GHANTA NINADAM AND MRIDANGANADASWARAM STAND SPECIAL ATTRACTION DURING SALLIMPU_ మహాసంప్రోక్షణలో ప్రత్యేక ఆకర్షణగా గంటానాదం, డోలు నాదస్వరం

Tirumala, 16 August 2018: The continuing ringing of gigantic bells located inside Ganta Mandapam by Gantapani and the Mridanga Nadaswaram by the artistes stood as a special attraction at Bangaru Vakili on Thursday during Sallimpu and Suddhi ceremonies.

The huge hall between the Garuda temple and the Bangaru vakili in the Ananda Nilayam is called the Mahamani Mandapam or the Ganta Mandapam. It has 16 pillars in four rows. It was built by the Minister of Vijayanagara Kingdom, Sri Mallana in 1417 and have images of Narasimha, Varaha ,Maha vishnu, Varadaraja and Venkateswara.

This is the venue for all major events like Suprabtha pathanam,Koluvu, Panchanga sravanam,adaya-vyaya nivedana .The major events like Sahasra Kalashabisekam and Tiruppavadai are held here and also titled as Asthana mantapam, as several traditional temple courts during Ugadi, Deepavali, Rama Navami, Sri Krishnasthami, Anivara Asthanam etc.are rendered here.There were two bells on the southern side of the bangaru vakili which are struck at the hour of Naivedya Nivedana. Hence it is also known as Tirumamani Mandapam.

Sri Ravi, Ghantapani, one who rings the huge bells, made it a record on Thursday by continuously ringing the bells without break during Sallimpu and Nivedana continuously for over one and a half hours. TTD Chairman Sri P Sudhakar Yadav, TTD EO Sri Anil Kumar Singhal, JEO Sri KS Sreenivasa Raju and other board members complimented Sri Ravi for his dedication.

MEALAM ENTHRALLS

On the other hand the Nadaswaram accompanied by Mridanga Nadam stood as a special attraction. Vidwan Sri MKS Shiva and Vidwan SRI MKS Natarajan, Nadaswara-Mridangam experts from Chennai enthralled the temple officials and staffs with their stupendous performance. The played Nagavarali, Tyagraja Kritis, Pibare Rama Rasam, Venkatachala Nilayam etc. and mused all during Naivedya Nivedana.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

మహాసంప్రోక్షణలో ప్రత్యేక ఆకర్షణగా గంటానాదం, డోలు నాదస్వరం

ఆగస్టు 16, తిరుమల 2018: తిరుమల శ్రీవారి ఆలయంలో గురువారం జరిగిన మహాసంప్రోక్షణ సందర్భంగా బంగారు వాకిలి చెంత నిర్వహించిన సళ్లింపు, శుద్ధి, నివేదన సమయాల్లో గంటానాదం, డోలు నాదస్వరం విన్యాసం ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

ఆనంద నిలయంలో బంగారు వాకిలి ఉన్న మండపాన్ని మహామణి మండపం లేదా గంటా మండపం అంటారు. ఇందులో నాలుగు వరుసల్లో మొత్తం 16 స్తంభాలుంటాయి. విజయనగర సామ్రాజ్యానికి చెందిన మంత్రి శ్రీ మల్లన్న 1417వ సంవత్సరంలో దీనిని నిర్మించినట్టు చారిత్రక ఆధారాలున్నాయి. ఈ మండపంలో శ్రీ వేంకటేశ్వరస్వామి, శ్రీ నరసింహ, శ్రీ వరాహ, శ్రీ మహావిష్ణు, శ్రీ వరదరాజస్వామివారి ప్రతిమలున్నాయి. సుప్రభాత పఠనం, కొలువు, పంచాంగ శ్రవణం, ఆదాయ వ్యయ నివేదన తదితరాలతోపాటు సహస్ర కలశాభిషేకం, తిరుప్పావడ సేవలు ఈ మండపంలోనే జరుగుతాయి. దీనిని ఆస్థానమండపం అని కూడా అంటారు. ఉగాది, దీపావళి, శ్రీరామనవమి, శ్రీకృష్ణాష్టమి, ఆణివార ఆస్థానం తదితర పర్వదినాలను ఇక్కడ నిర్వహిస్తారు. ఈ మండపంలో దక్షిణం వైపున రెండు గంటలున్నాయి. నైవేద్య నివేదన సమయంలో ఒక గంట పాటు ఈ రెండు భారీగంటలను మోగిస్తారు. ఈ కారణంగా దీన్ని తిరుమామణి మండపం అని అంటారు.

ఆలయంలో విధులు నిర్వహిస్తున్న ఘంటాపాణి శ్రీ రవి గురువారం నాడు సళ్లింపు, నివేదన సమయంలో ఒకటిన్నర గంటపాటు నిర్విరామంగా ఈ రెండు భారీగంటలను మోగించి స్వామిపట్ల తన భక్తిప్రపత్తులను చాటుకున్నాడు. ఎంతో ఏకాగ్రతతో గంటలను మోగించిన శ్రీ రవిని ఈ సందర్భంగా టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ పుట్టా సుధాకర్‌ యాదవ్‌, ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌, తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు ఇతర బోర్డు సభ్యులు అభినందించారు.

అదేవిధంగా, నైవేద్య నివేదన సమయంలో చెన్నైకి చెందిన నాదస్వర, డోలు విద్వాంసులు విద్వాన్‌ శ్రీ ఎంకెఎస్‌.శివ, శ్రీఎంకెఎస్‌.నటరాజన్‌ వాద్య విన్యాసం వినసొంపుగా సాగింది. ఈ సందర్భంగా వారు నాగవరాళి, త్యాగరాజ కీర్తనలు, పిబరే రామరసం…, వేంకటాచల నిలయం…. తదితర కీర్తనలను వీనులవిందుగా తమ వాయిద్యాల్లో పలికించారు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.