GHAT ROAD VINAYAKA WORSHIPPED_ మొదటి కనుమ రోడ్డులోని శ్రీవినాయక ఆలయంలో ఘనంగా చవితి పూజ

Tirumala, 2 Sep. 19: Pujas were conducted in a grand manner in both the Vinayaka temples located in the first and second ghat roads of Tirumala on monday in connection with Vinayaka Chaviti festival under the aegis of Transport Wing of TTD.

The Special Officer of Tirumala, Sri AV Dharma Reddy who took part in the Vinayaka Chaviti special puja in First Ghat Road said, the lord blesses the devotees with safe journey in both the ghat roads. As a thanksgiving, we celebrate the festival in a big way in both the Vinayaka Swamy temples located in First and Second Ghat Roads every year, he added.

CE Sri Ramachandra Reddy, GM Transport Sri Sesha Reddy, Tirumala Temple DyEO Sri Harindranath, CMO Dr Nageswara Rao and others participated.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

మొదటి కనుమ రోడ్డులోని శ్రీవినాయక ఆలయంలో ఘనంగా చవితి పూజ

తిరుపతి, 2019 సెప్టెంబ‌రు 02: తిరుమల మొదటి కనుమ రోడ్డులో గల శ్రీ వినాయకస్వామివారి ఆలయంలో టిటిడి రవాణా విభాగం ఆధ్వర్యంలో సోమ‌వారం చవితి పూజ ఘనంగా జరిగింది. వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని చలువపందిళ్లు వేసి ఆలయాన్ని అందంగా అలంకరించారు. అర్చకులు శాస్త్రోక్తంగా గణపతికి పూజలు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న టిటిడి తిరుమల ప్ర‌త్యేకాధికారి శ్రీ ఎ.వి.ధ‌ర్మారెడ్డి మాట్లాడుతూ ఇక్కడి స్వామివారి ఆశీస్సులతో భక్తులు సురక్షితంగా కనుమ రోడ్డులో ప్రయాణిస్తున్నారని చెప్పారు. రెండు ఘాట్ రోడ్ల‌ల‌లో శ్రీ‌వారి భ‌క్తులు సుర‌క్షిత ప్ర‌యాణానికి ప్ర‌తి సంవ‌త్స‌రం టిటిడి రవాణా విభాగం ఆధ్వర్యంలో వినాయకస్వామివారికి పూజ‌లు నిర్వ‌హిస్తున్న‌ట్లు తెలిపారు. వినాయకుడు అందరి జీవితాల్లో విఘ్నాలు తొలగించి మంచి జరిగేలా చూడాలని ఆకాంక్షించారు.

ఈ సందర్భంగా అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు సంగీత కార్యక్రమం నిర్వహించారు. అనంత‌రం తిరుమల ప్ర‌త్యేకాధికారి కళాకారులను స‌న్మానించారు.

ఈ కార్యక్రమంలో టిటిడి సిఇ శ్రీ రామ‌చంద్ర‌రెడ్డి, శ్రీవారి ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ హ‌రీంద్ర‌నాధ్‌, రవాణా విభాగం జనరల్‌ మేనేజర్‌ శ్రీ శేషారెడ్డి, సిఎమ్‌వో డా|| నాగేశ్వరరావు, ఇతర అధికారులు, డ్రైవర్లు పాల్గొన్నారు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.