TIRUCHANOOR GEARED UP VARA MAHA LAKSHMI VRATAM_ ఆగస్టు 24న వరలక్ష్మీ వ్రతానికి విస్తృత ఏర్పాట్లు : టిటిడి తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్
Tiruchanoor, 16 August 2018: The temple of Padmavathi Devi in Tiruchanoor has geared up to host Vara Lakshmi Vratam on August 24.
In connection with this fete, Tirupati JEO Sri P Bhaskar convened a review meeting with all the officials concerned in the temple premises on Thursday evening.
The JEO said, the religious fete will be organised between 10am and 12 noon next Friday. 200 tickets will be issued on August 23. The price of each ticket is Rs.500 on which two persons will be allowed”, he added.
He instructed the concerned to erect LED screen at Radha Mandapam and make necessary decorations matching the occasion.
Special Grade DyEO Sri Munirathnam Reddy and other officials were also present.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
ఆగస్టు 24న వరలక్ష్మీ వ్రతానికి విస్తృత ఏర్పాట్లు : టిటిడి తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్
తిరుపతి, 2018 ఆగస్టు 16: సిరులతల్లి తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఆగస్టు 24న నిర్వహించనున్న వరలక్ష్మీ వ్రతానికి భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని విస్తృత ఏర్పాట్లు చేపడుతున్నట్టు టిటిడి తిరుపతి సంయుక్త కార్యనిర్వహణాధికారి శ్రీ పోల భాస్కర్ తెలిపారు. తిరుచానూరులోని ఆస్థానమండపంలో గురువారం ఆయన వరలక్ష్మీ వ్రతం ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ వరలక్ష్మీ వ్రతం టికెట్లను ఆగస్టు 23వ తేదీన 200 టికెట్లను ఆలయం వద్ద గల కౌంటర్‌లో విక్రయించాలని అధికారులకు సూచించారు. వరలక్ష్మీ వ్రతాన్ని భక్తులు తిలకించేందుకు వీలుగా ఆస్థానమండపంలో, రథమండపం వద్ద ఎల్‌ఇడి స్క్రీన్లు ఏర్పాటుచేయాలని ఆదేశించారు. అమ్మవారి ఆలయం, ఆస్థాన మండపం, ఇతర ప్రాంతాల్లో ఆకట్టుకునేలా పుష్పాలంకరణ, విద్యుద్దీపాలంకరణ చేపట్టాలని సూచించారు. కంకణాలు, కుంకుమ ప్యాకెట్లు, కరపత్రాలను సిద్ధంగా ఉంచుకోవాలని, భజన బృందాలను ఏర్పాటుచేయాలని హిందూ ధర్మప్రచార పరిషత్ అధికారులను ఆదేశించారు.
వరలక్ష్మీ వ్రతాన్ని ఎస్వీబీసీలో ప్రత్యక్ష ప్రసారాలు అందించేందుకు వీలుగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆస్థానమండపంలో భక్తులకు ఇబ్బందులు లేకుండా క్యూ లైన్లు ఏర్పాటు చేయాలన్నారు. అమ్మవారి దర్శనానికి అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసే అవకాశం ఉండడంతో ముందస్తుగా ఏర్పాట్లు చేపట్టాలన్నారు.
పురాణ ప్రశస్త్యం –
పూర్వం శంకరుడు పార్వతిదేవికి ఈ వరలక్ష్మీ వ్రతం విశిష్ఠత, అచరించవలసిన విధానాన్ని తెలియచేసినట్లు స్కంద, భవిష్యోత్తర పురాణాల ద్వారా తెలుస్తుంది. కావున సాక్షత్తు శ్రీ మహాలక్ష్మీ అవతరించిన దివ్యస్థలం తిరుచానూరు. శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మీ వ్రతం ఆచరించడం ఆనవాయితీ. శ్రవణ మాసంలో ఈ వ్రతం చేసిన మహిళలకు సత్సంతానం, దీర్ఘమాంగల్యసౌఖ్యం, సిరిసంపదలు, ఆరోగ్యం, కుటుంబసౌఖ్యం వంటి ఎన్నో మహాఫలాలు కలుగుతాయని పురాణాల ద్వారా తెలుస్తుందని అర్చకులు తెలిపారు.
వరలక్ష్మీ వ్రతం పోస్టర్లు ఆవిష్కరణ :
తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఆగస్టు 24న నిర్వహించనున్న వరలక్ష్మీ వ్రతం పోస్టర్లను తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్ ఆవిష్కరించారు. తిరుచానూరులోని ఆస్థానమండపంలో గురువారం ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ ఆగస్టు 24వ తేదీ శుక్రవారం ఉదయం 10.00 నుంచి 12.00 గంటల వరకు ఆస్థానమండపంలో వరలక్ష్మీవ్రతంను శాస్త్రోక్తంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. అనంతరం సాయంత్రం 6.00 గంటలకు స్వర్ణరథంపై శ్రీ పద్మావతి అమ్మవారు నాలుగుమాడ వీధులలో ఊరేగి భక్తులకు దర్శనమివ్వనున్నట్లు తెలియజేశారు. వరలక్ష్మీ వ్రతంలో భక్తులు(ఇద్దరు) రూ.500/- చెల్లించి పాల్గొనవచ్చన్నారు. ఈ కారణంగా అభిషేకానంతర దర్శనం, లక్ష్మీపూజ, కల్యాణోత్సవం, కుంకుమార్చన, ఊంజల్‌సేవలను టిటిడి రద్దు చేసినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో టిటిడి స్థానిక ఆలయాల ప్రత్యేకశ్రేణి డెప్యూటీ ఈవో శ్రీ మునిరత్నంరెడ్డి, విజివో శ్రీ ఆశోక్‌కుమార్ గౌడ్, డిపిపి కార్యదర్శి శ్రీ రమణ ప్రసాద్, ఇంజినీరింగ్ అధికారులు, ఆలయ అర్చకులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.