards, Dr. Sitarama Rao, Principal of SV Oriental College gave a lecture on Sri Gouri Peddivari Pandityam-Avadhana Padya Sourabham.

Shri Gauri Peddi Venkata Bhagavan, TTD officials and denizens participated in this program.

PUSHPANJALI:

Earlier, during the day, the TTD officials paid floral tribute to the statue of Sri Gauri Peddi Ramasubba Sharma in the premises of SV Oriental College.

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

అన్నమయ్య సంకీర్తనలను పరిష్కరించడంలో గౌరి పెద్ది వారి కృషి మరువలేనిది

•⁠ ⁠స్విమ్స్ ఉపకులపతి డాక్టర్ ఆర్ వి కుమార్

– అన్నమాచార్య కళామందిరంలో ఘనంగా శ్రీమాన్ గౌరి పెద్ది రామసుబ్బశర్మ 33వ వర్ధంతి

తిరుపతి, 2024 జనవరి 21: శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల సంకీర్తనలను పరిష్కరించడంలో శ్రీమాన్ గౌరి పెద్ది రామసుబ్బశర్మ విశేష కృషి చేశారని స్విమ్స్ ఉపకులపతి డాక్టర్ ఆర్ వి కుమార్ చెప్పారు. తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో ఆదివారం సాయంత్రం శ్రీ గౌరి పెద్ది రామసుబ్బశర్మ 33వ వర్ధంతి సభ జరిగింది.

ఈ సందర్భంగా డాక్టర్ ఆర్ వి కుమార్ మాట్లాడుతూ, గౌరి పెద్దివారి సాహితీ వైభవం,
సప్త చండీ – నవ చండి గురించి తెలిపారు. శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల సంకీర్తనలు 27 పుటలు . పరిష్కరించడంలో గౌరి పెద్ది వారు విశేష కృషి చేశారన్నారు. వైద్యానికి, ఉపాసనకు గల సంబంధాన్ని వివరించారు.

అనంతరం ఎస్వీ ప్రాచ్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సీతారామారావు శ్రీ గౌరి పెద్దివారి పాండిత్యం- అవధాన పద్య సౌరభం అనే అంశంపై ఉపన్యసించారు.

ఈ కార్యక్రమంలో శ్రీ గౌరి పెద్ది వెంకట భగవాన్, టీటీడీ అధికారులు, పురప్రజలు పాల్గొన్నారు.

పుష్పాంజలి:

ఆదివారం ఉదయం 9 గంటలకు ఎస్వీ ప్రాచ్య కళాశాల ప్రాంగణంలోని శ్రీ గౌరి పెద్ది రామసుబ్బశర్మ గారి విగ్రహానికి టీటీడీ అధికారులు పుష్పాంజలి ఘటించారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.