GEETA JAYANTI PRIZES DISTIBUTIONS_ భగవద్గీత శ్లోకాల పోటీల విజేతలకు బహుమతుల ప్రదానం

Tirupati,November, 2017 : All successful students of the Bhagavat Gita recitation contest held by the TTD as part of the two day Geeta Jayanti were given prizes at the Annamacharya kalakendram thus evening.

Nearly 330 prizes were given away by Dr RRamana Prasad ,OSD of the HDPP to the contestants of S V High School from 8th and 9th standards Kum A Ramyasri got first prize and Kum D Vinita got the third prize while B Vagdevi of S V children’s Schhol bagged the second prize.

Later students and teachers of the SV music and dance college enthralled the audience with rendering of the ballet Sri Krishna Tarangini composed by Sri Narayana thirtha and Krishna Manjari composed by Tarigonda Vengamamba


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

భగవద్గీత శ్లోకాల పోటీల విజేతలకు బహుమతుల ప్రదానం

నవంబరు 30, తిరుపతి, 2017: వార్షిక గీతాజయంతి ఉత్సవాలను పురస్కరించుకుని తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో నిర్వహించిన భగవద్గీత శ్లోకాల కంఠస్తం పోటీల్లో విజయం సాధించిన విద్యార్థులకు గురువారం సాయంత్రం బహుమతుల ప్రదానోత్సవం జరిగింది. టిటిడి హిందూధర్మ ప్రచార పరిషత్‌ ఆధ్వర్యంలో తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో రెండు రోజుల పాటు జరిగిన గీతాజయంతి ఉత్సవాలు ముగిశాయి.

ఈ సందర్భంగా సాయంత్రం జరిగిన కార్యక్రమంలో టిటిడి హిందూధర్మ ప్రచార పరిషత్‌ ప్రాజెక్టు అధికారి డా|| ఆర్‌.రమణప్రసాద్‌ చేతులమీదుగా విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. 8, 9 తరగతుల విభాగంలో ఎస్వీ హైస్కూల్‌ విద్యార్థినులు ఎ.రమ్యశ్రీ ప్రథమ, డి.వినీత తృతీయ బహుమతులు సాధించారు. ఎస్వీ చిల్డ్రన్స్‌ హైస్కూల్‌కు చెందిన బి.వాగ్దేవి ద్వితీయ బహుమతి కైవసం చేసుకున్నారు.

ఎస్వీ హైస్కూల్‌కు చెందిన కె.కావ్య, ఎస్‌.సంధ్య, పిఎస్‌.కౌముది, ఎస్‌.ఢిల్లీప్రసాద్‌, ఎస్‌జిఎస్‌ హైస్కూల్‌కు చెందిన కె.ఝాన్సీ, కె.మీన, టి.స్నేహ, ఎం.చైతన్య, ఎల్‌.మానస, మార్గ చిన్మయ పాఠశాలకు చెందిన వై.లీషా కన్సొలేషన్‌ బహుమతులు పొందారు.

6, 7 తరగతుల విభాగంలో కేశవరెడ్డి స్కూల్‌కు చెందిన పి.హేమవెంకటనారాయణ ప్రథమ, కెబిఎస్‌ఎస్‌పిఎస్‌కెటి పాఠశాలకు చెందిన ఇ.తులసి ద్వితీయ, ఎస్‌జిఎస్‌ హైస్కూల్‌కు చెందిన బి.సంగీత తృతీయ బహుమతులు సాధించారు.

ఎస్వీ హైస్కూల్‌కు చెందిన కె.హర్షద్‌ పర్వేజ్‌, జి.నందకిషోర్‌, ఎస్‌జిఎస్‌ హైస్కూల్‌కు చెందిన ఎన్‌.సుమతి, వి.సౌజన్యశ్రీ, ఎల్‌.సుదర్శన్‌నాయుడు, ప్రతిభా విద్యాలయకు చెందిన ఇ.హవిస్మతి, కెబిఎస్‌ఎస్‌పిఎస్‌కెటి పాఠశాలకు చెందిన టి.పద్మావతి, ఎన్‌.యమున, ఎస్‌.యశ్విని కన్సొలేషన్‌ బహుమతులు అందుకున్నారు. ఆ తరువాత ఎస్వీ సంగీత కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు కలిసి శ్రీ నారాయణతీర్థుల ‘కృష్ణ తరంగిణి’, మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ ‘కృష్ణమంజరి’ నృత్యరూపకాలను ప్రదర్శించారు.

ఈ కార్యక్రమంలో టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్‌ సూపరింటెండెంట్‌ శ్రీ గుర్నాథం, కో-ఆర్డినేటర్‌ శ్రీ చెన్నకేశవులు నాయుడు ఇతర ఆధికారులు, భక్తులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.